న్యూఢిల్లీ, మార్చి 24: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగినట్లు ఈ-కామర్స్‌కు చెందిన ఈ-బే నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. దేశంలో ఢిల్లీ వాసులు ఆన్‌లైన్‌లు చాక్‌లెట్లు కొనుగోలు పట్ల అత్యంత ఆసక్తిని కనబరుస్తుంటే, చెన్నై వాసులు బాటరీతో నడిచే ఆటవస్తువుల కొనుగోళ్లను నిర్వహిస్తున్నారు. కోల్‌కతా వాసులు టిబెట్‌కు చెందిన వస్తువుల కొనుగోలు పట్ల ఆసక్తిని కనబరుస్తూ సేకరిస్తున్నట్లు ఆ సర్వే తెలియచేసింది. 2012 నాటికి ఆన్‌లైన్ లెక్కల ప్రకారం, ముంబయి నగర వాసులు ఫ్యాషన్ జ్యూయలరీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తుండగా బెంగళూరువాసులు ఆరోగ్యంపై బెంగతో కాబోసు యోగా వీడియోలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. జూలై 2011 నుంచి డిసెంబర్ 2012 వరకు జరిపిన ఆన్‌లైన్ కొనుగోళ్ల లెక్కలను ఈ-బే సేకరిస్తే ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అహ్మదాబాద్ వాసులు లోదుస్తుల కొనుగోళ్ల పట్ల ఆసక్తి కనబరచగా, హైదరాబాదీయులు ఎలక్ట్రిక్ షేవర్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. జైపూర్ వాసులు టాయ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక అన్ని నగరాల కంటె ఢిల్లీ వాసులు ఈ-కొనుగోళ్లు ఎక్కువ చేస్తుంటే, తర్వాత ముంబయి, జైపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్,కోల్‌కతా, చంఢీగడ్, పూణె ఉన్నాయి. ఇక ఆరుబ్రాండ్ల హ్యాండ్‌సెట్లు బాగా అమ్ముడు పోతున్నాయి. అవి శ్యామ్ సంగ్, ఆపిల్, సోనీ, నోకియా, బ్లాక్ బెర్రీ, మైక్రోమ్యాక్స్ అమ్ముడు బోగా తర్వాత స్కాన్ డిస్క్, కెనన్, ట్రాన్సిండ్, నికాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్, డిజిటల్ వస్తువులు ఆన్‌లైన్‌లో బాగా కొనుగోలు చేస్తున్నారు. ఈ-వ్యాపారం ద్వారా సుమారు 4,347 కోట్లరూపాయల మేర వ్యాపారం సాగుతోంది.
* ఢిల్లీ వాసులు చాక్‌లెట్లు * హైదరాబాద్ వాసులు ఎలక్ట్రిక్ షేవర్లు
english title:
d
Date:
Monday, March 25, 2013