Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

బీస్ సాల్‌కే బాద్ జంజీర్!

Image may be NSFW.
Clik here to view.

‘మున్నాభాయ్’కి దక్కిన గ్లామర్, కీర్తిప్రతిష్ఠల వైభోగ జీవితం- అది బెయిలుమీద వుండగానే కావచ్చును గానీ- 1993 బాంబు దాడుల కేసులోని మిగతా నేరస్థులు ఎవ్వరికీ దక్కలేదు. సంజయ్‌దత్ అమ్మా, నాన్నా అయిన సునీల్‌దత్, నర్గీస్‌లు రుూ దేశానికి చేసి చూపించిన సేవలు రుూ దారి తప్పిన కుమార రత్నానికి యించుమించు 2007లో మున్నాభాయ్‌కి రెండో దఫా బెయిలు దొరికే దాకా కాపాడాయి.
ఇరవై సంవత్సరాల తర్వాత - (బీస్సాల్‌బాద్) తిరిగి ‘జంజీర్’ (సంకెళ్లు) సంజయ్‌ని చేతులు జాచమని అడుగుతున్నాయ్. రెండు గంటల పది నిమిషాల వ్యవధిలో మార్చి 12, 1993న జరిగిన ఘోర దారుణ ప్రేలుళ్ల కేసులో 257 మంది అమాయకులు బలైపోయారు. 700 మంది దాకా గాయపడ్డారు. నూట ఇరవై ముగ్గుర్ని పట్టుకుని ‘టాడా’కోర్టు విచారించింది. ఈ నేరస్థులలో 117వ నెంబర్- మన మున్నాభాయ్‌ది. ఇవాళ- ‘మంచి బాలుడు’- షూటింగ్‌లకు హాజరగును- గొప్ప నటన ప్రదర్శించును... సంఘ సేవకుడుగా పేర్గాంచిన మున్నాభాయ్‌కి లోగడ పడ్డ ఆరేళ్ల శిక్షను ఒక ఏడాది తగ్గించి- ఐదు సంవత్సరాలకే కుదించి- లోగడ జైల్లో గడిపిన కాలాన్ని మినహాయించి- తతిమ్మా కాలాన్ని- కారాగారంలో గడపమని- సుప్రీంకోర్టు ఒక తీర్పు అందించడమే ఒక అదృష్టం. కోర్టువారి ఔదార్యం కూడా పదమూడు సంవత్సరాలు- సంజయ్‌దత్ మీద- ‘టెర్రరిస్టు’ చట్టం ముద్రపడి వెంటాడింది.
‘టాడా’ కోర్టు విచారణతో- టెర్రరిస్టు ముద్ర చెరిగిపోవడమే యివాల్టికి- సంజయ్‌కి గానీ- అతని హితైషులకి కానీ, సంబరాలు చేసుకోదగ్గ సంగతి. వెనక్కి తిరిగి చూస్తే 1993నాటి సంఘటన- ఘోర ప్రేలుళ్ల ఉదంతం- ఇరవై ఏళ్లు కోర్టు కచేరీలలో మ్రగ్గిపోడం ఎందరి హృదయాలనో కలిచివేసింది.
సామాన్యమైన కేసు కాదు యిది. ప్రపంచంలో ద్వితీయ ప్రపంచ యుద్ధం తర్వాత- ఆర్‌డిఎక్స్ పదార్థాన్ని (యింత ఎక్కువగా) మరెక్కడా, ఎవ్వరూ ఉపయోగించలేదు. చారిత్రాత్మకమైన ఘోర నేర ఉదంతం అది. అటువంటి కేసులో మున్నాభాయ్ 1993-ఏప్రిల్ 19న ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టయినాడు. ఆరోపణ అనండి- నేరం అనండి మన మున్నాభాయ్ చేసినదేమిటి? అని చూద్దాం.
జనవరి 1993నుంచి ఏప్రియల్ 1993 దాకా - అతను అక్రమంగా- అనధికారికంగా- బ్లాస్ట్ కుట్రకి చెందిన- మూడు ఏ.కె-56 రైఫిళ్లని- వాటిలో దట్టించే మందుగుండు సామగ్రిని- తొమ్మిది ఎం.ఎం. పిస్టల్, దాని తూటాలు సహా కొన్ని చేతి బాంబుల్ని తన దగ్గర దాచడానికి పూనుకున్నాడు. ఇది అక్రమంగా రుూ దేశంలోకి ప్రవేశించిన- దావూద్ ఇబ్రహిమ్‌కి చెందిన సరుకు. మరి అటువంటి ఘోర తప్పిదం- దేశద్రోహం క్రిందికి రాదా?
ఐతే- ‘‘బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత- నామీదా, నా కుటుంబ సభ్యుల మీద బెదిరింపులు ఎక్కువ కావడంతో- వీటిని సంపాదించాను’’ అని చెప్పుకొచ్చిన సంజయ్‌దత్- టాడా కోర్టులో- టెర్రరిస్ట్ ముద్ర నుంచి విముక్తుడు అవడమే మున్నాభాయ్ అదృష్టం. సదరు అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి దేశంలోకి ప్రవేశించడానికి- లంచం పట్టిన నేరానికి గాను- పదమూడు మంది పోలీసు; కస్టమ్స్‌శాఖ అధికారులకి శిక్షలు ఖరారు అయినాయి.
సంజయ్‌దత్‌కి రుూ బెయిలు కాలంలోని సత్‌ప్రవర్తన చూసి జెయిలు తప్పించాలి అన్న వాదనను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చిందీ అంటే తప్పులేదు. దానిని- సంజయ్‌దత్‌గారి లాయరే- సమర్థించినట్లు మాట్లాడాడు. మున్నాభాయ్ కోర్టు విధించిన శిక్షను శిరసావహించగల ధీమంతుడు- అని ఆ లాయర్‌గారు వ్యాఖ్యానించాడు. సంజయ్‌దత్ మొదట్నుంచీ దారితప్పి- ‘డ్రగ్ అడ్డిక్ట్’అయి, తిరిగి సన్మార్గంలోకి ప్రవేశించిన చెడ్డ బాలుడే! కాకపోతే పద్ధెనిమిది మాసాల కారాగార వాసం అతనిలో గొప్ప మార్పుతీసుకొచ్చింది. ఇవాళ యాభై మూడేళ్ల గ్లామర్ బోయ్ మున్నాభాయ్ మీద 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఇరుక్కుపోయిన నిర్మాతలు- ‘‘మా సంజూభాయ్‌కి ఒక్క ఏడాది శిక్ష మాత్రమే/ తగ్గించడం- మా అందరి మనసులూ కలిచివేసింది’’- అంటూ బుడిబుడి దీర్ఘాలు తీయడం అమాయకులైన కొంతమంది ప్రేక్షకులు హర్షిస్తారేమో గానీ లోగడ- 189 మంది నేరస్తులపై కోర్టులో సమర్పించబడ్డ పదివేల పుటల నివేదిక చూస్తే- రుూ ‘దత్ జూనియర్’ మీది ఆరోపణలు అర్ధమవుతాయి.
ఇవాళ కూడా-రుూ కేసులో విచారించబడ్డ అందరికన్నా- మున్నాభాయ్ లక్కీఫెలో- అతని అమ్మానాన్నల పుణ్య ఫలమది. ఇద్దరు (కవలలు) పిల్లల తండ్రి... ద్వితీయ వివాహం చేసుకున్నా- మంచి సంసారి- సంఘ సేవకుడు- గొప్ప నటుడూ- అన్నీ కలగలిపి ఆలోచించే... సుప్రీంకోర్టు అతనికి ఏడాది శిక్ష తగ్గించింది. పైగా లొంగిపోడానికి నెల రోజులు గడువు కూడా యిచ్చింది. వీ.కే. జంజీర్ సినిమాల్ని పూర్తిచేసుకుని (పాత జంజీర్‌నే మళ్లీ తీస్తున్నారు) ‘ఉంగలీ’, ‘పోలీసుగిరీ’ సినిమాల్ని కూడా రేయింబవళ్లు కష్టపడితే ఎట్లాగైనా పూర్తిచేసుకోగలడు. ఎనలేని కష్టాలు పడ్డాడు. మొదటి భార్య క్యాన్సర్‌కి గురిఅయి మరణించింది. తల్లి నర్గీస్ మరణం అతణ్ని క్రుంగదీసింది. ‘డ్రగ్స్’ వ్యసనం నుంచి బయటపడడమే కష్టమైపోయింది. కానీ, యివాళ యాభైమూడు సంవత్సరాల రుూ నటుడికి- అన్నీ అపఖ్యాతులు, కళంకాలు- రుూ శిక్షతో పటాపంచలైపోతాయి. సంజయ్‌దత్- నిర్మాతలకు షూటింగ్ పూర్తిచేసి- వాళ్లడుగుతూ వున్న ‘‘పవుండాఫ్ ఫ్లష్’’- వాళ్లకి యిచ్చేసి- కారాగారానికి పోయి- వివేకం, విచక్షణ, బాధ్యత తెలిసిన ఒక నూతన వ్యక్తిగా రావడమే కొత్త ‘సంజయ్‌దత్ గిరీ’ అవుతుంది!
విష్ హిమ్ ఏ పీస్‌ఫుల్ రిమోర్స్!

‘మున్నాభాయ్’కి దక్కిన గ్లామర్, కీర్తిప్రతిష్ఠల వైభోగ జీవితం
english title: 
bc

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>