మెకాలే విద్యావిధానం మంచిదే. దానికి ప్రత్యామ్నాయం చూపించకుండానే విమర్శిస్తున్నారంటూ ఒక పాఠకుడు విమర్శించారు. ప్రత్యామ్నాయాలు లేకేం? విజ్ఞాన భారతి, సరస్వతీ విద్యాలయ పేరులతో చాలాచోట్ల నడుస్తున్న పాఠశాలలు మెకాలేకి ప్రత్యామ్నాయాలే. అయితే అవి తెలుగు మీడియం అవడవంల్ల రాష్టవ్య్రాప్తంగా విస్తరించలేకపోయాయి. ఆ విద్యార్థులు కూడా మెకాలే విద్యార్థులతో పోటీపడి ర్యాంకులు సాధిస్తూనే ఉన్నారు.
- శుభ, కాకినాడ
ఉగ్రవాద సంస్థలను నిషేధించండి
లష్కరేతోయిబా, ఇండియన్ ముజాహిదీన్ ఇత్యాది ఉగ్రవాద సంస్థలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? పై సంస్థలు పేట్రేగిపోయి అమాయక ప్రజలను అసంఖ్యాకంగా అంతంచేస్తున్నా ప్రభుత్వాలు కేవలం ప్రేక్షకుల వలే ఎందుకు వ్యవహరిస్తున్నాయ? 1947లో దేశ విభజన జరిగిన నాటినుండి లక్షలాది మంది దిక్కులేని చావులకు గురౌతున్నా చూసీచూడనట్లున్న విధానం ఎవరివల్ల జరుగుతుంది? పాతబస్తీలో, బంజారాహిల్స్‌లో తనిఖీలు జరిపి, తిష్ఠవేసుకున్న విదేశీయులను ఎందులకు వెనక్కి పంపరు? తొమ్మిదేళ్ళ యూపీఏ సర్కారు హయాంలో జరిగిన 41 ఉగ్రవాద దాడుల్లో 1273 మంది అమరులైన సంగతులను ప్రభుత్వం ఎందులకు పరిగణించడంలేదు? మా తదుపరి లక్ష్యం బేగంబజార్ అని లష్కరే తోయిబా పేరిట ప్రకటించడం ఆందోళన కలిగించడం లేదా? గతంలో యిటువంటి దురదృష్ట సంఘటనలు చోటుచేసుకున్న నేపధ్యంలో ప్రధానమంత్రి మొదలు తదితర ముఖ్యమంత్రులు, మంత్రులు, బాధ్యతగల రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి వైదొలగే సాంప్రదాయం వుండేది. ప్రస్తుతం ఆ ఆచారం మాసిపోయి మూర్ఖంగా పదవులను గట్టిగా పట్టుకొని, ‘‘మేము రాజీనామాలు చేయనే చేయము’’ అని ఎదిరిస్తున్నారు. ధీరులైన సైనిక నాయకులు, రక్షక భటులు దోషులను కఠినంగా శిక్షించాలని పట్టుపట్టినా, అరాచక రాజకీయ నాయకుల ప్రభావంవలన నీరుగారిపోవుచున్నారు. భవిష్యత్‌లోనైనా బహుజాగ్రత్తలు తీసికొని ఉగ్రవాద సంస్థలను నిషేధించి, ఆబాలగోపాలాన్ని రక్షించేందులకు తక్షణం తగిన చర్యలను చేపట్టి, అమలుచేసి మన భారత దేశాన్ని పరిరక్షిస్తారని ఆశిస్తున్నాము.
- సాయిరామానందస్వామి, పొదలకొండపల్లె
చేయూత కరువైన నేతన్నలు
నేతన్నలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాం కులు అలసత్వం చేస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయ. నేతన్నలు విద్యలో చాల వెనుకబడినవారు, కుటుంబం యావత్తూ కష్టించినా కడుపు నిండని వారి ఆదాయం, ప్రకృతి వైపరీత్యాలకు, ప్రస్తుత అధిక ధరలకు తట్టుకోలేక ఆత్మహత్యలకు, ఆకలి చావులకు గురవుతున్నారు. ఎన్నో రకాలైన ప్రభుత్వ పథకాలున్నాయి. కాని వాటి ఫలితాలు నేతన్నలకు అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, సం బంధిత శాఖలో పనిచేస్తున్నవారు నేతన్నలకు మార్గదర్శకులుగా వారికి వివిధ పథకాలు గూర్చి తెలిపి వారికి వాటి ఫలితాలు అందేటట్లు చూడాలి. ప్రభుత్వం కూడ ఎంతవరకు పథకాలు అమలగుతున్నాయ, అర్హులకు అందుతున్నది లేనిదీ నేతన్నల పిల్లలకు చదువులలో స్కాలరుషిప్పులు ఇంకా అనేక విషయాలలో నేతన్నలను ఆదుకోవాలి. వివిధ పథకాల వివరాలు వారకి తెలియజేయాలి.
- రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం
విద్యాసంపద
సంపదలన్నింటిలో విద్యా సంపద గొప్పది. అదే విధంగా అన్ని దానాల్లో విద్యాదానం కూడా మంచిది. మిగిలిన సంపదలు విద్యవల్ల సాధించవచ్చు. అంతేకాకుండా విద్యలేనివాడు వింత పశువు అని కూడా పూర్వకాలంనుంచి పేర్కొంటున్నారు. విద్య ఇచ్చినకొద్దీ పెంపు అవుతుంది.దేశంలో అక్షరాస్యతలో కేరళ రాష్ట్రానిది అగ్రస్థానమంటున్నారు. బీహార్, రాజస్థాన్‌లో చాలా తక్కువ అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే అక్షరాస్యత 70% వరకు వచ్చింది. ప్రాథమిక విద్యకి స్కూల్ విద్యను గ్రంథాలయాలు, ఆటలు, తోట పని వాటికి ప్రాముఖ్యతను ఇవ్వాలి.
- వి.బాలకేశవులు, గిద్దలూరు
మెకాలే విద్యావిధానం మంచిదే.
english title:
p
Date:
Monday, March 25, 2013