న్యూఢిల్లీ, మార్చి 28: ఏకీకృత లైసెన్స్ విధానం (యుఎల్)పై నెలలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని టెలికాం కార్యదర్శి ఆర్. చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ఈ విధానం అమలులోకి వస్తే వినియోగదారులకు సేవలు అందించే సంస్థ మొబైల్, ల్యాండ్‌లైన్‌తో పాటు డిటిహెచ్, కేబుల్ టివి వంటి వాటిని కూడా అందించవచ్చు. ఈ విధానంలో న్యాయపరమైన, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అందుకు ఒక నెల పట్టవచ్చునని ఆయన విలేఖరులకు చెప్పారు. టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమకున్న లైసెన్స్ ద్వారా వినియోగదారులకు ఇతర సేవలను కూడా అందిచవచ్చు.
* టెలికాం కార్యదర్శి చంద్రశేఖర్
english title:
ul
Date:
Friday, March 29, 2013