ముంబయి, మార్చి 28: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ గురువారం 131 పాయింట్లు లాభపడింది. మంత్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్సు గురువారం ముగియడం, దానికి తోడు ఫండింగ్ ఏజెన్సీలు మెటల్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీల స్టాక్స్ కొనడంతో సెన్సెక్స్ 131.24 పాయింట్లు వృద్ధి చెంది 0.70 శాతం పెరిగి 18,882.54 వద్ద ముగిసింది. ప్రారంభ సెషన్స్‌లో 136 పాయింట్లు పతనమై పిఎస్‌యు, బ్యాంకింగ్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీల షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో సెన్సెక్స్ పెరిగింది. గత సెషన్స్ కంటె సెన్సెక్స్ 23.11 పాయింట్లు లాభపడింది. హోలీ పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ కూడా 5,604.85-5692.95 మధ్య ఊగిసలాడి చివరకు 40.95 పాయింట్లు వృద్ధి చెంది 0.73 శాతం పెరిగి 5,682.55 వద్ద ముగిసింది. మార్చి నెల డెరివేటివ్స్ ముగింపు గురువారం కావడంతో స్పెక్యులేటర్లు తమ పొజిషన్లను సరిచేసుకోడంతో భారీ కంపెనీల స్టాక్స్‌కు కొనుగోలు మద్దతు లభించింది.
హిందాల్కో 3.98 శాతం, స్టెరిలైట్ ఇండస్ట్రీస్ 2.91 శాతం, గెయిల్ ఇండియా 5.02 శాతం, ఇన్ఫోసిస్ 1.25 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 2.37 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.780 శాతం పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.04 శాతం, నొవర్టిస్ ఇండియా 3.75 శాతం లాభపడ్డాయి. మెటల్, క్యాపిటల్ గూడ్స్, పవర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంక్, పిఎస్‌యు రంగ షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో సెనె్సక్స్ లాభపడింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.17 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.89 శాతం, బ్యాంకింగ్ ఇండెక్స్ 1.66 శాతం లాభపడింది.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.24 శాతం, హీరో మోటార్ కార్పొరేషన్ 1.95 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.77 శాతం నష్టపోయింది. డెరివేటివ్స్ ముగింపుతో మదుపరులు, ఇతరులు పెండింగ్ పొజిషన్లుసరి చేసుకోడం తదితర కారణాల వల్ల కేంద్రంలో అస్థిరత నెలకొన్నప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ మెరుగై లాభపడిందని విశే్లషకుల చెబుతున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు.
* మంత్లీ డెరివేటివ్ కాంట్రాక్ట్సు ముగింపు, భారీ షేర్లకు కొనుగోలు మద్దతుతో పెరిగిన మార్కెట్
english title:
rises
Date:
Friday, March 29, 2013