నిర్మల్, మార్చి 29: రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్, ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు ఆరోపించారు. శుక్రవారం నిర్మల్‌లోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో విద్యుత్ చార్జీల పెంపు, కోతలు, రైతులకు పంట నష్టపరిహారం చెల్లించనందుకు నిరసనగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 48 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. అంతకు ముందు ఆయన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా కరెంటు చార్జీలను పెంచడంతో పాటు సర్‌చార్జీలను విధించిన ఘనత కిరణ్ సర్కారుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం ముందు చూపు లేదని, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులంతా మొద్దునిద్ర పోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు వేశారో వారికి అవసరమైన కరెంటును ఏ విధంగా సరఫరా చేయాలో అన్న చిత్తశుద్దిని ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైందని, ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఒంటికాలిపై లేచే చంద్రబాబు అదే ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసం పెడితే మద్దతునీయకుండా తోకముడవడం శోచనీయమన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్న టీడీపీ నైజం తేటతెల్లమైందని, వచ్చే ఎన్నికల్లో వై ఎస్సార్‌సీపీకి అఖండ మెజార్టీ ఖాయమన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతుల కష్టాలు దూరమవుతాయని, అన్నివర్గాల ప్రజలకు రాజశేఖర్‌రెడ్డి కన్న కలలు ఆయన నేతృత్వంలో సాకారం అవుతాయన్నారు. ఈ దీక్షలో పార్టీ జిల్లా కో కన్వీనర్ రవిప్రసాద్, నాయకులు వినాయక్‌రెడ్డి, వెంకటరమణ, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, అప్పాల మహేష్, ఎం.సత్యనారాయణ, ధర్మాజిగారి రాజేందర్, అప్పాల గణేష్, ఆయిటి రమేష్, బహదూర్, మహేష్‌రెడ్డి, మాధవరావు, జీవన్‌రెడ్డి, కోటగిరి అశోక్, తారక రఘువీర్, భాస్కర్‌రావు, చందుపట్ల రవితో పాటు పెద్ద సంఖ్య లో కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు వై ఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి అల్లోలకు పూలమాలలు వేసి దీక్షకు సంఘీభావం పలికారు.
రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన తర్వాత వచ్చిన రోశయ్య
english title:
foresight
Date:
Saturday, March 30, 2013