బీర్కూర్, మార్చి 29: కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లనే తన కన్న కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు నడిపి గంగారాం విచారణలో తెలిపినట్లు బాన్సువాడ రూరల్ సిఐ ప్రకాష్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బీర్కూర్ మండలం దుర్కి గ్రామానికి చెందిన నిందితుడు నడిపి గంగారాం రోజువారి కూలీగా పని చేసుకుంటూ జీవనం వెళ్లదీసేవాడని తెలిపారు. అయితే గంగారాంకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కాగా, వారి పోషణ భారంగా మారిందన్నారు. దీనికి తోడు అమ్మాయి అనారోగ్యానికి గురికాగా, వైద్యం కోసం కుల సంఘంలో 1600రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగిందన్నారు. అయితే డబ్బులు ఆ రోజు రాత్రి పోవడంతో మానసికంగా కృంగిపోయిన గంగారాం, కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లలేని పరిస్థితిలో గొంతు నులిమి హతమార్చినట్లు నిందితుడు విచారణలో వెల్లడింనట్లు సిఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, శనివారం రిమాండ్‌కు తరలించనున్నట్లు సిఐ ప్రకాష్‌యాదవ్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో బీర్కూర్ ఎస్‌ఐ మధుసుదన్‌రెడ్డి, ఎఎస్‌ఐ రాజేశ్వర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు ప్రసాద్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల విచారణలో నిందితుడి వెల్లడి
english title:
murder
Date:
Saturday, March 30, 2013