ధర్మవరం, ఫిబ్రవరి 12: చేనేతలు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే తమ అధినేత దీక్ష చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్ పార్టీ జిల్లా కన్వీనర్ పైలానరసింహయ్య స్పష్టం చేశారు. ఆదివారం ఆయన దీక్షాశిబిరం వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ 2001లో జిల్లాకు వచ్చిన దివంగత వైఎస్ నేతన్నలు, రైతన్నలకు భరోసా ఇచ్చి ఆత్మహత్యలు వద్దన్న నమ్మకం కలిగించారని, 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా అందించారన్నారు. సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు గిర్రాజునగేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చేనేతలను ఎంత త్వరగా ఆదుకోగలిగితే అంత మంచిదని, చేనేత దీక్ష చేపట్టిన జగన్‌కు విజ్ఞప్తి చేశారు. తమకోసం జగన్ దీక్షచేపట్టడంపట్ల చేనేతలు ఆనందిస్తున్నారని ప్రతి కార్మికుడు జగన్‌తోపాటు దీక్షలో కూర్చొని వున్నారని దీంతో నేతన్నల సత్తా ఏమిటో చూపేందుకు సిద్దంగా వున్నట్లు తెలిపారు. తోపుదుర్తికవిత మాట్లాడుతూ దివంగత వైఎస్ ప్రజలు, రైతులు, నేతన్నలకిచ్చిన పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రాజన్న ఆశయాలను నెరవేర్చేది జగన్ అనే్ననని ఆమె తెలిపారు. ప్రకాశం జిల్లా మాజీ ఆప్కో డైరెక్టర్ రామచర్ల శ్రీకృష్ణా, మీసాల రంగన్న, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, భూమానాగిరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, సినీనటుడు విజయ్‌చందర్, విశే్వశ్వర్‌రెడ్డి, కడపల మోహన్‌రెడ్డి, జొన్నారామయ్య తదితరులు ప్రసంగించారు. వేదికపై జగన్‌తో పాటు నాయకులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, పైలా నరసింహయ్య, గరుడమ్మగారి నాగిరెడ్డి, బోరంపల్లి ఆంజనేయులు, ఆలమూరు ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, సినీనటుడు విజయ్‌చందర్, పామిడి వీరాంజనేయులు, మీసాల రంగన్న, విశే్వశ్వరరెడ్డి, గుంతకల్లు వై వెంకటరామిరెడ్డి, కడపలమోహన్‌రెడ్డి, రఘురాం, నాని, భూమానాగిరెడ్డి, జొన్నారామయ్య, తోపుదుర్తి కవిత, డాక్టర్ హరికృష్ణ, సోమశేఖర్‌రెడ్డి, స్థానిక నాయకులు గిర్రాజునగేష్, తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, కంచం లీలావతి, కాచర్లకంచన్న, శంకర్‌నారాయణ, సానే నరసింహారెడ్డి, శేషాద్రిరెడ్డి, కావేటి మల్లిఖార్జున, బెస్త శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
* వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పైలా
english title:
jagan deeksha
Date:
Monday, February 13, 2012