మడకశిర, ఫిబ్రవరి 12: దేశాభివృద్ధిలో యువత పాత్రే కీలకమని, అం దుకనుగుణంగా దేశంలోని యువ త బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ పిలుపునిచ్చా రు. ఆంధ్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతమైన పావగడలో కమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన విద్యార్థి వసతి గృహ భవనాన్ని ఆదివారం ఎం పి లగడపాటి రాజగోపాల్, కర్నాటక విధాన పరిషత్ ఆచార్యులు దొరస్వా మి నాయుడు ప్రారంభించారు. అనంతరం లగడపాటి మాట్లాడుతూ మా ట్లాడుతూ పేద విద్యార్థుల కోసం ఇటువంటి వసతి గృహాలు నిర్మించడం గర్వించదగ్గ విషయమన్నారు. వీటిలో విద్యతో పాటు జీవితం, ఇతర రంగాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని దాతలకు సూచించారు. రాజ్యసభ సభ్యులు సృజన సత్యనారాయణ మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులు పక్కదోవ పట్టకుండా విద్యారం గం పట్ల ఆకర్షితులయ్యే విధంగా చూ డాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. కర్నాటక ప్రభుత్వ విధాన పరిషత్ డైరెక్టర్ ఆచార్య దొరస్వామినాయుడు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులందరూ సమైక్యంగా కలిసి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. వచ్చే ఏడాది నాటికి బాలికల కోసం కోటి రూపాయలతో మరో వసతి గృహ సౌకర్యం కల్పించడానికి వారు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి హనుమంతరాయచౌదరి, పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్ప, అనంత జిల్లా భువనగిరి క్షేత్రం పీఠాధిపతి ఈశ్వరయ్య, పావగడ రామకృష్ణ సేవాశ్రమ పీఠం అధ్యక్షులు జపానందస్వామి, ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలకు చెందిన కమ్మ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
* ఎంపి లగడపాటి రాజగోపాల్
english title:
youth's role crucial
Date:
Monday, February 13, 2012