కదిరి, ఫిబ్రవరి 12: పట్టణంలోని అనంతపురం రోడ్డులో గల మరకత మహాలక్ష్మి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగాజరిగింది. పరమ పూజ్యులు, మైసూరు దత్త పీఠాధిపతి శ్రీశ్రీ గణపతి సచిదానంత స్వామిజీ వారి ఆశిస్సులతో పరమహంస పరివ్రాజకాచార్య దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీ విజయానందతీర్థ స్వామి పర్యవేక్షణలో మరకత మహాలక్ష్మి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఇదే సందర్బంలో ఆలయంపై ఐదు కలిశాల ఏర్పాటు, మహాగణపతి, స్పటిక శివలింగ, దత్తాత్రేయ అష్టలక్ష్మి పరివార సమేతంగా నవగ్రహాలు, శ్రీ చక్రాలు, ఆంజనేయ స్వామి, నాగదేవతా సహిత మరకత మహాలక్ష్మి దేవిని సద్గురు దేవులు ప్రతిష్టించారు. శిలల్లో అత్యంత అరుదైన మరకతమషిలో అద్భుతంగా చేసిన మహాలక్ష్మి విగ్రహాన్ని ప్రపంచంలో ప్రప్రథమంగా ఇక్కడి ఆలయంలో అనుగ్రహించి స్వామిజీ చేతుల మీదుగా ప్రతిష్టించడం కదిరి వాసుల అదృష్టంగా భావిస్తున్నారు. శ్రీ నృసిం హ దత్తజ్ఞాన బోధ కదిరి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాకార్యక్రమానికి మైసూరు, బెంగళూరు, చెన్నై, పుట్టపుర్తి, షిరిడి తదితర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ హరినాథ్ గుప్తా, సభ్యులు బివి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
========
పుట్టపర్తి సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తా:ఎమ్మెల్యే పల్లె
పుట్టపర్తి, ఫిబ్రవరి 12: నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పుట్టపర్తి సమస్యలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దాదాపు రెండు మాసాలపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పుట్టపర్తి నియోజకవర్గ సమస్యలతో పాటు జిల్లావ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను ప్రస్తావిస్తానన్నారు. ప్రధానంగా పుట్టపర్తి నియోజకవర్గంలో కొనే్నళ్లుగా సాగుచేసుకుంటున్న వ్యవసాయభూములకు పట్టాలు ఇవ్వని వైనాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకువస్తానన్నారు. ఇందులో ప్రధానంగా నార్శింపల్లి, కొండకమర్ల, తంగేడుకుంట, పోతులకుంట శోత్రియ భూములను రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావిస్తానని తెలిపారు. అలాగే పుట్టపర్తి, కొత్తచెరువు ప్రాంతాల్లో నిరుపేదలైనటువంటి లబ్ధిదారులకు గత కొనే్నళ్ళుగా పట్టాలు ఇవ్వని వైనాన్ని కూడా ప్రస్తావించానన్నారు. పంపిణీకి భూములు సిద్ధంగా వున్నప్పటికీ పట్టాలు పంపిణీ చేయడంలో జాప్యంపై ప్రశ్నిస్తానన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ నిర్మాణనిమిత్తం భూములు కోల్పోయిన రైతాంగానికి నేటికీ కూడా పరిహారం అందలేదని ఇందుకు గల జాప్యాన్నికూడా నిలదీస్తానన్నారు. ప్రధానంగా హంద్రీనీవా నిర్మాణపనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి, వాటికోసం వెచ్చించిన నిధులు, లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం విద్యుత్ వసతులు ఏ మేరకు కల్పించారో తదితర అంశాలను కూడాప్రస్తావిస్తానన్నారు. ప్రధానంగా జిల్లాలో రైతాంగం 2010-11 సంవత్సరాల్లో వరుసగా ప్రధాన పంటలు కోల్పోయిన దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టపరిహారం పంపిణీ వివరాలతో పాటు బీమా తదితర అంశాలను వేరుశనగకుప్రత్యామ్నాయంగా పంటల విధానం, రాయితీ తదితర అంశాలతో పాటు జల్‌తుఫాన్ బాధితులకు ఇప్పటిదాకా పంటనష్టపరిహారం చెల్లించని వైనంపై కూడా నిలదీస్తానన్నారు. వ్యవసాయరైతులకు అరకొరగా లభ్యమయ్యే నీటి వనరులకు అనుగుణంగా సూక్ష్మసేద్యానికి అనుగుణంగా డ్రిప్, స్ప్రింక్లర్లు కల్పించే విధానాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. జిల్లాలో చారిత్రాత్మక చెరువులు మట్టితో కూరుకుపోయి పునరుద్దరణకు నోచుకోలేదని,వాటికి నీరు సరఫరా అయ్యే కాలువల పునరుద్దరణకు, మట్టిని తీయడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తానన్నారు. పుట్టపర్తిలో అర్ధాంతరంగా ఆగిపోయిన అభివృద్ధిపనులను పూర్తిచేయాలని, రూ.కోటి 60 లక్షలతో సిమెంట్ రోడ్లను, రూ.10 కోట్లతో ప్రతిపాదించిన ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణపనులు కూడా ప్రగతిలో లేవనే అంశాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళతానన్నారు. పుట్టపర్తి కేంద్రంగా పారిశ్రామికంగా తీర్చిదిద్దడంతో పాటు బాబా సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుచేయాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పల్లె పేర్కొన్నారు.
పట్టణంలోని అనంతపురం రోడ్డులో గల మరకత మహాలక్ష్మి ఆలయంలో
english title:
mahalaxmi
Date:
Monday, February 13, 2012