ముదిగుబ్బ, ఫిబ్రవరి 12: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ధర్మవరంలో చేనేత కార్మికులకు మద్దతుగా 48 గంటల పాటు దీక్ష చేపట్టేందుకు పులివెందుల నుండి ధర్మవరం వెళ్తూ మార్గం మధ్యలో మండలంలోని దొరిగల్లు గ్రామంలో ఆయన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్‌ఆర్‌పై ప్రజలకున్న అభిమానంతో స్వచ్చందంగా దొరిగల్లు, ఈదుల పల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాలను ప్రారంభించారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చేనేతల కార్మికులు నేతలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెరిగిన ముడిసరుకుల వలన నేడు నేత కార్మికులు అప్పులపాలయ్యారని ప్రభుత్వం నేతన్నల రుణాలు మాఫీ చేయడంలో జాప్యం చేస్తోందని, విద్యార్థుల ఫీజు రీ యింబర్స్ వర్తింపజేయాలని మద్దతుగా 48 గంటల పాటు ధర్మవరంలో ఈ దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్మవరానికి వచ్చే మార్గమధ్య గ్రామాల ప్రజలు జగన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పలు గ్రామాలను ఉపాధి పనులలో కూలి గిట్టుబాటు కాలేదని జగన్‌కు కూలీలు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థుల తల్లిదండ్రుల పేరిట నెలనెల రూ. 500 అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ జిల్లా నాయకులు గురునాథ్‌రెడ్డి, పైలానరసింహయ్య, కవతి, భాస్కర్‌రెడ్డి, విశే్వశ్వర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, ఇందుకూరు నారాయణ రెడ్డి, డేగల వేణుగోపాల్, మలకవేమల భాస్కర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, డిష్ వెంకటేష్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
=============
టిడిపి హయాంలోనే మైనార్టీలకు రక్షణ:ఎంపి నిమ్మల
గోరంట్ల, ఫిబ్రవరి 12: తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లిం మైనార్టీల కు రక్షణ ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ కరువైందని ఎంపి నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. స్థానిక షాదీ మహల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవ నం భూమి పూజ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సేవకు తిలోదకాలిచ్చి భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. మైనార్టీ అభివృద్ధి కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిందే మీ లేదంటూ ఎద్దేవా చేశారు. భూ కబ్జాలకు పాల్పడుతూ మైనార్టీల ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బికె మాట్లాడుతూ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో నాటకాలు ఆడిందని, టిడిపి అధినేత ఆలోచనల మేరకే రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే భావించిందని ఆరోపించారు. అంతకుముందు ఎంపి నిమ్మల, ఎమ్మెల్యే పార్థసారథి షాదీమహల్ ఆవరణలో రూ. 5 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మత పెద్దలు వౌలానా హాసన్, వౌలీద్ ముక్తిమన్సూర్, మాజీ ఎంపిపి అల్లాబకాష్, బాబాఫక్రుద్దీన్, దస్తగిరి, ఆర్మీ ఫక్రుద్దీన్, అజ్మతుల్లా, నాయకులు ఉత్తమరెడ్డి, సుబ్రమణ్యం, నరసింహులు, మేదర శశికళ, ఎఇ శ్యామ్యూల్ జామియా మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
==========
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 12: స్థానిక నవాజ్ నర్సింగ్ హోంలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. చిలమత్తూరు మండల పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత పురిటి నొప్పులతో ఆదివారం హిందూపురం పట్టణంలోని నవాజ్ నర్సింగ్ హోంలో చేరింది. కాన్పుకష్టం కావడంతో డాక్టర్ షానవాజ్‌ఖాన్ సునీతకు శస్త్ర చికిత్స చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాలుడు జన్మించారు. ఈ విధంగా ముగ్గురు పిల్లలకు తల్లి జన్మనివ్వడం అరుదుగా జరుగుతుందని, తల్లీపిల్లలు క్షేమంగా వున్నట్లు డాక్టర్ తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
english title:
handloom weavers
Date:
Monday, February 13, 2012