అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుకు తెస్తోందని వైకాపా నాయకులు విమర్శించారు. ఈమేరకు నగరపాలక సంస్థ అతిథి గృహంలో సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, విశే్వశ్వరరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల అండగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. నేడు విద్యుత్ కోతలు దారుణంగా ఉన్నాయని, పల్లెల్లో 12 గంటలకు పైగా కోతలు విధిస్తున్నారన్నారు. వైఎస్సార్ పాలనలో ప్రజలు పట్టణాల నుండి గ్రామాలకు వెళ్లే పరిస్థితులుండేవని, నేడు పల్లెలు వదలి పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. విద్యుత్ కోతలు కారణంగా తాగునీటి సమస్య, పశువులకు నీటి సమస్య, వ్యవసాయానికి సరిగా విద్యుత్ అందక పంటలు ఎండిపోవడం మొదలైన అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఒక రోజు కూడా కొనసాగే అర్హత లేదన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించడమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం అనురిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దాని బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సింది పోయి, అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నాడన్నారు. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు రెండూ ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. విద్యుత్ సమస్యపై ఈ నెల 3న సబ్ స్టేషన్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు ప్రజలను కోరారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల గురించి నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్
english title:
t
Date:
Tuesday, April 2, 2013