గాండ్లపెంట, ఏప్రిల్ 1: నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతి వ్యక్తికి ఏడాదికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎమ్మెల్యే గ్రాంటుగా మంజూరు చేస్తుందని, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే గ్రాంటును ఉపయోగిస్తూ స్వంతంగా డబ్బును వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటూ హంగామా సృష్టించడం హాస్యాస్పదంగా వుందని కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డా. బత్తల వెంకటరమణ విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో కన్వీనర్ కదిరి నియామకం కోసం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బత్తల మాట్లాడుతూ కదిరి ఎమ్మెల్యేగా సేవా కార్యక్రమాల్లో అన్ని తానేనని ఆర్భాటాలు సృష్టిస్తూ ఎమ్మెల్యే గ్రాంటు గురించి తెలియపర్చడం లేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు డా.పి.వి. సిద్దారెడ్డి, షాన్‌వాజ్, అబుబాకర్, మార్కెట్ యార్డు చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మండల నాయకులు అచ్చిత్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ హైదర్‌వలి, అల్లాబకష్, నరసింహగౌడ్, ఫారుక్, షఫి తదితరులు వున్నారు.
నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రతి
english title:
m
Date:
Tuesday, April 2, 2013