కదిరి, ఏప్రిల్ 1: పట్టణంలోని ఖాద్రి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి అలకోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారు ఆలయం లో పూజలు, నిత్య కైంకర్యములు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూ భక్తులతోనే గడుపుతూ రావడంతో శ్రీదేవి, భూదేవిలు అలకపాన్పు ఎక్కుతారు. దీనే్న అలకోత్సవం అంటారు. ఈ సందర్భంగా ఆలయం ముందర రామకృష్ణ మఠం వద్ద అలకోత్సవాన్ని నిర్వహించారు. ఉభయదారులుగా సహాయ కమిషనర్, గండి ఉద్గాని భీమాచార్యులు, కుమారులు గండి జయసింహ, గండి విజయ సింహ ఆదోని, ఆలయ సహాయ కమిషనర్ శివకుమార్, మున్సిపల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, అర్చకులు, ఉత్సవం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఖాద్రి నృసింహుని దర్శించుకున్న
ఎమ్మెల్యే సునీత
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం రాత్రి పట్టణంలోని శ్రీ ఖాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఆమెతోపాటు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పట్టణంలోని ఖాద్రి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో
english title:
a
Date:
Tuesday, April 2, 2013