Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బిక్కవోలులో బాస్మతి సాగు!

$
0
0

బిక్కవోలు, ఏప్రిల్ 3: బిక్కవోలు పరిసర ప్రాంతాల్లోనూ బాస్మతీ ధాన్యపు పంటను సాగుచేయవచ్చని నిరూపించాడు బిక్కవోలుకు చెందిన కలిశెట్టి పాల్గుణ అనే రైతు. అర ఎకరం భూమిలో బాస్మతీ పంటను సాగు చేశానని, ఎక్కువ మోతాదులో ఎరువులు వాడనప్పటికి మంచి దిగుబడి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కేవలం 20 కిలోల డిఏపి, 10 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌తో పాటు చీడ పీడ నుండి పంటను కాపాడేందుకు రెండుసార్లు జీవామృతాన్ని పిచికారీ చేసినట్లు పాల్గుణ చెప్పాడు. బుధవారం పంటను పరిశీలించిన మండల వ్యవసాయాధికారి ఎల్ రాంబాబు మాట్లాడుతూ సుమారు 15 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పాల్గుణ ప్రయోగంతో ఈ ప్రాంతంలో కూడా బాస్మతీని సాగు చేయవచ్చని నిరూపితమైంది. రైతులు ఈ పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపితే వచ్చే ఏడాదికి విత్తనాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యవసాయాధికారి తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

ఎస్‌ఇ కార్యాలయంలో
వైఎస్సార్ కాంగ్రెస్ బైఠాయింపు
పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆందోళన
రాజమండ్రి, ఏప్రిల్ 3: విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ట్రాన్స్‌కో ఎస్‌ఇ కార్యాలయంలో బైఠాయించి, ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత నగర సమన్వయకర్త బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించకపోవడంతో మొదటి అంతస్తులోని విద్యుత్ వినియోగదారుల దినోత్సవం జరుగుతున్న హాలులో బైఠాయించిన నాయకులు, కార్యకర్తలు చార్జీలను ఉపసంహరించాలని ఎస్‌ఇ వైఎస్‌ఎన్ ప్రసాద్‌ను నిలదీశారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకుండా చార్జీలను ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా చార్జీల పెంపుపై వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టికె విశే్వశ్వరరెడ్డి ఎస్‌ఇతో వాదనకు దిగారు. ఇళ్ల అద్దెల కన్నా చార్జీల భారం ఎక్కువైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, కానుబోయిన సాగర్, ఇసుకపల్లి శ్రీనివాస్, నల్లా రామాంజనేయులు, కెవిఎల్ శాంతి, అజ్జరపు వాసు, గారపాటి ఆనంద్, లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫలించిన 30 ఏళ్ల కల
త్వరలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ - ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్థానం
రామచంద్రపురం, ఏప్రిల్ 3: రామచంద్రపురం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం కోసం 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు కంటున్న కల నిజం కాబోతోంది. గత మూడు దశాబ్దాలుగా రామచంద్రపురం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే పాలకులు మాత్రం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ప్రజల ఆకాంక్షలు మరుగున పడ్డాయి. కాగా ఇటీవల రామచంద్రపురం నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీలో వున్న సమయంలో రెవెన్యూ డివిజన్ అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. రెవెన్యూ డివిజన్‌ను సాధించడమే లక్ష్యమని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తోట అభినందన సభ ద్రాక్షారామలో జరిగిన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తోట వినతులకు సానుకూలంగా స్పందించారు. తదనంతర పరిణామాల్లో ఉగాది నుండి కొత్త రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తామని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బుధవారం విడుదలైన ప్రభుత్వ ప్రకటనలో రామచంద్రపురం స్థానం సంపాదించింది. 30 ఏళ్ల కలను నిజం చేసిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును పలువురు అభినందించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాజా కాకర్లపూడి రాజగోపాల నర్సరాజు (గోపాల్‌బాబు), గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, చింతపల్లి వీరభద్రరావు, అల్లూరి దొరబాబు, పప్పుల మసేను వెంకన్న, కొమరిన వీర్రాజు, అక్కల శ్రీనివాస ఠాగూర్, నేమాని సత్యనారాయణ (గంగవరం అబ్బు), వెల్ల జమిందారు అబ్బు, చిలుకూరి విశే్వశ్వరరావు, కాపవరం సతీష్ తదితరులున్నారు.

యువతకు 33 శాతం
చట్టసభల్లో రిజర్వేషన్లకై కృషి చేస్తా:తెలుగు యువత సమావేశంలో చంద్రబాబు
పిఠాపురం, ఏప్రిల్ 3: యువతే పార్టీకి ముఖ్యమని, వారికి 33 శాతం రిజర్వేషన్‌ను చట్టసభలలో అమలుపరిచేలా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కృషి చేస్తానని చంద్రబాబు అన్నారు. యువత తీరు ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటాయని, అచంచల నమ్మకం పార్టీకి యువత పైనే ఉందన్నారు. బుధవారం జరిగిన తెలుగుయువత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారత్‌లోనే యవత అధికంగా ఉందన్నారు. తాను సిఎంఇవై ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తే, వైఎస్ దానికి మంగళం పాడారని, కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్ రాజీవ్ కిరణాలు పేరుతో మొత్తం కుళ్లబెట్టారని ఎద్దేవా చేశారు. యువతను ఉత్తేజపరిచే విధంగా చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. యువత చదువు పైనే దృష్టిపెడితే భవిష్యత్ బాగుంటుందన్నారు. యువతకు వారి తల్లిదండ్రులు ఎంత ఆస్తి ఇచ్చారనే దాని కంటె ఎంత చదువు చెప్పించారనేదే ముఖ్యమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో శాఖల ద్వారా ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఇచ్చామన్నారు. కాకినాడ, రాజమండ్రిలను ఐటి హబ్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు. యువత అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలన్నారు. నేడు పేదరికానికి అవినీతే కారణం అన్నారు. వయసు మీరితే ఛాలెంజ్ తగ్గుతుందని, అవినీతి పైన రాజీ పడవద్దని, టెర్రరిజమ్ కంటె అవినీతి ప్రమాదమన్నారు. కాగా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిస నమావేశంలో ఫ్లాష్ బ్యాక్‌లొద్దు, పార్టీ భవిష్యత్ పైనే దృష్టి సారించాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండపేట పార్టీ శ్రేణులకు హితవు పలికారు. పాదయాత్రలో భాగంగా పిఠాపురం చేరిన బాబు బుధవారం బస చేసిన ప్రాంత పరిధిలోనే మండపేట కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. గతంలో చంద్రబాబు చెప్పిందే వినాల్సి వచ్చేది. దానికి భిన్నంగా చంద్రబాబు తన పంథాను మార్చుకొని కార్యకర్తలను చెప్పాల్సిందిగా కోరడం విశేషం. మండల పార్టీ అధ్యక్షులతో బహిరంగంగా కార్యకర్తల ముందే ముఖాముఖి పెట్టి వారి మనోభిప్రాయాలను తెల్సుకున్నారు. వారు చెప్పిన ప్రతీ విషయాన్ని తన పుస్తకంలో రాసుకుంటూ వారి పేర్లు, వివరాలు పొందుపర్చుకున్నారు. కార్యకర్తలతో ఎక్కువ సమయం కేటాయించడానికి పాదయాత్ర మంచి అవకాశం కల్పించిదని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని, పార్టీవారే దిశానిర్దేశకులన్నారు. అధికారంలోకొస్తే మీ కష్టాలు తొలగిస్తానని భరోసాయిచ్చారు. 31 ఏళ్లలో ఇదే మొదటిసారి కార్యకర్తలతో ఎక్కువ సమయం కేటాయించిన సమావేశం అన్నారు. రైతులు, బిసిలు, ఎస్సీలు, ముస్లింల గురించి ప్రస్తావన తెచ్చారు. మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సేవలను కొనియాడారు. వైఎస్ నుంచి విజయలక్ష్మి వరకు తనపై అవినీతి ఆరోపణలు చేసి కోర్టులకు వెళ్లారని, వైఎస్ సిఎం అయిన తర్వాత ఐదు సంవత్సరాల 4 నెలల కాలంలో 25 సార్లు అధికారులను కూడా ప్రయోగించి విఫలమయ్యారన్నారు. తనకు కుటుంబం చింత లేదని, పార్టీ కార్యకర్తల క్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు, కళా వెంకటరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి వీర్రెడ్డి, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పార్టీలో చేరిన మొగలి...
చంద్రబాబు సమక్షంలో వర్మ ఆధ్వర్యంలో గొల్లప్రోలుకు చెందిన మొగలి బాబ్జీ తన అనుచరులతో పార్టీలో చేరారు. మండపేట నియోజకవర్గ సమీక్షా సమావేశం మధ్యలో మొగలి బాబ్జీని పార్టీలోకి ఆహ్వానించారు. వైస్సార్ పార్టీ నుంచి టిడిపి తీర్థాన్ని పుచ్చుకున్న బాబ్జీ గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయనతో పాటు సుమారు 20 మంది పార్టీలో చేరారు.

ఎన్నికల ప్రచార యాత్ర!
మారిన పాదయాత్ర సరళి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 3: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడి బుధవారం నాటి పాదయాత్ర ఒక్కసారిగా ఎన్నికల ప్రచార యాత్రగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు బాబు యాత్ర సరళి ఒక విధంగాను, పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అడుగిడగానే మరోవిధంగానూ కనిపించింది. బుధవారం సాయంత్రం ఆయన పాదయాత్ర ఇలా ప్రారంభించారో లేదో, అలా ఆయా వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని హామీల వర్షం కురిపించారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గీత, చేనేత, కూలీల సంక్షేమం అంటూ బాబు సరికొత్త రాగం అందుకున్నారు. కులాల వారీగా ఆయా కులాల పేర్లు ఉటంకిస్తూ ఉచితంగా రుణాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానంటూ మరోసారి ఆల్‌ఫ్రీ బాబు అనిపించుకున్నారు. ఆయా కులాలకు చెందిన పేదలకు పింఛన్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తానంటూ హామీల జల్లు కురిపించారు. పాదయాత్రలో ప్రధానంగా బడుగు బలహీనవర్గాలను దృష్టిలో ఉంచుకుని సందర్భోచితంగా మాట్లాడారు. పిఠాపురం పట్టణంలో సాయంత్రం బాబు యాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన లభించడంతో ఒక్కసారిగా హామీలతో బాబు ప్రజలను ముంచెత్తారు. పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ వద్ద బాబును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడంతో పట్టణమంతా పచ్చని వాతావరణం పరుచుకుంది. బీసీ ఎస్సీ ఎస్టీల కాలనీలున్న ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రత్యేక హామీలు గుప్పించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి కష్టాలు ఇట్టే తీరిపోతాయని, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి, పేద వర్గాల అభ్యున్నతికై ప్రత్యేక ఉపాధి కార్యక్రమాలు ప్రవేశపెట్టనున్నట్టు బాబు చెప్పారు. వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, మేదరి, మత్స్యకార, స్వర్ణకార, నేతపని వారికి పెన్షన్లు, వైద్యారోగ్య సౌకర్యాలు కల్పిస్తామని, ఉచితంగా రుణాలు కల్పిస్తామంటూ ఆయన చెప్పడంతో ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఇది ఎన్నికల యాత్రలా ఉందే! అంటూ చర్చించుకున్నారు.

‘కాపు’ కాసేవారికే ప్రాధాన్యం
పిఠాపురం, పెద్దాపురం అభ్యర్థిత్వాలపై చంద్రబాబు పునరాలోచన
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 3: జిల్లాలో గతంలో తెలుగుదేశం ఓటమి చవి చూసిన నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌ను ముందుగానే పిఠాపురం నియోజకవర్గం నుండే ప్రారంభించినట్టు బుధవారం నాటి పరిణామాలను పరికిస్తే స్పష్టమవుతోంది. ఆది నుండి పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానికి చెందిన వారే (ఏ రాజకీయ పార్టీ అయినా!) విజయం సాధిస్తుండటంతో ఈ నియోజకవర్గం అభ్యర్ధి అంశంపై పునరాలోచించాలంటూ బాబుపై వత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా బరిలో ఉంటూ ఓటమి పాలవుతున్న క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వర్మకు బదులు ఈ దఫా కాపులకే టిక్కెట్ ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తుండటంతో దీనిపై చంద్రబాబు పునరాలో

బిక్కవోలు పరిసర ప్రాంతాల్లోనూ బాస్మతీ ధాన్యపు పంటను
english title: 
b

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>