Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విద్యుత్ చార్జీల పెంపుపై మిన్నంటిన నిరసనలు

$
0
0

గుంటూరు, ఏప్రిల్ 3: ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో గుంటూరు నగరం దద్ధరిల్లింది. బుధవారం తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి, పలు ప్రజా సంఘాలు విడివిడిగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో నగర నలుమూలలా విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి, పలుచోట్ల రాస్తారోకోలు చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బిజెపి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా, పెంచిన విద్యుత్ చార్జీలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇలావుండగా టిడిపి సంతకాల సేకరణ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపి ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంటిబాట తప్పదని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి యాగంటి దుర్గారావు మాట్లాడుతూ సామాన్యులు జీవించలేని విధంగా విద్యుత్ చార్జీలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మ్యాని, ఎలుకా వీరాంజనేయులు, జమ్ముల ప్రసాద్, వేమూరు సూర్యం, కొమ్మినేని కోటేశ్వరరావు, శివన్నారాయణ, పాటిబండ్ల విజయ్, కిలారి ఆదినారాయణ, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, సింగంశెట్టి వీరయ్య, లంకా ఉదయ్, వట్టికూటి హర్షవర్ధన్, బొంతలసాయి, షేక్ మీరావలి, నల్లపనేని విజయలక్ష్మి, మానుకొండ శివప్రసాద్, చంద్రగిరి ఏడుకొండలు, పానకాల వెంకట మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నానుద్దేశించి పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యుత్ చార్జీలు పెంచేది లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రస్తుత సిఎం కిరణ్ వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కుతూ ప్రజలపై సర్‌చార్జీల పేరిట మోయలేని భారాన్ని వేశారన్నారు. విద్యుత్ భారాన్ని వెంటనే ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్లు షేక్ షౌకత్, నసీర్ అహమ్మద్, పార్టీ నాయకులు గులాం రసూల్, షేక్ ముస్త్ఫా, మార్కెట్‌బాబు, వై విజయకిషోర్, పల్లపుశివ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పేదలపై పెనుభారాన్ని మోపుతూ తలలేని నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు జమ్ముల శ్యాంకిషోర్, రాష్ట్ర నాయకులు ఆర్ లక్ష్మీపతి, కెవి సుబ్బారావు, యడ్లపాటి స్వరూపరాణి, ముత్యం పేరిరెడ్డి, ఎస్ నాగరాజు, పాలపాటి రవి, భాస్కరరెడ్డి, బి అనీల్, దేశు సత్యనారాయణ, పి చంద్రశేఖర్, కెసివై రాజేష్‌నాయుడు, వి పాండురంగవిఠల్, ఇ సదాశివరావు, సిహెచ్ గోపి, కెఎపి విఠల్, తదితరులు పాల్గొన్నారు.

ప్రాధేయపడినా వినలేదు

* ఎక్సైజ్ సిఐ బాధితుడు నూతలపాటి
మంగళగిరి, ఏప్రిల్ 3: విధిలేని పరిస్థితిలోనే మంగళగిరి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం యశోధరాదేవిని ఎసిబికి పట్టించానని బుధవారం బాధితుడు నూతలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. సిఐని ఎసిబి అరెస్ట్ అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్లుగా తన వాహనాన్ని ఎక్సైజ్ స్టేషన్‌కు కిరాయికి తిప్పుతున్నారు. గతంలో నెలకు 17 వేల రూపాయలు చెల్లించేవారని, గత కొన్ని నెలలుగా కొంతపెంచి 24 వేలు చెల్లిస్తున్నారని, 7 వేల రూపాయలు పెరిగినందున పెరిగిన కిరాయి మొత్తం 14 వేల రూపాయలు తనకు ఇవ్వాలని సిఐ యశోధరాదేవి కోరగా వాహన నిర్వహణ వ్యయం పెరిగినందున ఇచ్చుకోలేనని పేర్కొనగా సిఐ ససేమిరా అన్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎసిబి అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో తనతో పాటు ఎసిబి ఇన్‌స్పెక్టర్లు టిఎస్‌కె రవి, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారని డిఎస్పీ నరసింహారావు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 9440446164, 9440446165, 9440446128 నెంబర్లకు సమాచారం అందించాలని ఎసిబి డిఎస్పీ నరసింహారావు కోరారు. కాగా మంగళగిరి ఎక్సైజ్ సిఐగా పనిచేస్తున్న మహిళ యశోధరాదేవి ఎసిబికి పట్టుబడిందనే సమాచారం మంగళగిరి ప్రాంతంలో తీవ్ర సంచలనం, చర్చానీయాంశమయింది. మద్యం వ్యాపారులు పలువురు ఎసిబి దాడులపై ఆరా తీశారు.
అసమర్థ ప్రభుత్వాన్ని సాగనంపండి

* వైఎస్‌ఆర్ సిపి జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట, ఏప్రిల్ 3: ప్రజలపై విద్యుత్ చార్జీ ల భారాని మోపుతూ అసమర్ధ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి సాగనంపాలని వైఎస్‌ఆర్ సిపి జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం వైఎస్‌ఆర్ సిపి విద్యుత్ చార్జీల పెంపుపై నిర్వహించిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో రోజుకు నాలుగైదు గంటలు మాత్రమే కరెంట్ ఉంటుందన్నారు. ప్రజల ఆవేదన పట్టని ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తేళ్ల సుబ్బారావు, గోవర్ధన్, కాట్రగడ్డ మస్తాన్‌రావు, వేజండ్ల కోటేశ్వరరావు, అబ్దుల్ ఖదీర్, మున్నంగి రత్నారెడ్డి, విడదల కమలేంద్ర, వెంకటేశ్వర్లు, కె వీరారెడ్డి, పేర్ల ప్రేమ్‌చంద్ పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత ప్రజలదే
* రాష్ట్ర భూ పరిపాలనశాఖ చీఫ్ కమిషనర్ మహంతి
కొల్లిపర, ఏప్రిల్ 3: ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలదేనని రాష్ట్ర భూ పరిపాలనాశాఖ కమిషనర్ పికె మహంతి అన్నారు. కొల్లిపర మండలం హనుమాన్‌పాలెంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ప్రసంగించారు. సభకు తెనాలి ఆర్డీఓ ఎస్ శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ భూములను సాగుచేసుకొని అభివృద్ధి చెందాలేగాని వాటిని అమ్మటం.. కొనటం నేరమేనన్నారు. ప్రతి గ్రామం లో ప్రభుత్వ పథకాలు సక్రమంగా, సంపూర్ణంగా అమలుజేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహిళాశక్తి ద్వారానే అభివృద్ధి సాధ్యమని సదస్సుకు హాజరైన మహిళలను చూస్తేనే అర్ధవౌతోందన్నారు. అండంగళ్, పహాణీలేగాక మీ-సేవా కేంద్రం ద్వారా నామమాత్రపు రుసుం చెల్లించి ఎన్నోసేవలు పొందవచ్చునన్నారు. ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసుకుని సాగుచేసుకోవాలన్నారు. కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి మనిషి నిత్యం భూమితో సంబంధాలు కలిగియుండి భూసమస్యలతో సతమతవౌతున్నారని, వాటి పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలన్నారు. గ్రామ రెవెన్యూ పటాల ద్వారా ప్రభుత్వ, పట్ట్భాములు వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని రక్షించుకోవచ్చునన్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం ప్రజాసమస్యలపై అవగాహన పెంపొందించుకొని పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం, భూమిశిస్తు, ఆస్తుల తగాదాలు, కుటుంబ ఆస్తులు సమస్యలు తక్షణ పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు తోడ్పడతాయన్నారు. సదస్సుల్లో వచ్చే 7లక్షల దరఖాస్తుల్లో 3నెలల్లోగా 99శాతం పరిష్కరించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం మనది...మనకోసం పనిచేస్తుందనే భావన ప్రతి ఒక్కరు కలిగియుండాలన్నారు. ప్రభుత్వంపై నమ్మకం పెంచుకొని భాగస్వామ్యం వహించాలన్నారు. రాష్ట్రంలోనే 98.6శాతం రుణాన్ని తిరిగి చెల్లించి కొల్లిపర మండలం మహిళలు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో జెసి మురళీధర్‌రెడ్డి, డిఆర్‌డిఏ పిడి వెంకటరెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాసులు, తహశీల్దార్ రామకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.
నృసింహునికి గజేంద్రమోక్షం అలంకారం

మంగళగిరి, ఏప్రిల్ 3: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో బుధవారం రాత్రి స్వామివారికి గజేంద్రమోక్షం అలంకారం చేశారు. ఆలయ ముఖ మండపంలో జరిగిన ఈ అలంకారోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నేత్ర పర్వంగా దర్శించుకున్నారు. కైంకర్య పరులుగా నంబూరు పద్మావతి, ఆస్థాన కైంకర్య పరులుగా తాడికొండ శ్రీనివాసరావు, తిరుమలరావు వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. గురువారం పార్ధసారధి అలంకారం జరుగుతుందని ఇఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
గ్రిడ్‌లలో సమస్యలు తలెత్తితే కోతలు తప్పవు
మాచర్ల, ఏప్రిల్ 3: రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసే పవర్‌గ్రిడ్‌లలో ఏదైనా సమస్యలు తలెత్తితే కోతలు తప్పవని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ రాజబాపయ్య అన్నారు. బుధవారం మాచర్ల డివిజన్ కార్యాలయానికి చేరుకొన్న ఆయన డివిజన్ పరిధిలోని సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల వసూళ్లు పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేఖరులతో రాజబాపయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రూ.110 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు.

* టిడిపి, వైఎస్సార్ సిపి, బిజెపి ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకో * ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>