Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజా సమస్యలు పరిష్కారం కోరితే దాడి చేయిస్తారా

$
0
0

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 3: జిల్లా పర్యటనకు వచ్చన ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్న బాధల్ని వివరించాలని ప్రయత్నిస్తే అధికార పార్టీ నాయకులు తమను పోలీసులతో దాడిచేయించడం, అనంతరం అరెస్టుచేయించడం దారుణమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ నాయకుడు కోటంరెడ్డ శ్రీధర్డ్డ్రి అన్నారు. బుధవారం నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్ లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మొడురోజులుగా జిల్లాలో సిఎం ఇందిరమ్మ బాట సభలు వెలవెలపోతున్నాయన్నారు. సలహాలు ఇస్తే తీసుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి సలహాలు ఇవ్వడానికి వెళ్లిన వారిని పోలీసులతో రౌడీలను కొట్టినట్టు కొట్టించడం హేయమని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఎన్నిరోజులు ప్రభుత్వాన్ని కొనసాగిస్తారో చూస్తామన్నారు. పోలీసులు దాడి చేసినంత మాత్రాన ప్రజాఉద్యమం ఆగదన్నారు. ఆయన వెంట మండల కన్వీనర్ పిగిలం నరేష్ యాదవ్, మాజీకార్పొరేటర్ కాకి వెంకటేశ్వర్లు, హజరత్ నాయుడు రాఘవరెడ్డి, తదితరులు ఉన్నారు.

అన్ని పాఠశాలల్లో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జయంతి జరపాలి
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 3: జిల్లాలోని అన్ని మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, అనుబంధ కార్యాలయాలల్లో ఈ నెల 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని జరపాలని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా 14న డాక్టర్ అంబేద్కర్ జయంతిని కూడా ఘనంగా నిర్వహించాలని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

సిఎంకు మంత్రి ఆనం కృతజ్ఞలు
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 3: జిల్లా ప్రజల ప్రభుత్వ వైద్య కళాశాల కలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నెరవేర్చినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ బాట మూడో రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం డిఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో310 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ హాస్పిటల్ నూతన భవన సముదాయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జిల్లా ప్రజల అదృష్టం అన్నారు. అనంతరం మాట్లాడుతూ వైద్య కళాశాల, జనరల్ హాస్పిటల్ ఏర్పాటు వల్ల జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అవకాశముంటుందన్నారు. రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి రాష్టన్న్రి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేలా పనిచేస్తుందన్నారు. 2012-13 సంవత్సరంలో ఆరోగ్య శ్రీ ద్వారా 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శ్రీకి 16000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నేడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రవేటు వైద్య కళాశాలల్లో 5,500 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయని, ఈ విద్యా సంవత్సరంలో మరో 1000 సీట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా 9రకాల నిత్యావసర వస్తువులను తెల్లరేషన్ కార్డుదారులకు అందజేస్తున్న జిల్లా ప్రజల తరుపున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పితాని సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ, డాక్టర్ శైలజానాథ్ సాకె, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యుడు విఠపుబాలసుబ్రణ్యం, జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్, ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బీద మస్తాన్‌రావు, పరసావెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

సిఎంకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వినతి పత్రం
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 3: రైసుమిల్లులకు పవర్ హాలిడే లేకుండా జూన్ మాసం వరకు నిరవధిక కరెంటు ఇవ్వాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యలమూరి రంగయ్యనాయుడు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 50వేల మెట్రీక్ టన్నుల గోదాములుఈ ఏడాదిలో నిర్మించాలని కోరారు. సిఎంఆర్ ధాన్యానికి 2011-12 సంవత్సరానికి గాను ఉచిత పర్మింట్‌లు ఇవ్వాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శింగంశెట్టి కోటేశ్వరరావు, రాజా హజరత్తయ్య, స్వర్ణకోటయ్య, కోలగట్ల వెంకురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిఎంకు పలు సంఘాలు ఆర్జీలు
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 3: జిల్లాలో జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం పలు సంఘాలు వినతి పత్రాలు అందచేశారు. వారిలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులు అసలు సముద్రంలో సరియైన చేపల వేటలులేక పోర్టు పరిశ్రమల కలుషిత , ప్రభుత్వ పథకాలు అందక చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల పార్ట్ టైమ్ ఉపాధ్యాయలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ ఉద్యోగులకు 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా జీతాలు, పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు వజ్రాల వెంకట రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనాధ్‌రెడ్డి కోరారు. నెల్లూరు క్లాత్ మార్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కామేశ్వరరావు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని వస్త్రాలపై వ్యాట్‌ను మన రాష్ట్రంలో కూడా రద్దు చేసి రాష్ట్ర వ్యాప్త వస్త్ర రంగంలోని యాజమాన్యం, సిబ్బంది అనుబంధ రంగాల కార్మికుల అభిమానాన్ని పొందాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తొలగించబడిన కాంట్రాక్టు ఎంపిహెచ్‌ఎలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. నెల్లూరులో స్టడీ సర్కిల్ ఏర్పాటుచేయాలని దళిత విద్యార్థి సేన ప్రతినిధులు సిఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు.

వైఎస్‌ఆర్సీపి నాయకులు అరెస్టు
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 3: విద్యుత్ సర్‌చార్జీలు, పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందు తమ నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా మార్గ మధ్యంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సర్‌చార్జీలు, పెంచిన చార్జీలను రద్దు చేయకపోతే రాష్ట్రంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. సీల్ట్ కవర్‌లో వచ్చిన సిఎం పేదప్రజల బాధ ఏమి అర్థమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో తాటి వెంకటేశ్వర్లు, రూప్‌కుమార్ తదితరుల పాల్గొన్నారు.

టిడిపి నేతల అరెస్టును నిరసిస్తూ
జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా
నెల్లూరు అర్బన్, ఏప్రిల్ 3: ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి వివరించడానికి వెళ్లిన టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు నేతలను అరెస్ట్ చేయడంతో సమాచారం అందుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్, నెల్లూరురూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు ఆధ్వర్యంలో వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని నేతలను పరామర్శించిన అనంతరం అరెస్ట్‌కు వ్యతిరేకంగా వెంకటాచలం జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఎంను కలిసేందుకు వెళ్లితే దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తారా అంటూ పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సొంతపూచికత్తుపై టిడిపి నేతలను వెంకటాచలం పోలీస్‌స్టేషన్ నుండి విడుదల చేశారు. రాస్తారోకో కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి యర్రంరెడ్డి గోవర్దన్‌రెడ్డి, వెంకటాచలం మండల పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, కార్య నిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్‌కుమార్, తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు అంచల వాణి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బద్దెపూడి రవీంద్రబాబు, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నం అంజయ్య, ప్రధాన కార్యదర్శి షేక్ అమృల్లా, నాయకులు దండె విజయమ్మ, చాట్ల వెంకట సుబ్బయ్య, డబ్బుగుంట సురేంద్రబాబు, కెఎస్ మోహన్, ప్రభాకర్‌నాయుడు, పెళ్లూరు పద్మజాయాదవ్, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న గాత్ర కచేరి
* వైభవంగా త్యాగరాజ స్మరణోత్సవాలు
నెల్లూరు కల్చరల్, ఏప్రిల్ 3:్భక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభ ఆధ్వర్యంలో 48వ త్యాగరాజ స్మరణోత్సవాలు స్థానిక టౌన్‌హాల్ ఆవరణలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై కళాకారులు జెబి కీర్తన నిర్వహించిన గాత్ర కచేరి సంగీత ప్రియులను అలరించింది. పలు త్యాగరాజ స్వామి కీర్తనలు సుమధురంగా గానం చేశారు. వీరి గాత్రానికి కారకాల్ వెంకటసుబ్రహ్మణ్యం, వేణువు జెబి శృతిసాగర్, ఎన్‌సి భరద్వాజ మృదంగం, విర్గుణం శంకర్ కంజీరపై సహకరించారు. ఉదయం,మధ్యాహ్నం ఎంవి సుబ్రహ్మణ్యం భాగవతార్ హరికథా కాలక్షేపం జరిగింది. సాయంత్రం లక్ష్మీసాయి, జ్ఞానశ్రీ, ఇంద్రాణి, మాలతి (వీణ), పద్మజ(వీణ), పద్మావతి, హర్షవర్థిని, జాహ్నవి, హర్షిణి, స్నేహ, గాయత్రి, శ్రావ్య, వైష్ణవి, శ్రావ్య, హంసిని, శ్రీకళ, నాగలక్ష్మి (వీణ) త్యాగరాజ కీర్తనలు గానం చేశారు. డాక్టర్ యనమండ్ర నాగదేవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. గురువారం రాత్రి 7.15 గంటలకు చెన్నై నిషారాజగోపాలన్ గాత్ర కచేరి జరుగుతుంది. నగర ప్రజలు అధిక సంఖ్యలో ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

నగర డిఎస్పీపై చర్యలు తీసుకోవాలి
బిజెపి ధర్నా, రాస్తారోకో
నెల్లూరు కల్చరల్, ఏప్రిల్ 3: ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బిజెపి కార్యకర్తలు, నాయకులపై నగర డిఎస్పీ ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం బిజెపి ఆధ్వర్యంలో స్థానిక విఆర్‌సి సెంటర్‌లో ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డగిస్తామనే భయంతో ముందు జాగ్రత్త చర్యలుగా నగర డిఎస్పీ బిజెపి నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడంతోపాటు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి తనిఖీలు చేసి కార్యాలయాన్ని మూయించడంపై తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను సైతం అమానుషంగా అరెస్ట్ చేసి రాత్రి బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని అక్కడ కనీసం మహిళల కోసం మహిళా కానిస్టేబుల్‌ను కూడా ఏర్పాటుచేయాలేదన్నారు. రాత్రి సమయంలో బాలాజీనగర్ సిఐ మహిళలను దుర్భాషలాడారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి నగర డిఎస్పీ, బాలాజీనగర్ సిఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీ చర్యలు తీసుకోకుంటే న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి నేతలు సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, ఉపాధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు, పనబాక కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, మిడతల రమేష్, ఆత్మకూరు అంకయ్య, ఎవి శ్రీనివాసులు, మారుబోయిన శ్రీనివాసులు, నరసింహులు నాయుడు,పరశురాం, ఎకె జయరాజ్, ముద్దు శ్రీనివాసులు, కరణం వెంకట్రావ్, జి కిషోర్, మాలకొండయ్య, బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కలిగిరిలో పొగాకు వేలం ధరలు
కలిగిరి, ఏప్రిల్ 3: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన వేలానికి లక్ష్మిపురం క్లస్టర్‌కు చెందిన రైతాంగం 513 బేళ్ళను తీసుకు రాగా 433 బేళ్ళను విక్రయించగా 80 బేళ్ళను వివిధ కారణాల వలన తిరస్కరించారు. వేలంలో గరిష్ట ధర కిలో 125.40పైసలు, కనిష్ట ధర 75, సరాసరి 119.80పైసలు, 9 కంపెనీలు వేలంలో పాల్గొన్నాయని వేలం నిర్వాహణాధికారి గంగారావు తెలిపారు.

వేలగపాడులో రెవెన్యూ సదస్సు
కలిగిరి, ఏప్రిల్ 3: రెవెన్యూ సదస్సులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులో బుధవారం వెలగపాడు గ్రామంలో తహశీల్దార్ ప్రమీల అధ్యక్షతన జరిగింది. గ్రామప్రజల నుంచి 37 దరఖాస్తులు అందాయని సవరణల కోసం ఏడు దరఖాస్తులు, హద్దులు చూపాలని రెండు, పాసుపుస్తకాలు కావాలని పది, భూమి కావాలని 18మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు డిటి ఉమాదేవి ఆర్‌ఐ రాజు, సిబ్బంది వున్నారు.

పైడేరుపై బ్రిడ్జి నిర్మించాలి
* ముఖ్యమంత్రికి మత్స్యకారుల వినతి
విడవలూరు, ఏప్రిల్ 3: మండలంలోని పైడారువాగుపై వంతెన నిర్మించాలని మత్స్యకారులు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం విజ్ఞప్తి చేశారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మిపురం మత్స్యకారులు పెదకాపు బంగారయ్య, నాగేశ్వరరావు, నరసయ్య, కోవూరు మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ద్వారా వినతిపత్రం అందజేశారు. కొడవలూరు మండలం చంద్రశేఖర్‌పురానికి వచ్చిన ముఖ్యమంత్రిని కలిసి లక్ష్మిపురం సమీపంలో పైడారువాగుపై బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు. 2003 సంవత్సరంలో ఆనాటి కలెక్టర్ అనంతరామ్ 1కోటి 12లక్షల రూపాయిలతో నిర్మించనున్న పైడేరు వాగుపై వంతెను ఆనాటి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిచే శంకుస్థాపన చేయించారు. పైడేరు వాగుదాటి వెళ్ళాలంటే ఇబ్బందిగా వుంటుందని పదేళ్ళు కావస్తున్నా నిర్మాణం నోచుకోలేదని మత్స్యకారులు తెలిపారు. ఇకనైనా వంతెన నిర్మిస్తే అల్లూరు మండలం గోగులపల్లికి వెళ్ళేందుకు అనుకూలంగా వుంటుందన్నారు. వాగు అవతలివైపు తమ పొలాలు వున్నాయని బ్రిడ్జి నిర్మిస్తే రాకపోకలు సాగించవచ్చన్నారు.

వరిగడ్డి వామి దగ్ధం
కొండాపురం, ఏప్రిల్ 3: మండలంలోని సాయిపేట దళితవాడలో మంగళవారం రాత్రి వరిగడ్డివామి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఆ గ్రామానికి చెందిన బొడ్డు రమణయ్య అనే రైతు మూడు ఎకరాల్లో గడ్డిని 24వేల రూపాయిలకు కొనుగోలుచేసి ఇంటి వద్ద వామి వేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఇది కాలిపోయిందని తమ పశువులకు గడ్డిలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా సంతకాల సేకరణ
కొండాపురం, ఏప్రిల్ 3: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా కొండాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటాద్రి మాట్లాడుతూ ప్రభుత్వం చార్జీలు తగ్గించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా ఈచార్జీల పెంపును ఖండించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా టిడిపి కార్యదర్శి చినమాలకొండయ్య, జిల్లా టిడిపి ఎస్‌సి సెల్ అధ్యక్షులు కాకి ప్రసాద్, స్థానిక నాయకులు చంద్రబాబు నాయుడు, పోలినేని రమేష్, కలుగోలు తదితరులు పాల్గొన్నారు.

పిజి సెంటర్‌లో రక్తదాన శిబిరం
కావలి రూరల్, ఏప్రిల్ 3: స్థానిక విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పిజి సెంటర్‌లో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది. ఈశిబిరానికి ఆసెంటర్ ప్రత్యేక అధికారి ప్రారంభించగా ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ రెడ్‌క్రాస్ సొసైటీ కావలి శాఖతోపాటు స్థానిక ఏరియావైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ శివశంకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఆపద సమయాల్లో రక్తం అందుబాటులో లేకపోవడం కారణంగా ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న సంఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి వారికి రక్తదాన శిబిరం నిర్వహించినట్లయితే అందుబాటులో రక్తం వుండగా అలాంటి వారి ప్రాణాలు కాపాడిన వారమవుతామన్నారు. ఈశిబిరంలో 50మంది విద్యార్ధులు రక్తదానం ఇవ్వడంతో వారిని పలువురు అభినందించారు. ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్టినేటర్ వెంకటరావు, కౌన్సిల్ సొసైటీకి చెందిన విద్యార్థినాయకులు, అధ్యాపకేతర బృందం హాజరైన వారిలో వున్నారు.

విశ్వోదయలో ప్రాంగణ ఎంపికలు
కావలిరూరల్, ఏప్రిల్ 3: కావలి పట్టణంలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల టెక్నికల్ అకాడమి చైర్మన్ దొడ్ల విద్యాదర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెక్ కాలేజ్‌లో మాట్లాడుతూ జిల్లా పరిధిలోని తడ శ్రీసిటీ కంపెనీ ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో హెచ్‌ఆర్ మేనేజర్ రామకృష్ణ, ప్రతినిధులు క్యాంపస్ సెలక్షన్‌లో పాల్గొంటారని చెప్పారు. కళాశాల ప్లేస్‌మెంట్ డైరెక్టర్ వంశీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు రాత పరీక్షలతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూలు ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ విశే్వశ్వరరావు, వెక్ ప్రిన్సిపాల్ శ్రీనివాసకుమార్, అకడమిక్ ఇన్‌చార్జ్ ప్రత్యూషారెడ్డి తదితరులు వున్నారు.

రైతును రాజుగా మార్చింది కాంగ్రెస్సే
సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
కావలి, మార్చి 3: దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు కష్టాన్ని గుర్తెరిగి వారి సంక్షేమం కోసం విశేష ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజుగా మార్చేందుకు కృషిచేసింది, చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాలో మూడురోజులుగా పర్యటిస్తున్న ఆయన బుధవారం కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొని అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షత వహించగా ముందుగా 25వేల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములకు సంబంధించి బ్రోచర్లను సహచర మంత్రులు అధికారులతో కలిసి విడుదల చేశారు. ఇందులో మాట్లాడుతూ రైతాంగాన్ని ఆర్ధికంగా పరిపుష్టి చేసేందుకు పెట్టుబడుల కోసం ప్రవేటు వడ్డీ వ్యాపారుల బారినుంచి కాపాడేందుకు కోసం రాష్ట్రంలో ఈ ఏడాది 52వేల కోట్ల పంట రుణాలను బ్యాంక్‌ల ద్వారా మంజూరు చేసామని చెప్పారు. ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలో వుండగా 2004కు ముందు 12శాతం వడ్డీతో రాష్ట్రంలో కేవలం 10వేల కోట్ల రూపాయిలలోపే రుణాలను ఇచ్చేవారిని అయితే సోనియోగాంధీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఈమొత్తాన్ని దేశంలో 5లక్షల 75వేల కోట్ల రూపాయిలకు పెంచి కేవలం 4శాతం వడ్డీకే అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2వేల కోట్ల రూపాయిల వడ్డి భారాన్ని భరించి లక్ష రూపాయిల లోపు పంట రుణాలను సంవత్సరంలోపు చెల్లిస్తే వడ్డిలేకుండా అందించే బృహోత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. దేశం మొత్తంలో పంట రుణాల్లో రాష్ట్రం వాట పదిశాతం కాగా ఇది తన ప్రభుత్వ ఘనతేనని వివరించారు. వ్యవసాయాన్ని మరింత వృద్దిచేసేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని రైతు సంబంధిత శాఖలన్నింటిని ఒకే గొడుగుకిందకు తెచ్చి సత్వర ప్రయోజనాలు రైతులకు అందేలా ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నామన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రకు మార్చేందుకు జలయజ్ఞాన్ని చేపట్టగా ఇప్పటి వరకు 23లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందని మరో ఏడాదికాలంలో 37లక్షల ఎకరాలు సాగులోకి రానుందని వివరించారు. తమ విధానాలు, దేవుడి దయవల్ల కురిసిన వర్షాల కారణంగా గత ఏడాది పంట దిగుబడులు ఎక్కువుగా వచ్చాయని రాష్ట్రం నుంచి 20లక్షల టన్నులు బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు జరిగేలా చేసి గిట్టుబాటు ధరలు కల్పించామన్నారు. దేశం నుంచి మొత్తం 30లక్షల టన్నుల ఎగుమతులు మాత్రమే జరగగా అందులో 66శాతం వాట రాష్ట్రానిదేనని చెప్పారు. విపక్షాలు జలయజ్ఞం ఫలించలేదని దుష్ప్రచారం చేస్తున్నాయని కేవలం కొన్ని లక్షల లోపు ఖర్చుపెట్టి ఇల్లు నిర్మించేందుకే నెలలకాలం పడుతుండగా వేల కోట్లు ఖర్చుచేసి కలకాలం నిలిచే ప్రాజెక్ట్‌ల నిర్మాణం త్వరితగతిన ఎలా పూర్తిఅవుతుందని ప్రశ్నించారు. నాగార్జునసాగర్, ఎస్‌ఆర్ ఎస్‌పి ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరిగి దశాబ్దాలు గడిచిన నేటికి పూర్తి అయకట్టు స్థిరీకరణ జరగని విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో జలయజ్ఞ ఫలాలు అందుతుండగా పంటల నిల్వకు గోదాములు అవసరమయ్యాయని ఈక్రమంలో 25లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా పదిలక్షల రూపాయిలు ఖర్చుపెట్టి నిర్మాణాలు జరిగాయని మిగిలినవి వివిధ దశల్లో వున్నాయని చెప్పారు. మీకోసం అంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబునాయుడు తన 9 ఏళ్ళపాలనలో కరువు విలయతాండవం చేసినప్పటికి రైతును ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీలను పెంచాలన్న జ్ఞానం లేదని హెక్టార్‌కు 1500రూపాయిల వంతున కొనసాగుతూ రాగా 2004నుంచి దశల వారిగా 2012సంవత్సరం వరకు పదివేల రూపాయిలకు పెంచిన ఘనత తమదేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి గ్రూపుల ద్వారా మద్దతు ధరలకు రైతులనుంచి ధాన్యాన్ని సేకరించగా వారికి గిట్టుబాటు కల్పించడంతోపాటు కమీషన్ రూపంలో ఐకెపి మహిళ సంఘాలకు దాదాపు 49కోట్ల రూపాయిలు లభించాయని చెప్పారు.
జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతే

జిల్లాకు 6500కోట్ల రూపాయల పెట్టుబడితో కృష్ణపట్నం పోర్టును మంజూరు చేయగా దాని ఆధారంగా అనేక పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని ఈ కారణంగా భూములకు మంచి ధరలు లభించడంతోపాటు ఉపాధి అవకాశాలు కొన్ని వందలరెట్లు పెరిగాయన్నారు. 310కోట్లతో మెడికల్ కాలేజ్ రానుందని, 2400మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. 800కోట్లతో జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం జరగనుందన్నారు. ఇందులో జిల్లాకు సంబంధించి పలు సమస్యలను, గిట్టుబాటు ధరల కల్పనలో యంత్రాంగం సాధించిన విజయాలను మంత్రి ఆనం సిఎంకు వివరించారు. ఈ ఏడాది మద్దతు ధరలకన్నా ఎక్కువుగా ధాన్యంకు లభిస్తున్న ధరల గురించి తెలిపారు. జిల్లాలో మరో నాలుగుచోట్ల గోదాములకు స్థలాలు కేటాయించి వుండగా నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మినారాయణ రైతులకు మేలు చేసింది తమ ప్రభుత్వమే కాగా చంద్రబాబు పాదయాత్రలో కల్లబొల్లి మాటలు చెపుతూ రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మాటలు ఎవరు నమ్మరని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును ఆయన ప్రస్తావిస్తూ పథకాలను వివరించి ముఖ్యమంత్రి కిరణ్ ఎన్నో పథకాలను విజయవంతం అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి పనబాక సిఎంను ప్రసంశలతో ముంచెత్తారు. సభ చివరిలో సిఎంకు పలువురు రైతులు వరికంకుల హారాలు, నాగళ్ళు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, ముకేష్‌గౌడ్, శ్రీ్ధర్‌బాబు, బాలరాజు, కలెక్టర్ శ్రీ్ధర్, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతోపాటు ఎమ్మెల్యేలు బీదా మస్తాన్‌రావు, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, నాయకులు మదాసు గంగాధరం, కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిసిఎంసి చైర్మన్ సుమంత్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీల పెంపుతో పేదప్రజలపై పెనుభారం
* విద్యుత్ డిఇ కార్యాలయం ఎదుట వైకాపా ఆందోళన
గూడూరు, ఏప్రిల్ 3: ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించి విద్యుత్ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసి ప్రజలను కోలుకోలేని దెబ్బతీసిందని, సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకుండా విద్యుత్ చార్జీలను పెంచడం పట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ సి బాలచెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రెండో పట్టణ ట్రాన్స్‌కో డిఇ కార్యాలయం ఎదుట ముందుగా పార్టీ కార్యకర్తలతో బుధవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కార్యకర్తల నుద్దేశించి బాలచెన్నయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దివంగత మహానేత రాజశేఖర రెడ్డి ప్రవేశవ పెట్టిని అనేక పధకాలకు మంగళం పాడుతూ ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నదని, రాజశేఖర రెడ్డి సియంగా ఉన్న సమయంలో రైతులందరికి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా రైతులకునిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విధంగా రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించిన రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రభుత్వం 11 నెలలుగా జైలులో పెట్టి బెయిల్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు గల్లంతై ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు బ్రహ్మరధం పడతారన్నారు. మాజీ కౌన్సిలర్ తాళ్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికుయుక్తులు చేసినా రాబోయేది జగన్మోహన రెడ్డి రాజ్యమన్నారు. శ్రీకిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ అందరూ కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఎవరికి పార్టీ టికెట్ కేటాయించినా అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం డిఇ ఆదిశేషయ్యకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు వాకాటి శ్రీ్ధర్ రెడ్డి, వి ప్రసాద్, డి రాజారెడ్డి, బాబురెడ్డి, గోపీ, రవీంద్రారెడ్డి, సీతారామయ్య, వంశీకృష్ణ, చంద్రవౌళి, మునికుమార్, పౌల్, కె మోహన రెడ్డి, శ్రీ్ధర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘వైఎస్ పథకాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం’
గూడూరు, ఏప్రిల్ 3: ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీ పాశం సునీల్‌కుమార్ దుయ్యబట్టారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా ప్రజలకు పెనుభారంగా మారిందని, విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వకుండా విద్యుత్ చార్జీల బాదుడు ఏమిటని వారు ప్రశ్నించారు. పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని వారు నల్లకండువాలు, లాంతర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఎం విజయకుమార్ రెడ్డి, నెలబల్లి భాస్కరరెడ్డి, గూడూరు రాజేశ్వర రెడ్డి, నాసిన నాగులు, బొమ్మిడి శ్రీనివాసులు, ఎన్ నిరంజన్ రెడ్డి, కె గురువయ్య, పి రాజ్యలక్ష్మి, ఎన్ వినోద్‌కుమార్ రెడ్డి, పి బుజ్జయ్య నాయుడు, వి సుధాకర్ తదితరులు పాల్గొని అనంతరం సబ్ కలెక్టర్ నివాస్‌కు వినతిపత్రాన్ని అందించారు.

జగన్ విడుదల కోరుతూ మసీదులో ప్రార్థనలు
గూడూరు, ఎప్రిల్ 3: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి త్వరగా జైలు నుండి విడుదల కావాలనీ కోరుతూ బుధవారం చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారీటీ కన్వీనర్ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ గూడూరులోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఆయనతో పాటు మగ్దూం మొహద్ధీన్, కాలేషా, కొండూరు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ మైనారిటీ కన్వీనర్‌గా మగ్దూం మొహీద్దీన్ ఎంపిక చేసేందుకు ప్రతిపాదించారు.

రెవెన్యూ సదస్సుకు అర్జీల వెల్లువ
గూడూరు, ఎప్రిల్ 3: రెవెన్యూ సదస్సుకు చివరిరోజైన బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు గూడూరు మండల తహశీల్దార్ వై మైత్రేయకు ప్రజల నుండి పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. స్థానిక తూర్పు గూడూరు ప్రాంతానికి సంబంధించి తూర్పువీధి ఆరుకాళ్ల మండపం నారపరెడ్డి జయరామిరెడ్డి గ్రంథాలయంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో తూర్పు గూడూరుకు ప్రాంతానికి చెందిన పలువురు రైతులు తమకు పట్టాదారు పాసు పుస్తకాలు కావాలంటూ అర్జీలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీనివాసులు, విఆర్‌ఓలు నాగార్జున రెడ్డి, అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికునిపై ఆర్టీసీ కంట్రోలర్ దాడి
గూడూరు, ఏప్రిల్ 3: గూడూరు నుండి కోటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో జిలానీ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఎక్కుతుండగా ఆర్టీసీ కంట్రోలర్ ఆ బస్సు కాదు మరో బస్సు ఎక్కాలని చెంప మీద కొట్టడంతో అతను కంట్రోలర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు నుండి తన కుటుంబ సభ్యులతో కలసి జిలానీ కోటకు వెళ్లేందుకు గూడూరుకు వచ్చిన బస్సును ఎక్క బోతున్న సమయంలో బస్సు రద్దీగా ఉండటంతో ఈ బస్సు కాదు మరో బస్సు ఎక్కాలని అక్కడే విధులను నిర్వహిస్తున్న కంట్రోలర్ మునిరెడ్డి కోరడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. దీంతో ఆగ్రహించిన కంట్రోలర్ ప్రయాణికునిపై చేయి చేసుకోవడంతో ఈ విషయాన్ని ప్రయాణికుడు గూడూరు ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై షరీఫ్ సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన సంఘటన గురించి విచారించి కంట్రోలర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

రైల్వే అండర్ బ్రిడ్జి కింద
స్తంభించిన ట్రాఫిక్
గూడూరుటౌన్, ఏప్రిల్ 3; గూడూరు రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఆయిల్ ట్యాంకర్ వెళ్లడంతో దానికి ఎదురుగా వాహనం వచ్చేయడంతో రెండు వాహనాలు వెనక్కు వెళ్లలేకపోవడంతో బుధవారం ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. మార్గంలో కనీసం ద్విచక్రవాహనం కూడా ముందకు, వెనక్కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక సమయంలో ట్రాఫిక్ స్తంభిస్తున్నా పోలీసులు శాశ్వత చర్యలు తీసుకోని కారణంగా ఇష్టారాజ్యంగా ఈ మార్గంలో వాహనాల రాక పోకలు సాగిస్తుండంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతోంది.

కొత్తగా ఏర్పడిన ఒక్కొక్క మున్సిపాలిటీకి
రూ 2 కోట్ల నిధుల విడుదల
డిఎంఎ జనార్దన్‌రెడ్డి వెల్లడి
గూడూరు, ఏప్రిల్ 3: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 46 మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీకి రెండు కోట్ల రూపాయల వంతున అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎం జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గూడూరు పురపాలక సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాల్లో సిబ్బంది కొరత ఉందని, త్వరలో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంతవరకు పాత మున్సిపాలిటీలో ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పార్కులను అభివృద్ధి చేసేందుకు ఒక ప్రణాళిక తయారు చేయాలని, ఇందుకోసం గతంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోరినా ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. త్వరలో నివేదిక పంపాలని కోరారు. పురపాలక సంఘాలకు సంబంధించి 800 కోట్ల రూపాయల బకాయిలు వసూలు కావాల్సి వుందని, ఆ నిధులు వసూలు చేసినట్టయితే పురపాలక సంఘాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుంటుందన్నారు. నిరుపేదలు నివసించే మురికివాడల ప్రజానీకానికి మరుగుదొడ్లు నిర్మించుకునే శక్తి లే

వైఎస్‌ఆర్‌సిపి నేత కోటంరెడ్డి ధ్వజం
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>