Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సాగర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి

$
0
0

ఒంగోలు, ఏప్రిల్ 3: నాగార్జునసాగర్ కాలువ నుండి విడుదలైన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కె విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఓ కాన్ఫరెన్స్‌హాలులో తాగునీటి చెరువులను సాగర్ నీటితో నింపుకోవడానికి తీసుకొను చర్యలపై ఆర్‌డబ్ల్యుఎస్, ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించడానికి నాగార్జునసాగర్ కాలువ నుండి జిల్లాకు నీరు విడుదల చేశారన్నారు. జిల్లాలో వేసవి సీజన్‌లో ఎన్‌ఎస్‌పి నుండి 4.1 టిఎంసిల తాగునీటి కోసం ప్రభుత్వాన్ని కోరామన్నారు. జిల్లాలో 129 నోటిఫైడ్ చెరువులు ఉన్నాయన్నారు. వీటన్నింటికి యుద్ధప్రాతిపదికపై ఆర్‌డబ్ల్యుఎస్, ఇగిరేషన్ అధికారుల సమన్వయంతో నింపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్న తాగునీటి పథకాలలన్నింటిని సాగర్ నీటితో నింపుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాగర్ కాలువ ద్వారా అదనంగా నీటిని పథకాలకు త్వరగా నింపుకోవడానికి అవసరమైన ఆయిల్ ఇంజన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నింపడానికి 0.23 టిఎంసిలు, రామతీర్థం రిజర్వేయర్ నింపడానికి 1.5 టిఎంసిల నీరు అవసరమని కలెక్టర్ తెలియజేశారు. నాగార్జున సాగర్ కుడికాలువ నుండి గుంటూరు జిల్లా ద్వారా ప్రకాశంజిల్లాకు నీరు చేరవలసి ఉందన్నారు. జిల్లా చివరి ప్రాంతాలకు తాగునీరు అందించడానికి కాలువలపై విస్తృతంగా పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో తాగునీరు చెరువులు నింపడానికి ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ, పంచాయతీ కార్యదర్శులు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాకు సాగర్ నీరు సరఫరా సమయంలో ఎస్కేప్ చానళ్ల వద్ద గట్టి పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సాగర్ కాలువ నుండి విడుదలయ్యే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల చెరువులు, వ్యవసాయ పనులకు ఉపయోగించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి ఇరిగేషన్ ఎస్‌ఇ కోటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి మోహన్‌కుమార్, నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో
స్వయం సహాయక సంఘాలు ప్రముఖ పాత్ర వహించాలి
కలెక్టర్ విజయ్‌కుమార్ పిలుపు
ఒంగోలు, ఏప్రిల్ 3: జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రముఖ పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ద్వారా అమలుజరిగే సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయోలేదో ఎస్‌హెచ్‌జి సంఘాలు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులవల్ల సమస్యలు ఉన్నట్లైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాల సభ్యులుగా చేరని వారందరిని, సంఘాల సభ్యులుగా చేర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మహిళా సమైఖ్య సంఘం గతనెల సమావేశంలో చేర్పించిన అంశాలమీద తీసుకున్న తీర్మానాలపై చర్చించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తీసుకున్న నిర్ణయాలను సభ్యులకు తెలియజేశారు. జిల్లాలో ఈ సీజన్‌లో జాతీయ ఉపాధిహామీ పని కింద పనికోరిన ప్రతిఒక్కరికి పని కల్పించనున్నట్లు చెప్పారు. కూలీలకు రోజుకు ప్రభుత్వం 149 రూపాయలుగా నిర్ణయించిందన్నారు. వంద రూపాయలు పని చేసినట్లైతే ప్రభుత్వం 30 శాతం అధనం కలిపి 130 రూపాయలు ఇవ్వడం వలన గిట్టుబాటు అవుతుందన్నారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులకు కూలీల హాజరు నమోదు, నగదు చెల్లింపుల వివరాలను ఎస్‌సిహెచ్‌జి సభ్యులు తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలో కొన్ని మండలాలలో పని కావాలని కోరినప్పటికి ఫీల్డ్ అసిస్టెంట్‌లు పని చూపడంలేదని, చేసిన పనికి నగదు చెల్లంచడంలేదని క్షేత్రస్థాయి సమస్యలపై ఎస్‌జిహెచ్ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత సిబ్బందిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ సమాఖ్య సంఘాలకు వారి వారి గ్రామాలను నామకరణంతో సంఘాల పేర్లను మార్చాలన్నారు. గ్రామ సమాఖ్య సంఘంలో పేరును తీర్మానం చేసి సభ్యులు ఆమోదించి నకళ్ళను డిసిఓకి పంపించినట్లైతే మ్యాక్స్ చట్టం ప్రకారం మార్పు చేస్తారన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ పద్మజ, డ్వామా పిడి ఎ రమేష్, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెకర్టర్ ఎస్ విద్యావతి, డిఎంహెచ్‌ఓ కె సుధాకర్‌బాబు, స్వయం సహాయక సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, డిఆర్‌డిఎ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విషాహారం తిని ఇద్దరు మృతి
8మంది ఆసుపత్రిపాలు
ముండ్లమూరు, ఏప్రిల్ 3: విషాహారం తిని ఇద్దరు మృతిచెందగా, ఎనిమిది మంది ఆసుపత్రి పాలైన సంఘటన మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీనివాస నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బీరం నాగిరెడ్డి, అతని భార్య సుబ్బులు, కుమారుడు సుబ్బారెడ్డి మంగళవారం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తొమ్మిదిన్నర గంటల సమయంలో వారికి వాంతులు కావడంతో దర్శిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. వీరిలో సుబ్బులు (36), మృతురాలి చెల్లెలి కుమారుడు గజ్జల సాయిరెడ్డి (6) మృతిచెందారు. మంగా సుమంత్, బీరం నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, గజ్జెల ధనలక్ష్మి, దుర్గారెడ్డి, బీరం పద్మ, బీరం హైమావతి, పంగ వెంగళరెడ్డి ఒంగోలు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో బీరం నాగిరెడ్డి, గజ్జెల దుర్గారెడ్డి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. డిఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్‌రావు, డాక్టర్ శైలేంద్రకుమార్, తాశీల్దార్ సావిత్రిదేవి, ఎంపిడివో సుధాకర్‌రావు, దర్శి సిఐ శ్రీరాం గ్రామాన్ని సందర్శించి మృతికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. విఆర్వో రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ చార్జీల పెంపు
సామాన్యులకు భారం కాదు
పిసిసి అధ్యక్షుడు బొత్స స్పష్టం
చీరాల/వేటపాలెం, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం పందిళ్ళపల్లిలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్వగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఈ విషయమై రెండు, మూడు రోజులలో సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వానికి కొంతమేరకు సంబంధం ఉన్నప్పటికి సామాన్యులకు ఎటువంట ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెంపు విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు దురుద్ధేశ్యంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2001- 2004లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని చెబుతున్నవారు రైతులను జైలుపాలు చేసి వారిని ఇక్కట్లు పాలుచేశారని గుర్తు చేశారు. సామాన్య రైతు వర్గాలవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతాంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదన్నారు.

అధికారులకు కలెక్టర్ ఆదేశం
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>