Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విద్యుత్ చార్జీలు తగ్గించాలని వైకాపా ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

$
0
0

మణుగూరు, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పినపాక నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దారు కృష్ణమూర్తికి సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సిపి నేత పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల వల్ల చిన్నచిన్న పరిశ్రమలు మూసివేయాల్సిన దుస్థితి నెలకొందని, దీంతో ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని, పెంచిన చార్జీలతో మరో పక్క విద్యుత్ కోతతో చిన్న,సన్నకారు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన చార్జీలను తగ్గించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వట్టం రాంబాబు, కీసర శ్రీనివాసరెడ్డి, పోశం నర్సింహారావు, వెంకటేశ్వరరెడ్డి, బూర్గుల నర్సయ్య, కంగాల వెంకన్న, వావిలాల భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
* ఎస్పీ రంగనాథ్ హెచ్చరిక
ఖానాపురం హవేలి, ఏప్రిల్ 3: ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు, వివిధ రాజకీయ పార్టీల సభలు, సమావేశాల్లో అలజడి సృష్టించి నినాదాలు, నిరసనలతో అడ్డుకుంటే శాంతి భద్రత సమస్యగా పరిగణించటంతో పాటు వారిపై నానాబెయిల్‌బుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వినతిపత్రాల ద్వారానే సమస్యను అధికారుల, ప్రజాప్రతినిధులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాలన్నారు. రానున్నవి ఎన్నికల రోజులైనందున ఏ పార్టీలైనా సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కు ఉందని, వారి పార్టీ కార్యక్రమాలకు ఇతర పార్టీల వారు ఆవెళ్ళి అడ్డుకుంటే శాంతియుత వాతవరణానికి భంగం కలిగిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్నారు. అందుకు గాను ప్రభుత్వ, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
* డెప్యూటీ కలెక్టర్ మోహన్‌రావు
ఎర్రుపాలెం, ఏప్రిల్ 2: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డెప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్ మోహన్‌రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని తక్కెళ్ళపాడు గ్రామంలో బుధవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ సదస్సులో వచ్చిన పలు ఫిర్యాదులను వెంటనే పరిష్కరించామని, మిగిలిన వాటిని కూడా త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సదస్సులో పహణీలో పేరు మార్చుకునేందుకు 90, రిజిస్ట్రేషన్ కొరకు 5, వారసత్వం కొరకు 7, పట్టాదారు పాస్ పుస్తకం కొరకు 35, ఇళ్ళ స్థలాల కోసం 33 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఆర్‌ఐలు భరణిబాబు, లక్షీనర్సు, విఆర్వో తదితరులు పాల్గొన్నారు.

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం
*డిసిసి అధ్యక్షుడు వనమా
పాల్వంచ, ఏప్రిల్ 3: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని మాజీమంత్రి, డిసిసి అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని ఆయన స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వనమా మాట్లాడుతూ ఈ నెల 5న ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందుకు రానున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎస్‌సి, ఎస్‌టిల కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సబ్‌ప్లాన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతి కోసం రూ. 12,500కోట్లతో ఎస్‌టి, ఎస్‌సి సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం రూపొందించిదన్నారు. ఎస్‌టిలకు చట్టబద్ధత కల్పించి వారిని మరింతగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్‌టి, ఎస్‌సి సబ్‌ప్లాన్‌ను రూపొందించిన ఘనత రాష్ట్రప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులను 2013-14ఆర్థిక సంవత్సరంలో వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈనిధుల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీరు, సాగునీరు, కమ్యూనిటీహాల్ నిర్మాణం, రహదారులు, డ్రైనేజీలు, రైతులకు వడ్డీలేని రుణాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇల్లెందులో జరిగే సభకు ముఖ్యమంత్రితో పాటు కేంద్రమంత్రి బలరాంనాయక్, డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బాలరాజు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. కనుక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈవిలేఖరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, కొత్వాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

టిడిపి ఆధ్వర్యంలో
కాగడాల ప్రదర్శన
మధిర, ఏప్రిల్ 3: విద్యుత్ చార్జీలను పెంచడం, విద్యుత్ కోతలను నిరసిస్తూ టిడిపి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భారీ కాగడాల ప్రదర్శనను నిర్వహించారు. ప్రదర్శన స్థానిక కళామందిరం ధియేటర్ వద్ద ప్రారంభమై అంబేద్కర్ సెంటర్, రాయపట్నం సెంటర్, మెయిన్‌రోడ్, విజయవాడ రోడ్, ఆర్‌వోబి, వైరా రోడ్డు మీదుగా శాంతి ధియేటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ మడల అధ్యక్షుడు చీదిరాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాం గ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో పాటు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ప్రాజెక్టులలో నీళ్ళు లేకపోయినప్పటికీ ప్రజలకు విద్యుత్‌ను అందించడంలో ఏమాత్రం కొరత లేదని ప్రణాళికాబద్ధమైన ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే రాష్టల్రో ఈ విధంగా విద్యుత్ సంక్షోభం నెలకొందని దుయ్యబట్టారు.
ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీ
ఒకరి మృతి
దమ్మపేట, ఏప్రిల్ 3: మండల పరిధిలోని పట్వారిగూడెం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెం దాడు. పోలీసుల కథనం ప్రకారం... పాల్వంచకు చెందిన రాజ్‌కుమార్ (22) అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై పట్వారిగూడెం మీదుగా సత్తుపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్వారిగూడెం గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లగానే ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన రాజ్‌కుమార్‌ను దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ సమస్యలపై బ్లాక్ పేపర్ విడుదల
కొణిజర్ల, ఏప్రిల్ 3: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పోట్ల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ గ్రామంలో బుధవారం ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌ను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. అనంతరం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య, మద్య తరగతి ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారాన్ని మోపడం దారుణమని, అర్హులైన వారందరికీ సబ్సిడీపై గృహ విద్యుత్‌ను అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యకర్తలంతా రాగ, ద్వేషాలకు అతీతంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, కలిసి పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యదిక పంచాయతీలను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గాజుల కృష్ణమూర్తి, మండల నాయకులు కిలారు అనంతరామయ్య, మాధవరావు, పోచూరి వెంకటలాలయ్య, చిట్టిబాబు, దారగాని వెంకటేశ్వర్లు, ఉసికల చిన్నరాములు, తడికమళ్ళ వేలు, మాలోతు శ్రీను, గుగులోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌కు పతనం తప్పదు
గార్ల, ఏప్రిల్ 3: ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ అన్నారు. గార్ల వర్తక సంఘం భవనంలో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయకపోగా పన్నుల భారంతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రాంతంలోని అమూల్యమైన ఖనిజ సంపద దోపిడీకి సీమాంధ్ర పాలకులే కారణమని, ఇందుకు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు ఉద్యమించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనమే తమ హక్కు అని, ఉద్యమిస్తున్న తెలంగాణ వాదులపై పాలకులు కిరాతకంగా చర్యలకు పాల్పడుతున్నారని, ఇన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పతనం కాక తప్పదని రాజేందర్ అన్నారు.
ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవిలాల్, బుచ్చిరెడ్డి, బయ్యారం మండల కమిటీ అధ్యక్షుడు వెంకన్న, టిఆర్‌ఎస్‌వై ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జీ గాలి రాంబాబు, పల్లెబాట మండల కన్వీనర్ శీలంశెట్టి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ బాటకు తరలండి
* రేపు సిఎం ఇల్లెందు పర్యటన * 300 కోట్లతో అభివృద్ధి పనులు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఏప్రిల్ 3: పేద ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలును ఖమ్మం జిల్లా నుంచే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 5వ తేదీన ప్రారంభించనున్నారని రాష్ట్ర ఉద్యానవనశాఖా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ఖమ్మం లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇందిరమ్మ బాటతో పాటు రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టారని, అనేక హామీలను ఇచ్చారని తెలిపారు. వాటన్నింటిని నెరవేర్చడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలనే విధంగా ప్రభుత్వం రూపొందించిన ఉప ప్రణాళికను ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో ఇల్లెందు పట్టణానికి సమీపంలోనో కొత్తూరు గ్రామంలో గిరిజనులతో సమావేశం అవుతారని, అనంతరం ఇల్లెందు నగరంలోని జగదాంబ సెంటర్‌లో స్థూప ఆవిష్కరణ, 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అనంతరం సిఆర్‌ఆర్ క్లబ్ ఆవరణలో బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. 5వ తేదీన మద్యాహ్నం 1 గంట సమయంలో జిల్లాకు చేరుకునే ముఖ్యమంత్రి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు పార్టీల కతీతంగా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజనుల అభివృద్ధి కోసం కోట్ల నిధులు
* కేంద్ర మంత్రి బలరాం నాయక్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఏప్రిల్ 3: జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బలరాంనాయక్ వెల్లడించారు. ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇల్లెందు, పినపాక, భధ్రాచలం అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని ఏప్రిల్ నెలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను భద్రాచలంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం నగరానికి సైతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి జిల్లాకు అధిక నిధులను తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

ప్రజలపై ఆర్థిక భారాలు మోపడం
కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య
* వైకాపా జిల్లా కన్వీనర్ అజయ్ విమర్శ
ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 3: ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపటం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని, అందులో భాగంగానే విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజలను మోసం చేస్తోందని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్, నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని కాంగ్రెస్ పాలకులు వెంటనే గద్దె దిగాలన్నారు. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని, సర్‌చార్జీలను ఎత్తివేయాలని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ధరలు పెంచటమే లక్ష్యంగా పెట్టుకుందని, సామాన్య మానవుడు ఎలా జీవించాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడన్నారు. విద్యుత్ ఏప్పుడు వస్తుందో, వస్తే ఎంత సేపు ఉంటుందో తెలియక ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ చార్జీలను పెంచుతూ పోవటంతో పాటు సర్‌చార్జీలను అంతకు రెట్టింపు సంఖ్యలో మోపుతుందన్నారు. సర్‌చార్జీల వల్ల సంవత్సరానికి సుమారు 4,500కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్‌చార్జీలను తగ్గించకుండా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి పరోక్షంగా వత్తాసు పలుకుత్నునట్లుగా ఉందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోవటం లేదని, అందుకే వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు కృషి చేస్తున్నామన్నారు.అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జెసి సురేంద్రమోహన్‌కు అందచేశారు. కార్యక్రమంలో ఆయూబ్, నిరంజన్‌రెడ్డి, బాలమురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, అక్రం అలీ, బాబిశెట్టి పాపారావు, తోట రామారావు, గొల్లపుడి రాంప్రసాద్, దుంపటి నగేష్, శ్రీలక్ష్మి, క్రాంతికుమార్, పద్మజారెడ్డి, కృష్ణవేణి, షకీనా, సబిత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం: భట్టి

ముదిగొండ, ఏప్రిల్ 3: మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మండల పరిధిలోని పండ్రేగుపల్లిలో రూ.7.80కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే పండ్రేగుపల్లి, మల్లారం లింక్‌రోడ్డు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బండారుపల్లి వీరబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మునే్నరు పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలను కలుపుతూ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ముదిగొండ మండలానికి రింగ్‌రోడ్డుగా అభివృద్ధి చేయనున్నానన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా రింగ్ రోడ్డు, చెరువుల అభివృద్ధి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా పది గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందించనున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దశాబ్ధకాలంగా మధిర నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. గ్రామాల రహదారి నిర్మాణంలో ప్రజా సమక్షంలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఈ వెంకటేశ్వర్లు, మేడేపల్లి సొసైటీ అధ్యక్షుడు సామినేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సామినేని హరిప్రసాద్, మాజీ ఎంపిపి కె నాగలక్ష్మి, మాజీ జడ్పీటిసి దేవేంద్రం, నాయకులు వనం నర్సింగరావు, రాయల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌చార్జీలు తగ్గించేంతవరకు పోరాటాలు ఉద్ధృతం

కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 3: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ సర్‌చార్జీలు తగ్గించేంత వరకు పోరాటాలను ఉద్ధృతం చేయాలని వైఎస్‌ఆర్ సిపి కేంద్రకమిటీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి నిర్వహిస్తున్న కరెంట్ దీక్షలకు మద్దతుగా బుధవారం స్థానిక సూపర్‌బజార్ సెంటర్‌లో నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక పన్నుల భారాన్ని మోపుతోందని ఆరోపించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేయలేని ప్రభుత్వం విద్యుత్ చార్జీలను మాత్రం విపరీతంగా పెంచుతున్నదని విమర్శించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల వలన ప్రజలకు జరుగుతున్న నష్టాలను వివరిస్తూ వారిని చైతన్యవంతులను చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమించాలన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్‌ను 9గంటల పాటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, కొత్తగూడెం పట్టణ, మండలాల్లో విద్యుత్ సరఫరా 24గంటలు ఉండే అవకాశాన్ని కల్పించాలని కోరారు. రైతులు పండించిన పంటలకు సైతం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోతోందని పేర్కొన్నారు. ఈదీక్ష శిబిరంలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు జాలె జానకిరెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, ఎండి పాషా, భీమ శ్రీ్ధర్, తాళ్ళూరి శ్రీనివాస్, ఇస్లావత్ దేవి, మురారి పద్మ, ఒంగురూ రేణుకా, లక్ష్మి, రాజేష్‌కుమార్, నాగుల శేఖర్, ఏర్సుల సుధాకర్, మల్లెల అరవింద్, అరుణ్‌కుమార్, జక్కుల శ్రీనివాస్, బోదాసు కనకరాజు, హనుమంతరావు, శ్రీనివాస్, యేసుపాదం, వేముల శ్రీనివాసరావు, కాసాని రమేష్, రావూరి వీరభద్రం, రాజు, చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ, నర్సింహారావులు తదితరులు పాల్గొనగా దీక్ష శిబిరానికి సిపిఐ నాయకులు సాబీర్‌పాషా, మండె వీరహనుమంతరావు, బిసి సంఘం నాయకులు ముత్యాల హనుమంతు, లింగాల ప్రసాద్ తదితరులు సంఘీభావం తెలిపారు.

కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యమివ్వాలి
ఖానాపురం హవేలి, ఏప్రిల్ 3: కష్టపడి పని చేసే నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నాటి కృష్ణ, పల్లెబోయిన చంద్రయ్య తదితరులు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో నగర, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరిగిందని, అందులో పార్టీని బలోపేతం చేసే నాయకులు లేకపోవటం దారుణమన్నారు. భవిష్యత్తులో ఎన్నికలు సమీపిస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేయగలిగిన నాయకులకు పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉండి కష్టపడి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పని చేస్తున్న తమను కాదని ఇతరులకు ఇవ్వటం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు ఎంపి, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, గతంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జీలుగా పని చేసిన వారు అందరి సమక్షంలో కమిటీలు వేయకుండా ప్రచారం చేయటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంతో పాటు ఖానాపురం హవేలి, బల్లేపల్లి, పాండురంగాపురం తదితర ప్రాంతాల్లో పార్టీపై పట్టున్న నాయకులతో పాటు పార్టీని బలోపేతం చేసిన వారిని గుర్తించి సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో షేక్ తాజుద్దీన్, ఎస్‌కె అబ్దుల్లా, సుంకర శ్రీనివాసరావు, భాస్కర్‌రావు, కొండపల్లి శ్రీనివాసరావు, గుత్తా సీతయ్య, బుడిగెం శ్రీనివాసరావు, జొన్నలగడ్డ వెంకటరత్నం, అనిత తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సును బహిష్కరించిన ముల్కనూరు గ్రామస్థులు
గార్ల, ఏప్రిల్ 3: రెవెన్యూ సదస్సుకు మండల తహశీల్దార్ గైర్హాజరు కావడం, పంచాయతీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారుల వైఫల్యాన్ని నిరసిస్తూ బుధవారం గార్ల మండలం ముల్కనూరులో నిర్వహించిన రెవిన్యూ సదస్సును న్యూడెమోక్రసీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు బహిష్కరించారు. గతంలో జరిగిన సదస్సుల్లో గుంపెళ్ళగూడెంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ముల్కనూరులో ముస్లిం స్మశానవాటిక స్థలం కేటాయించాలని, ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని కోరిన కోర్కెలకు పరిష్కారం చూపని తహశీల్దార్ తిరిగి ఇవే ప్రస్తావనకు వస్తామని ఊహించి మోహం చాటేశారని పివైఎల్ డివిజన్ నాయకుడు బి సక్రు ఆరోపించారు. ముల్కనూరు పంచాయతీ రైతులకు సాగునీరు అందించే కట్టు, కాల్వల మరమ్మత్తులను జరిపించాలని గతంలో పలు మార్లు మండల అధికారులకు, ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినా తమకు పట్టనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపని సదస్సులు ఎవరి కోసమో తెలపాలని డిమాండ్ చేశారు. సదస్సుకు వచ్చిన వారంతా వెళ్ళిపోవడంతో అధికారులు వెనుతిరిగారు.

ప్రభుత్వ పాఠశాలలు
మూసివేయాలని చూస్తే ఉద్యమిస్తాం
ఖమ్మం (మామిళ్ళగూడెం), ఏప్రిల్ 3: విద్యార్థులు లేరనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎ అశోక్‌కుమార్, జెఎల్ గౌతంప్రసాద్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పిడిఎస్‌యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల మూలంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరటానికి అయిష్టత చూపుతున్నారన్నారు. విద్యాహక్కు అమలులోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటినా తరగతికి ఒక గది, ఒక టీచర్‌ను కల్పించలేదని, కనీస వసతులు లేకపోవడం, పర్యవేక్షణకై ఎంఇవో పోస్టులు భారంగా ఉండటం ప్రధాన కారణమన్నారు. మరో పక్క వీధికి ఒక ప్రైవేటు పాఠశాలకు అనుమతి ఇచ్చి విద్యను పూర్తిగా వ్యాపారమయం చేసిందని విమర్శించారు. ఈ కారణాలను వెతకకుండా విద్యార్థులు లేరని పాఠశాలలు మూసివేస్తే ఉద్యమించక తప్పదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతారని, తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్ చార్జీలను పెంచుటకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సరైందికాదన్నారు. ఈ సమావేశంలో పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్, సహాయ కార్యదర్శులు ఎ రవిచంద్ర, కెఎస్ ప్రదీప్, కోశాధికారి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

ప్రజలపై భారాలు మోపడం తగదు
* ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దినేని
ఖమ్మం (మామిళ్ళగూడెం), ఏప్రిల్ 3: ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని గద్దె నెక్కిన పాలకులు ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా పనిచేయడం సరి కాదని ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం ఖమ్మం నగరంలో ప్రభుత్వ శవయాత్రను నిర్వహించి స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఆర్టీసి, విద్యుత్ చార్జీలు పెంచారని అంతేకాకుండా విద్యుత్ సర్‌చార్జీల పేరుతో మరింత దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా తమకేమి సంబంధం లేదన్నట్లుగా పాలకులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేంతవరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రామకృష్ణ, లక్ష్మణరావు, సతీష్‌రెడ్డి, నవీన్, రాము, శివ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

పంటలు ఎండిపోకుండా కాపాడతాం
* ఈఈ ప్రసాద్‌రావు భరోసా
వైరా, ఏప్రిల్ 3: రిజర్వాయర్ కింద పిలక దశలో ఉన్న చెరకుపంటను ఎండిపోకుండా కాపాడతామని నీటిపారుదల శాఖ ఈఈ ప్రసాదరావు హామీ ఇచ్చారు. స్థానిక ఆర్‌టిసి బస్టాండ్ ఎదురుగా గత రెండు రోజులుగా రిజర్వాయర్ కింద సాగునీరు లేక ఎండిపోతున్న చెరకు పంటను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు చేపట్టారు. బుధవారం రిలే దీక్షల వద్దకు చేరుకున్న ఈఈ ప్రసాదరావు దీక్షపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేసి, రిజర్వాయర్ నీటిని వదిలి పంటలను కాపాడతామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఉద్యమాలతో ప్రజలు ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు. దీక్షలో రైతులు కర్నాటి హనుమంతురావు, కామినేని సాంబశివరావు, సంగెపు నర్సింహారావు ఉన్నారు. ఈకార్యక్రమంలో యాదగిరి శ్రీనివాసరావు, కంచర్ల వీణాకుమారి, పఠాన్ సైదా, పైడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం
04-03-2013

గొంతు తడిపేందుకు కోట్లలో ప్రతిపాదనలు
* అడుగు కూడా ముందుకు కదలని నివేదికలు
* రిజర్వాయర్ల నిర్మాణానికి నిధుల కొరత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: విశాఖ నగర ప్రజల గొంతు తడిపేందుకు జివిఎంసి చేస్తున్న కసరత్తు వలన ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. రెండేళ్ల కిందట విశాఖ నగర ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది కాస్తంతలో జివిఎంసి నీటి ఎద్దడి నుంచి బయటపడగలిగింది. ఈ సంవత్సరం కూడా బొటాబొటిగా నీటిని సరఫరా చేస్తోంది. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థగా ఆవిర్భవించి ఏడేళ్ళవుతోంది. జివిఎంసి పరిధిలో సుమారు 20 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరి తాగునీటి అవసరాలను తీర్చేందుకు జివిఎంసి పెద్దఎత్తున ప్రతిపాదనలు తయారు చేసింది. వేల కోట్ల రూపాయలతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా సిద్ధం చేసింది. కానీ ప్రయోజనం ఏంటి? ఇవేవీ ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు. కొన్ని వెళ్లినా వాటికి ఆమోదం లభించలేదు. దీనివలన ఏటా వేసవిలో దేవుడి మీద భారం వేసి కాలాన్ని నెట్టుకొస్తున్నారు జివిఎంసి అధికారులు.
నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం పాయకరావుపేట నుంచి అనకాపల్లి వరకూ సుమారు 12 రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. పోలవరం రిజర్వాయర్ సిద్ధమైతే, అక్కడి నుంచి విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం ఓ ఆర్నెల్లు మళ్లించి, మరో ఆర్నెల్లపాటు ఈ ట్యాంకుల్లోకి నీటిని మళ్లించే ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకొని ఉండడంతో ఇప్పట్లో రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా గోదావరి నుంచి సుమారు 1900 కోట్ల రూపాయలతో క్లోజ్డ్ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం చేశారు. కానీ ఇంత పెద్ద మొత్తాన్ని ఏవిధంగా తెచ్చుకోవాలన్న ఆలోచన చేస్తోంది జివిఎంసి. అతి తక్కువ వడ్డీకి రుణాన్ని తీసుకువచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
జివిఎంసిలో 24 గంటలూ నీటి సరఫరా చేసేందుకు అధికారులు ఆరాటపడుతున్నా, అందుకు తగిన పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే, నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. రోజుకు 45 నిముషాల నుంచి గంటపాటు నీటి సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెపుతున్నా, కొన్ని ప్రాంతాల్లో అరగంటకు మించి నీరు సరఫరా కావడం లేదు. కోట్ల రూపాయలతో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం లభిస్తే కానీ, నగర ప్రజల తాగునీటి కష్టాలు తీరేట్టు లేదు.

రెవెన్యూ డివిజన్‌గా అనకాపల్లి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: త్వరలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌గా ఆవిర్భవించబోతోంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. 11 మండలాలతో కలిసి విశాఖ రెవెన్యూ డివిజన్, 13 మండలాలతో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్, మిగిలిన మండలాలతో పాడేరు రెవెన్యూ డివిజన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లలో 13 మండలాలను విడగొట్టి అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌గా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో అనకాపల్లికి కూడా ఒక ఆర్డీఓ రానున్నారన్నమాట.

మహిళలు స్వీయరక్షణ సామర్థ్యం సాధించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: మహిళలు స్వీయరక్షణ సామర్థ్యం సాధించాలని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులతి ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సెనేట్‌హాల్ నందు బుధవారం జరిగిన జయహోమహిళ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. ఇటీవల కాలంలో మహిళలపై చోటుచేసుకుంటున్న దాడులు పెరిగిపోయాయని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారిపై జరుగుతున్న దాడులను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. జయహోమహిళలో భాగంగా ఆంధ్రాయూనివర్శిటీ, అనుబంధ కళాశాల విద్యార్థులు గతనెల 8 నుంచి 14 వరకూ గ్రామాల్లో పర్యటించి మహిళలపై జరుగుతున్న దాడులు, నియంత్రణ వంటి అంశాలపై చేపట్టిన కార్యక్రమాలను ఈసందర్భంగా స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఎ సుబ్రహ్మణ్యం వివరించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వారిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా జయహోమహిళ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు విసి జిఎస్‌ఎన్ రాజు చేతుల మీదుగా సర్ట్ఫికెట్లను అందజేశారు. కార్యక్రంలో జిల్లా ఎస్పీ జి శ్రీనివాస్, రెక్టార్ ప్రొఫెసర్ ఎవి ప్రసాదరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు
* కాంగ్రెస్ పాలనపై బిజెపి విసుర్లు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని భారతీయ జనతాపార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కంభంపాటి హరిబాబు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విద్యుత్ కోతల్లేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలు అంధకారాన్ని తెచ్చుకున్నట్టయిందన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్లే విద్యుత్ ఉత్పాదనకు అంతరాయం ఏర్పడుతోందని, తద్వారా కోతలు అమలు చేయకతప్పట్లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించడం బాధ్యతారాహిత్యమేనని ఆరోపించారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ శాఖను పర్యవేక్షించేందుకు కనీసం మంత్రి కూడా లేకపోవడం దారుణమని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అసలు విద్యుత్ ఉండట్లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అటు పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడికక్కడ నిలచిపోగా, లక్షలాది మంది కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడుతున్నారని అన్నారు. ఇక వ్యవసాయరంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం మూడు గంటలు కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు.

8న బిజెపి ప్రజాచైతన్య సదస్సు
యుపిఎ పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరించే చర్యల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>