Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘ఉద్యమిస్తేనే బిఎస్‌ఎన్‌ఎల్‌కు మనుగడ’

$
0
0

బొబ్బిలి, ఏప్రిల్ 3: బిఎస్‌ఎన్‌ఎల్ మనుగడ సాగించాలంటే ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సర్కిల్ కార్యదర్శి జె సంపత్‌రావు పిలుపునిచ్చారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు ఈనెల 16న నిర్వహించనున్న నేపథ్యంలో స్థానిక టెలీఫోన్ ఎక్ఛైంజ్ సమీపంలో బుధవారం యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగాబిఎస్‌ఎన్‌ఎల్ నానాటికి వెనుకబడుతుందన్నారు. ప్రైవేటు సంస్థలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్ పట్ల సవతి ప్రేమ చూపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి 8 జిల్లాలో జి.ఎం. పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ భర్తీచేయలేదన్నారు. సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ నియమించకపోవడంతో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు జరుగుతున్న అన్యాయాలకు ప్రతిఘటించేందుకు నాయకులు, కార్మికులు నడుంబిగించాలన్నారు. ఈ నెల 16న నిర్వహించనున్న గుర్తింపు యూనియన్ ఎన్నికలలో సెల్‌ఫోన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పండ్ల తోటల పెంపకం పనులు
పదో తేదీలోగా ప్రారంభించాలి
పార్వతీపురం, ఏప్రిల్ 3: ఈనెల పదోతేదీలోగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన స్వంత భూముల్లో పండ్లతోటల పెంపకం చేపట్టే కార్యక్రమం చేపట్టాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అంబేద్కర్ ఆదేశించారు. బుధవారం స్థానిక వైకెఎం కాలనీలోగల గిరిజన మహిళా సమాఖ్య భవనంలో సబ్‌ప్లాన్ పరిధిలో పనిచేస్తున్న ఐకెపి ఉద్యోగులు, ఎపిఎం ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో పీవో అంబేద్కర్ మాట్లాడుతూ సబ్‌ప్లాన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 1200 గ్రామాల్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్‌కు (పివోపి)కి చెందిన 8013 కుటుంబాలు ఉన్నాయని వీరికి చెందిన పదివేల ఎకరాల్లో పండ్లతోటల పెంపకం చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈభూముల్లో 2300 ఎకరాలకు మాత్రమే సాగునీటి సదుపాయం ఉన్నందున తొలుత ఈనెల 5వ తేదీలోగా పండ్లతోటలు పెంపకం చేపట్టేందుకు పివోపి రైతాంగాన్ని సిద్ధం చేయాలన్నారు. మిగిలిన నీటి వసతిలేని భూముల్లో కూడా పండ్లతోటల పెంపకానికి పదోతేదీలోగా చర్యలు తీసుకోవాలన్నారు. సెర్ప్ రాష్ట్ర రిసోర్సు పర్సన్ సుదర్శనరావు మాట్లాడుతూ ఎన్‌పియం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయడానికి రైతాంగానికి ప్రోత్సహించాలన్నారు. ఈకార్యక్రమంలో ఇందిర క్రాంతి పథం ఎపిడి మురళీతోపాటు పలువురు ఐకెపి ఎపియంలు,సిసిలు తదితరులు పాల్గొన్నారు.
మూత దిశగా మూడు పాఠశాలలు
పూసపాటిరేగ, ఏప్రిల్ 3 : విద్యార్థుల కనీస సంఖ్య కూడా లేని పాఠశాలలని మూసి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మండలంలోని మూడు పాఠశాలలకు మంగళం పాడుతున్నారు. ఇందుకు గానూ మండలం విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. వీటిలో బూర్లెవానికళ్లాలు, చినపసపాం, బూరపేట పాఠశాలలలో విద్యార్ధుల సంఖ్య 5కి మించనందున ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి విశ్వరూప్ తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో డిఎస్పీ ఆకస్మిక తనిఖీ
జామి, ఏప్రిల్ 3 : మండల కేంద్రమైన జామి పోలీస్ స్టేషన్‌ను డిఎస్పీ కృష్ణప్రసన్న బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు స్టేషన్‌లో ఉన్న రికార్డులను, స్టేషన్ నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్‌లో నూతంగా నిర్మించిన ఎస్సై ఛాంబర్‌ను పరిశీలించారు. అనంతరం పావాడ గ్రామం రోడ్డు నిర్మాణ విషయమై ఇరువర్గాల మధ్య వివాదాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
10న గ్రూపు-4 అభ్యర్థుల సర్ట్ఫికెట్ల తనిఖీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 3: గ్రూపు-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 10న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని డిఆర్వో బి.హేమసుందర వెంకటరావు తెలిపారు. ముందు ఈ నెల 9న ధ్రువపత్రాల తనిఖీ ఉంటుందని పేర్కొన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల పదో తేదీకి మార్చడమైందని ఆయన తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.
చంద్రబాబు యాత్రకు మద్దతుగా పాదయాత్ర
భోగాపురం, ఏప్రిల్ 3 : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా బుధవారం మండలంలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు ఆధ్వర్యంలో మండలంలోని తూడెం, కేటవాడ, జమ్మయ్యపేట, చిన్నరావాడ, గొల్లపేట, రావాడ, గ్రామాల్లో పాదయాత్ర చేసారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేస్తు, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి పట్టిన దరిద్య్రం వదులుతుందని, కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పవలసిన సమయం వచ్చిందని నినాదాలు చేశారు. అనంతరం రావాడ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పతివాడ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎన్నో పధకాలు, ప్రయోజనాలు కల్పించామని, కాని గత 9 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి ఈ గ్రామానికి ఊడబోడిచింది ఏమిటీ లేదని, ఎదో పథకాల పేరిట నిరుపేదలను దోచుకుం

టున్నారని అన్నారు. కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, దాట్ల సూర్యనారాయణమూర్తిరాజు, పతివాడ, అప్పలనాయుడు, మాజీ ఎంపిటిసి సభ్యుడు శేఖర్, చిన్నంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మక్కువ, ఏప్రిల్ 3: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడిన సంఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని యర్రసామంతవలస సమీపంలో బుధవారం ఉదయం దుగ్గేరు నుంచి సాలూరు వస్తున్న ఆర్టీసి బస్సు మక్కువ నుంచి యర్రసామంతవలస వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో యర్రసామంతవలస గ్రామానికి చెందిన శివ్వాం శాంతానందం(55), బరాటం పకీరులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ప్రైవేటు వాహనంలో మక్కువలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తుండగా శాంతానందం మృతిచెందాడు. బరాటం పకీరును మెరుగైన వైద్యం కోసం విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. ఈ మేరకు స్థానిక ఎస్. ఐ. పి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది.

‘ఈమూ పక్షుల పెంపకంపై అవగాహన అవసరం’
విజయనగరం (్ఫర్టు), ఏఫ్రిల్ 3: ఈమూ పక్షుల పెంపకంపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జె.ఎస్.ఎస్.ఎం.శ్రీ్ధర్‌కుమార్ అన్నారు. ఈమూపక్షుల పెంపకంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం ఇక్కడ యూత్ హస్టల్‌లో పశువైద్య అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈముపక్షుల పెంపకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ పక్షులకు చెందిన గుడ్డులు, ఈకలు, మాంసం ఎంతో విలువైనవని అన్నారు. ఈ పక్షులకు మాంసంలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల ఈ పక్షుల మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంటుందన్నారు. ఈముపక్షుల పెంపకం, వ్యాధులు, నివారణ తదితర అంశాలపై బహుళార్థక పశువైద్యశాల అసిస్టెంట్‌డైరెక్టర్ డాక్టర్ వై.వి.రమణ పవర్‌ప్రెజెంటెషన్ ఇచ్చారు. బహుళార్థక పశువైద్యశాల డిప్యూటీ డైరీక్టర్ డాక్టర్ వై.నర్సింహులు, డివిజనల్ అసిస్టెంట్ డైరక్టర్లు సిహెచ్.నర్సింహులు, డాక్టర్ ఎం.మురళీధర్ పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతోంది’
విజయనగరం (కంటోనె్మంట్), ఏప్రిల్ 3: విద్యుత్ సంక్షోభం కారణంగా రాష్ట్రంలో అంథకారం నెలకొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపు-కోతలకు నిరశనగా ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కోటవద్ద మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రాష్ట్రంలో కమ్ముకున్న చీకట్లకు నిరశనగా దీక్ష శిభిరంలో లాంతర్లతో వైకాపా నాయకుల తమ నిరశనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయన్నారు. అలాగే విద్యుత్ చార్జీల పెంపుకూడా ఎక్కువగా ఉందని మండిపడ్డారు. ప్రజాసంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు విద్యుత్ చార్జీలను పెంచిన ప్రజల నెత్తిన ధరల భారం మోపిందని ఆరోపించారు. విద్యుత్ కోతలు-వాతలు కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడ్డాయని ఆవేధన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుపై సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరిని తప్పుబట్టారు.
ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వాన్ని గద్దెదించాలని అవిశ్వాసం పెడితే ప్రతిపక్ష తెలుగుదేశం కలిసి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయలు అవిశ్వాసంతో మరోసారి రుజువైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు అవనాపు విజయ్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ గొర్లె వెంకటరమణ, నామాల సర్వేశ్వరరావు, మజ్జి త్రినాథ, చందక శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ మంత్రి పర్యటనకు ఏర్పాట్లు
పార్వతీపురం, ఏప్రిల్ 3: జిల్లాలోని ఈనెల 8,9 తేదీల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొనే అవకాశం ఉన్నందున రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలతో సిద్ధంగా ఉండాలని పార్వతీపురం ఆర్డీవో జె.వెంకటరావు ఆదేశించారు.బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయ సమావేశం హాలులో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి రెవెన్యూ ఇనస్పెక్టర్లు, వీ ఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డివిజన్‌లోని ఎక్కడ జరిగిన సదస్సులోనైనా మంత్రి పాల్గొనే అవకాశం ఉన్నందున రెవెన్యూ రికార్డులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. లేకుంటే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా గత ఏడాది నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన రెవెన్యూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులపై చేపట్టిన చర్యలు గురించి కూడా ఆర్డీవో ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఇంకా పరిష్కారం కాని వాటికి గల కారణాలను ఆయన ఆరాతీసారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగులతో పాటు ఆర్డీవో కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.

ఎంపిటీసీ, జెడ్పీటీసీల
ఓటర్ల జాబితా విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 3: జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పరిధిలోని ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. ఎంపీటీసీల జాబితాలను ఆయా ఎంపీడీఓలు విడుదల చేయగా, జెడ్పీటీసీల జాబితాను జిల్లా పరిషత్‌లో విడుదల చేశారు. పంచాయతీ అధికారులు తయారు చేసిన గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా ఆధారంగా వీటిని రూపొందించారు. జిల్లాలో మొత్తం 537 ఎంపీటీసీలు, 34 జెడ్పీటీసీలకు సంబంధించి ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ వేగవంతం కావడంతో రాజకీయ వర్గాలు కూడా ఎన్నికలపై దృష్టి సారించాయి.
పాఠశాలల వార్షికోత్సవాల
నిర్వహణకు నిధులు!
పూసపాటిరేగ, ఏప్రిల్ 3 : వివిధ పాఠశాలల వార్షికోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా 100 మందిలోపుగల పిల్లలు ఉన్న పాఠశాలలకు 400 రూపాయలు, 100పైన విద్యార్థులు ఉన్న పాఠశాలలకు 600 రూపాయల చొప్పున నిధులను కూడా ఆయా పాఠశాలల ఖాతాలకు జమ చేసింది. ఇలా ఉండగా మండలంలో 92 పాఠశాలలుండగా కందివలస (యుపి) గొల్లపేట (చల్లవానిపేట పంచాయతీ) పూసపాటిరేగ సమీపాన గొల్లపేట, పోరాం, పెద్దూరు, చింతపల్లి దరి గొల్లపేట, కృష్ణాపురం, శీరిపేట, పేరాపుదరి గొల్లపేట పాఠశాలలకు నిధులు మంజూరు కాలేదు. ఈనిధులు పొరపాటున వేరోక మండలాల్లో గల పాఠశాలలకు జమ అయ్యాయని ఈ విషయం జిల్లా అధికారులకు నివేదించినట్లు ఎంఇఒ శాంతి స్వరూప్ తెలిపారు. పాఠశాలల వార్షికోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశిస్తూ ఈ మేరకు నిధులను కేటాయించిందని వివరించారు.

గూడ్స్ వ్యాగన్లలో మంటలు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 3: విశాఖపట్నం నుంచి దమన్‌జోడి వైపు వెళ్తున్న గూడ్స్ రైలు వ్యాగన్ల నుంచి మంటలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం 9.05 గంటలకు గూడ్స్ రైలు విజయనగరం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వ్యాగన్ల నుంచి పొగలు దట్టంగా రావడంతో గూడ్స్ రైలు వెళ్లే లైన్ నెం.9 పట్టాలపై రైలును నిలిపివేశారు. వ్యాగన్ల నుంచి పొగ వస్తుండటంతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా 10.30 గంటలకు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వెంటనే వ్యాగన్లలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. అనంతరం ఉదయం 11.15 గంటలకు తిరిగి గూడ్స్ రైలు విజయనగరం స్టేషన్ నుంచి బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి పి.సింహాచలం మాట్లాడుతూ వ్యాగన్లలో చెలరేగిన మంటల వద్ద పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు. సుమారు 20 వేల రూపాయ మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వేసవిలో కొంత అప్రమత్తంగా ఉండటం అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణంగా వేసవిలో రేడియేషన్ హీట్ వల్ల బొగ్గు నుంచి మంటలు రావడం సాధారణమేనని స్టేషన్ మేనేజర్ బి.చంద్రశేఖరరాజు తెలిపారు. రైల్వే స్టేషన్‌లో ఉండటం వలన త్వరగా మంటలను అదుపు చేసేందుకు వీలు కలిగిందని తెలిపారు.

నీటి ఎద్దడి తరెత్తకుండా చూడాలి

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 3: ‘ మీ మండలాల్లో ఎవరైనా రాత్రి బడులు తనిఖీ చేశారా?’ అని సిఇఒ మోహనరావు అడగ్గా ఏ ఒక్కరూ నోరు మెదపలేదు.రాత్రి వేళల్లో మండలంలోని ఏదేని గ్రామానికి వెళ్లి బడులు తనిఖీ చేసి అక్కడ ప్రజలతో కాసేపు ముచ్చటించడం ద్వారా సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడానికి వీలవుతుందని జెడ్పీ సిఇఒ మోహనరావు అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండలాభివృద్ధి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను ప్రజల ముందర పెడితే వారి నుంచే పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, వేసవిలో ఎక్కడా మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపిడివోలను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట బోర్లను ఏర్పాటు చేయడం, మరమ్మతులకు గురైన వాటిని బాగు చేయడం చేయాలన్నారు. అవసరమైతే ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి రానున్న గ్రామ పంచాయతి ఎన్నికల్లో సమస్యాత్మక, అధిక సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటికి అవసరమైన సిబ్బందిని, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలను సిద్ధం చేసినందున ఎన్నికల సంఘం ఇచ్చిన గడువులోగా చేర్పులు, మార్పులు, అభ్యంతరాలను ఆయా సమయాలలో చేపట్టాలన్నారు. దీపం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇతర పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించాలంటే వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్న ఆవశ్యకతను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన ఎంపిడివోలు పాల్గొన్నారు.

‘6 నుంచి ఉప ప్రణాళిక ప్రాంతాల్లో కళాజాతాలు’
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఏప్రిల్ 3: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల్లో కళాజాత ఉత్సవాలను నిర్వహించనున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రెమాండ్ పీటర్ తెలిపారు. ఉప ప్రణాళికలోని ప్రాధాన్య అంశాలను ఎస్సీ, ఎస్టీలకు తెలియజేసేందుకు కళాజాత కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన వివరించారు. బుధవారం ఆయన వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించిందన్నారు. కళజాత ఉత్సవాలను ఈ నెల 6 నుంచి 13 తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం అన్ని జిల్లాలకు ఒకొక్క కళా బృందాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 5న బాబూజగజ్జీవన్‌రాం జయంతి సందర్భంగా కళాజాత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని తెలిపారు. కాగా, ఒక రూట్ మ్యాప్‌ను తయారు చేసి నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో రోజుకు మూడు కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కళాజాత కార్యక్రమాలు నిర్వహించే గ్రామాల్లో ముందుగా దండోరా వేయించాలన్నారు. కాగా, జిల్లాలో ఉత్తమ పాఠశాలలుగా గుర్తింపు పొందిన వాటిలో 25 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సీట్లు కేటాయించేలా చూడాలన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణం, రూ.5 లక్షలు వరకు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లాలో బాలురు, బాలికలకు సంబంధించి రెండు కళాశాలల వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ భవనాలు పూర్తయ్యే వరకు రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు భవనాల్లో వసతి గృహాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఉపకార వేతనాలు పొందుటకు రెన్యువల్ లేదా కొత్త దరఖాస్తులు రిజిస్టర్ చేసుకొనుటకు ఈ నెల 3 నుంచి 10 వరకు వెబ్‌సైట్ ప్రారంభించి అవకాశం కల్పించామన్నారు. 9వ తరగతి నుంచి పదో తరగతి వరకు పై చదువులు అభ్యసించే విద్యార్థులు ఆధార్ కార్డులు నంబరు కలిగి ఉండేలా చూడాలన్నారు. ఉపకార వేతనాలను ఆధార్ కార్డులకు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్ళబండి కవితా ప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి పంపుతున్న మాస్టర్ కళాబృందం ఈ నెల 15 నుంచి వరకు ఆయా జిల్లాల్లో ఉన్న కళాకారులకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కళాజాత కార్యక్రమాలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లాలోని మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొనే విధంగా వారిని ఆహ్వానించాలన్నారు. ఈ సమావేశంలో సాంఘీక సంక్షేమశాఖ డి.డి జీవపుత్రకుమార్, డిపిఆర్‌ఒ గోవిందరాజులు, డివిజనల్ పిఆర్‌ఒ రమేష్, ఎపిఆర్‌ఒ జానకమ్మ, సహాయ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ వినియోగంలో పొదుపు అవసరం
విజయనగరం (కంటోనె్మంట్), ఏప్రిల్ 3: విద్యుత్ వినియోగదారులు పొదుపును పాటిస్తే విద్యుత్ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుందని విశ్రాంత చీఫ్ ఇంజనీర్లు కృష్ణమూర్తి, రమణమూర్తిలు అభిప్రాయపడ్డారు. విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక దాసన్నపేట విద్యుత్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ దత్తి సత్యన్నారాయణ అధ్యక్షతన విద్యుత్ వినియోగదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులు పాల్గొన్న కృష్ణమూర్తి, రమణమూర్తిలు విద్యుత్ వినియోగదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగంలో సమస్యలు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొదుపువల్ల కలిగే లాభాలు తదితర అంశాలపై సూఛనలు చేశారు. సభా అధ్యక్షులు, సూపరిండెంట్ ఇంజనీర్ దత్తి సత్యన్నారాయణ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల శ్రేయస్సే ధ్యేయంగా తూర్పు విద్యుత్ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందుకోసం విద్యుత్ కాల్‌సెంటర్లు, సమస్యల సత్వర పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల ఫోరం వంటి విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల నుంచి సమస్యలను స్వీకరించి వాటి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ ఫోరం అధ్యక్షుడు చదలవాడ ప్రసాద్, విద్యుత్ వినియోగదారులు, డి.ఇలు, ఎ.ఇలు, జె.ఇలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

బిఎస్‌ఎన్‌ఎల్ మనుగడ సాగించాలంటే ఉద్యమాలు చేపట్టాల్సిన
english title: 
u

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>