ఎల్.ఎన్. పేట, ఫిబ్రవరి 12: ఆయుష్ వైద్య విభాగంలో 10 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని విశాఖ జోన్ ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కె.మురళీ తెలిపారు. లక్ష్మీనర్సుపేటలో హోమియో వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న విలేఖరులతో మాట్లాడుతూ శ్రీకాకుళానికి 10 పడకల ఆసుపత్రి మంజూరైనట్లు తెలిపారు. ఇందులో 24 గంటలూ రోగులకు సేవలు అందిస్తారని తెలిపా రు. ఈ ఆసుపత్రిలో నలుగురు వైద్యాధికారులు, ఇతర సిబ్బందితోపాటు రోగులకు భోజనం, మందులు పంపిణీ చేస్తారన్నారు. ఆసుపత్రి భవనం 30 లక్షల రూపాయలతో నిర్మిస్తారన్నారు. శ్రీకాకుళానికి మంజూరైన ఆసుపత్రికి రిమ్స్‌లో ఏర్పాటుకు స్థలం మంజూరు కు కలెక్టర్‌ను కోరామన్నారు. దాతలు 50 సెంట్ల భూమిని ప్రభుత్వానికి అందజేస్తే ప్రజలకు అందుబాటులో ఈ వైద్యశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభు త్వ పరిధిలో 113, ఎన్.ఆర్.హెచ్‌సి ఆధ్వర్యంలో 133 ఆయుర్వేద, హోమియో తదితర ఆసుపత్రులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్యాధికారులు ఉన్నారని, ఎన్.ఆర్.హెచ్.ఎం. ఆసుపత్రుల్లో 79 మంది వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆయుష్ విభాగంలోని ఆసుపత్రులకు పక్కా భవనాలు నిర్మిస్తారన్నారు. ఒక్కో భవనానికి 7.50 లక్షలు నిధులు మం జూరైనట్లు తెలిపారు.
ఔషధ మొక్కలు పెంపకం
ఆయుష్‌కు సంబంధించి వివిధ మందులు తయారు చేయడానికి ఔష ధ మొక్కలు పెంపకం నర్సరీలు ఏర్పా టు చేస్తారన్నారు. ఈ పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. నర్సరీలో వివిధ వౌళిక సౌకర్యంతో ఔషధ మొక్కల పెంపకం చేపడతామన్నారు. ఇందుకు స్థలం సేకరణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ప్రజలకు ఆయుష్ మందులపై అవగాహన కల్పిస్తామని, ఆసుపత్రిలో వైద్యం కూడా ఆయుష్ మందులు వినియోగిస్తారని తెలిపారు. దీర్ఘకాల వ్యాధులకు శాశ్వత పరిష్కారం ఆయుర్వేదం, హోమియో వైద్యంలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
* విశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ మురళీ
english title:
hospital
Date:
Monday, February 13, 2012