శ్రీకాకుళం ఫిబ్రవరి 12: ప్రత్యక్షనారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మాఘమాసంలో మూడవ ఆదివారం కావడంతో పలు ప్రాతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. వత్సవలసలో యాత్ర జరుగుతుండడంతో యాత్రకు వచ్చిన వారం తా ఆదిత్యుని దర్శనానికి రావడంతో అరసవల్లిలో భక్తులు బారులు తీరారు. ఉద యం నుంచి స్వామిని దర్శించి పూజలు చేసిన అనంతరం సూర్యనమస్కారాలు చేయించుకున్నారు. పుష్కరిణి ప్రాంగణంలో మహిళలంతా మాఘ ఆదివార వ్రతాలు చేశారు. కేశ ఖండనశాలలో భక్తులు కిక్కిరిసి పోయారు. పలువురు ప్రముఖులు సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈవారం కూడా టిక్కెట్ కౌం టర్లు, ప్రసాదం కౌంటర్లలో ఎ.పి.గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది ఉచితంగా సేవలందించారు.
========
రాజమ్మతల్లి జాతరకు భక్త జనసంద్రం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: పట్టణంలోని చిన్నబజారు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆదివారం రాజగోపురం, ధ్వజస్థంభం ప్రతిష్ఠ కా ర్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈనెల 8వతేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవ విగ్రహ, శిలాగరుడ, ధ్వజస్థం భం ప్రతిష్ఠల్లో భాగంగా మాఘబహుళ పంచమి ఆదివారం ఉదయం 8.35 గంటలకు హస్తా నక్షత్రయుత మీన లగ్నంలో శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహ మూర్తులు, ధ్వజస్థంభం, మహాద్వార గోపుర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో సంస్కృతాంధ్ర ఆగమ పండితు లు, స్థానాచార్య శ్రీమాన్ ఆరవెల్లి లక్ష్మీనారాయణాచార్యుల పర్యవేక్షణ మంగళాశాసనాలతో దేవాదాయశాఖ ఆగమ శాస్త్ర సలహాదారు శ్రీమాన్ చామర్తి జగ్గప్పలాచార్యులు ఆచార్యత్వంలో, చా మర్తి శ్రీనివాసాచార్యుల బ్రహ్మత్వం లో ఆలయ అర్చకులు రేజేటి వేంకట జగన్నాధాచార్యులు, రేజేటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం వైభవంగా జరిపించారు. ఉదయం శ్రీ విష్వక్సేనారాధన, భగత్పుణ్యాహవచ నం, పూర్ణాహుతి జరిగాయి. ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తరువాత ఉత్సవ మూర్తులకు సింహాసనారూధం, కళావాహనం, ప్రాణ ప్రతిష్ఠ నేత్రోన్మీల నం, దర్పణ,్ధను దర్శనం తదనంతరం శాంతి కల్యాణోత్సవం జరిపించారు. విజయనగరానికి చెందిన మహేంద్రాడ చిట్టి వేంకట వేణుగోపాల కృష్ణమాచార్యులు, భద్రం కృష్ణమోహనాచార్యులు, పెంట రామలక్ష్మణాచార్యులు, చామర్తి వేంకట రామాచార్యులు, బంకుపల్లి శేషాచార్యులు, ఆలయ మేనేజర్ కుమారస్వామి పాల్గొన్నారు.
============
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
శ్రీకాకుళం , ఫిబ్రవరి 12: ఈ నెల 28వతేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.తిరుపతిరావు, డి.గో విందరావు పిలుపునిచ్చారు. ఆదివారం సి.ఐ.టి.యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఉద్యోగ, కార్మిక హక్కులపై దాడికి దిగుతున్నాయని విమర్శించారు. ఆంధ్రా-ఆర్గానిక్స్ యాజమాన్యం గత పదేళ్లుగా కార్మికులను యధేచ్చగా దోపిడీ చేస్తోందని, దోపిడీని ప్రశ్నించినందుకు ఏడుగురు నాయకులను అక్రమంగా సస్పెండ్ చేసి కార్మికులను సమ్మెలోకి నెట్టిందని విమర్శించారు. ఆంధ్రా-ఆర్గానిక్స్ కార్మికులు సమ్మెకు సి.ఐ.టియు మద్దతు తెలియజేసింది. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని చట్టాలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ మండల సదస్సులు, సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. రణస్థలం డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సిఐటియు నాయకులు సి.హెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ ఎచ్చెర్ల, ఆమదాలవలస మండలాలకు ఇఎస్.ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 23 నుం డి 26వతేదీ వరకు పారిశ్రామిక ప్రాంతంలో సైకిల్ యాత్రలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు యనమల రమణారావు, ఎన్.అప్పలనర్సయ్య, రమణ, సిహెచ్. రామినాయుడు, గురివినాయుడు, భా స్కరరావు, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, రామచంద్రరాజు పాల్గొన్నారు.
ప్రత్యక్షనారాయణుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది
english title:
bhaktula raddi
Date:
Monday, February 13, 2012