హైదరాబాద్, ఫిబ్రవరి 13: శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని విమర్శించడంతో పాటు ప్రసంగ పత్రులను చించివేస్తూ ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రతిపక్ష నాయకులు విలేఖరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీనాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేఖంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని గవర్నర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వాస్తవాలను బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండాలన్న నెపంతో మీడియా పాయింట్ ఎత్తివేతకు స్పీకర్ కారణమని వారు ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, బొత్స సత్యనారాయణను తక్షణం డిస్మిస్ చేయాలని వారు డిమాండు చేశారు. తెలంగాణ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించక పోవడాన్ని తెరాస తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఈటెల రాజేందర్, తారకరామారావు, హరీష్‌రావు అన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గవర్నర్‌కు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సకలజనుల సమ్మెతో ఉద్యోగులు డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైయ్యిందన్నారు.
ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, కరవు సమస్యలపై ప్రస్తావించక పోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో ఐఎఎస్ వర్సెస్ ప్రభుత్వం మధ్య రావణకాష్టం జరుగుతోందనని శాసనసభలోసిపిఐ నాయకుడు గుండా మల్లేశం విమర్శించారు. రాష్ట్ర ఆదాయం పెరిగించదని చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదలపై పన్నుల మోతతో చావబాదుతున్నారని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ జగన్మోహనరెడ్డి ఊరూరా తిరుగుతూ చెప్పుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని పిల్లి సుబాస్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. క్రాఫ్ హాలిడే ప్రకటించడాన్ని ప్రభుత్వ చేతకానితనంగా ఉందన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండు చేశారు.
శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి వినకుండా ప్రతిపక్షాలు వాకౌట్ చేయడాన్ని మంత్రి శ్రీ్ధర్‌బాబు తప్పుపట్టారు.
సమస్యలపై చర్చిచకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. మార్చి 29 వరకు జరిగే శాసనసభ సమావేశాలు సజావుగా జరపకుండా చూడాలన్నదే ప్రతిపక్షాలకు ఉన్నట్లుగా ఉందన్నారు.
శాసనసభలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు సహేతుకంగా లేదని రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ తులసిరెడ్డి హితవు పలికారు. సమస్యలు చర్చించడానికి అసెంబ్లీని వేదికగా వినియోగించుకోవాలి తప్పా వాకౌట్ చేయడానికి కాదన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించివేయడం అవివేకం అన్నారు.
*విపక్షాల మండిపాటు * ప్రసంగ పత్రాల చించివేత *మీడియా పాయింట్ ఎత్తివేతపై ధ్వజం
english title:
no issues in speech
Date:
Tuesday, February 14, 2012