హైదరాబాద్, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో 24 నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను (సిఇసి) కోరారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎం. సుచరిత, టి. బాలరాజు, జి. బాబూరావు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలవు తిప్పారెడ్డి, ఎం. శేషుబాబు, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్‌రావు, ఎస్వీ మోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నదని జగన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం సిఇసికి లేఖ రాశారు. స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత మొత్తం ఒకేసారి 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా వారు కోరారు.
అన్ని స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహిస్తే డిపాజిట్లు దక్కవన్న భావనతో విచారణ పూర్తయినా నిర్ణయం ప్రకటించకుండా స్పీకర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్ వర్గం ఎమ్మెల్యేలందరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షంగా ఏర్పడి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. భూకేటాయింపులపై నియమించిన సభాసంఘం వైఎస్ హయానికే పరిమితం చేయకుండా చంద్రబాబు హయాం నుంచి విచారణ చేపట్టాలన్నారు.
సిఇసిని కోరిన వైఎస్సార్ కాంగ్రెస్
english title:
24 seats
Date:
Tuesday, February 14, 2012