హైదరాబాద్, ఏప్రిల్ 11 : శ్రీ ‘విజయ’నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రవీంద్రభారతిలో గురువారం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగుతనం ఉట్టిపడే ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులంతా సాధారణ దుస్తులైన ప్యాంట్లు చొక్కాలతో హాజరుకాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ధరించే సాంప్రదాయ దుస్తులైన పంచె, తెల్లరంగు చొక్కాతో పాల్గొన్నారు. అయితే ఆయనలో నిద్రలేమి, అలసట ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఏ కార్యక్రమంలో అయినా చాలా చలాకీగా, చిరునవ్వుతో కనిపించే కిరణ్‌కుమార్‌రెడ్డి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మాత్రం అలసిపోయినట్టు కనిపించారు. అయినప్పటికీ పంచాంగ శ్రవణం, ‘అమ్మ హస్తం’, అవార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలు రవీంద్రభారతిలో రెండు గంటల పాటు కొనసాగినప్పటికీ, ఎలాంటి విసుగు కనిపించకుండా పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష్య శాఖాధిపతి సివిబి సుబ్రమణ్యం చేసిన పంచాంగ శ్రవణం చాలా ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా జరిగిన అవార్డుల కార్యక్రమంలో కొందరు అవార్డు గ్రహీతలు ఏవో విషయాలు చెబుతూ ఉంటే వారికి దగ్గరగా జరిగి మరీ శ్రద్దగా విన్నారు. టిటిడి ప్రచురించిన పంచాంగాన్ని, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రచురించిన వ్యవసాయ పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అవార్డుల ప్రదానం వివిధ రంగాల ప్రముఖులకు ఈ సందర్భంగా అవార్డులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందచేశారు. పదిహేను మందికి ప్రతిష్టాత్మకమైన ‘హంస’ అవార్డులను అందచేశారు. పలువురు వేద పండితులను సన్మానించారు. పంటల ఉత్పత్తుల్లో అత్యధిక ఉత్పాదకత సాధించి రికార్డు నెలకొల్పిన రైతులను నగదుపారితోషికం, శాలువా, మెమెంటోలతో సన్మానించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన శాస్తవ్రేత్తను సన్మానించారు. సంగీత, సాహిత్య తదితర రంగాల్లో ప్రతిభ కనబరచిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందచేశారు.
శ్రీ ‘విజయ’నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం
english title:
cm
Date:
Friday, April 12, 2013