హైదరాబాద్, ఏప్రిల్ 11: చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత తనకు తప్ప మరొకరికి దక్కదని, ఈ విషయంలో నేనే నంబర్ వన్ అంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గడచిన 25-30 సంవత్సరాల్లో ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేయడంతో వివిధ శాఖల్లో ఖాళీల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గత రెండు సంవత్సరాల్లో లక్షల మంది యువకులకు ఉపాది కల్పించానని ఆయన చెప్పారు. గురువారం జ్యోతిబా పూలే 187 జయంత్యుత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనామ సంవత్సరం సందర్భంగా జ్యోతిబా పూలే పండుగను జరుపుకోవడం అదృష్టమన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి జ్యోతిబా పూలే చేసిన కృషిని నేటికి గుర్తు చేసుకోవడం గర్వకారణమని అన్నారు. భావితరాలకు జ్యోతిబా పూలే ఆదర్శప్రాయుడన్నారు. ఈ ఏడాది పంచాంగంలో అన్నింటా అభివృద్ధి జరుగుతుందని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. వర్షాలు, పంటలు, వ్యాపారాలకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పారు. దీంతో ఎవరి పని వారు చేసుకోవచ్చునని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలను ఉత్తుత్తివిగా సిఎం అనివర్ణించారు. 200 యూనిట్ల విద్యుత్ వరకు పాత పద్దతినే అమలు చేస్తున్నామని దీంతో సామాన్యులతో పాటు మధ్యతరగతి వర్గాలు ఇళ్లల్లో అన్ని రకాల విద్యుత్ వాడకాన్ని వినియోగించుకోవచ్చునని ఆయన హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్‌ను పొదుపుగా వాడకంతో బిల్లులు తగ్గుతాయన్నారు. విద్యుత్‌పై ప్రతిపక్షాల వాదనల్లో పసలేదన్నారు. కేవలం ధనికుల కోసం విపక్షాలు ఆందోళన చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు దక్కకుండా చేయడానకి ప్రతిపక్షాలు చేస్తున్న ఎత్తుగడలని ఆయన ఎద్దేవ చేశారు. ప్రతి కుటుంబంలో పస్తులు ఉండకుండా చూడాలనే దృక్పథంతో అమ్మ హస్తం పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను రూ. 185 రూపాయలకే ఇవ్వడం జరుగుతోందన్నారు.
ఈ పథకానికి రూ. 660 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా ప్రభుత్వం మాత్రం 9 రకాల వస్తువులను రూ. 185 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నిధులు ఖర్చు చేయడానికి వనరులను సమీకరించుకోవాలని అందుకు పన్నులను వేయక తప్పదని ఆయన గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల కోసం గత ప్రభుత్వాలు కేటాయించని బడ్జెట్ కంటే ఎక్కువ నిధులను కేటాయించిన ఘనత మా ప్రభుత్వానిదేనని ఆయన నొక్కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కేటాయించిన నిధులను ఆయా వర్గాలకే ఖర్చు చేయడానికి తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన వర్గాల కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం జరుగుతుందన్నారు. నిధుల కేటాయింపు ముఖ్యం కాదని వాటిని అమలుకు చిత్తశుద్ధి అవసరం అన్నారు. తన ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని ఆయన చెప్పారు.
పని చేస్తున్నామని వెంటపడకండి: సిఎం
ఫ్రనుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిధులను భారీగా ఖర్చు చేస్తున్నామని, అలాగే పనుల కోసం వెంటపడవద్దని కుల సంఘాల నేతల నుద్దేశించి ముఖ్యమంత్రి హితవు పలికారు. కాయలున్న చెట్టువద్దకే పండ్ల కోసం జనం వెళతారని, అలాగని చెట్టుపై ఉన్న పండ్లకోసం రాళ్ళు రువ్వితే పండ్లు కాదు ఆకులు, కొమ్మలు రాలుతాయని కాబట్టి చెట్టును కాపాడడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. గురువారం జ్యోతిబా పూలే సందర్భంగా బిసీ నేతలు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి పైవిధంగా స్పందించారు.
ముఖ్యమంత్రి గారూ నా ప్రసంగాన్ని కొనసాగిస్తా: బొత్స
మహాత్మా జ్యోతిబా పూలే 187వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ పాల్గొనడం కొంత ఆలస్యం కావడంతో సభా కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు. రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేదికపైకి వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ గారు నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నందున అన్యధా భావించకుండా చూడాలని బొత్స సిఎంకు సూచించారు. ప్రసంగం మధ్యలో ముగిస్తే సామెత చెప్పినట్లుగా రెడ్డిచ్చే మొదలెట్టు అన్న సామెతను గుర్తు చేయడం ఎందుకని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఈ కార్యక్రమానికి బిసి వర్గాల శాఖ మంత్రి బసవరాజు సారయ్య అధ్యక్షత వహించారు. మంత్రులు శ్రీ్ధర్‌బాబ, గడ్డం ప్రసాద్‌కుమార్, వైద్యవిద్య శాఖ మంత్రి కొండ్రు మురళీమొహన్, కేంద్ర మంత్రి బలరాం నాయక్, వెనుకబడిన వర్గాల సంఘాల నేతలతో పాటు ఎస్సీ,ఎస్టీ వర్గాల నాయకులు పాల్గొన్నారు.
ధనికుల కోసం విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి: కిరణ్‌కుమార్‌రెడ్డి
english title:
kiran kumar reddy
Date:
Friday, April 12, 2013