కంటోన్మెంట్, ఏప్రిల్ 12: ఈనెల 14న కంటోన్మెంట్ లోని అన్నానగర్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆవిష్కరిస్తారని మాజీ ఎమ్మెల్యే టి.పద్మారావుతెలిపారు. శుక్రవారం క్లాసిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అన్నానగర్, శివానగర్, ఈద్గ అంబేద్కర్ నగర్, ఇందిరానగర్, శ్రీలంక బస్తీ, చంద్రబాబునగర్, కట్టమైసమ్మ కృష్ణానగర్, ఎయిర్‌పోర్టు గుడిసెలు ప్రాంతంలో నివసిస్తున్న 30 వేల మంది తెలంగాణ వాదులు అన్నానగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, వారు పార్టీ అధినేత చంద్రశేఖరరావును విగ్రహప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరారని, వారి అభ్యర్థన మేరకు ఆయన వస్తున్నారన్నారు. గడపగడపకు తెలంగాణ వాదాన్ని తీసుకుపోవటంలో భాగంగా కంటోనె్మంట్‌లోని 8 వార్డుల్లో ఆందరినీ ఏకం చేస్తున్నామని, కెసిఆర్ రాకతో పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు. సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, గ్రేటర్ హైద్రాబాద్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్, కంటోనె్మంట్ ఇన్‌చార్జి గజ్జెల నాగేష్, కంటోనె్మంట్ బోర్డు మాజీ సభ్యుడు బి.ప్రభాకర్, నాయకులు ప్రభుగుప్తా, సుజన్, ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈనెల 14న కంటోన్మెంట్ లోని అన్నానగర్ చౌరస్తాలో
english title:
telugu talli
Date:
Saturday, April 13, 2013