న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పరిపాలనలో మరింత పారదర్శకత దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు సమర్పించడంతో పాటుగా వాటికి సంబంధించిన ఫీజులను సైతం ఆన్‌లైన్‌లోనే చెల్లించే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. ఆన్‌లైన్ పద్ధతి ద్వారా సమాచారాన్ని కోరే తమ హక్కును వినియోగించుకోవడానికి ప్రజలకు తోడ్పడే ఉద్దేశంతో ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు, ఆర్‌టిఐఆన్‌లైన్, జిఓవి.ఇన్’ అనే పోర్టల్‌ను రూపొందించినట్లు దేశంలో సమాచార హక్కు చట్టం అమలుకు నోడల్ డిపార్ట్‌మెంట్‌గా పని చేసే కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి)కి చెందిన అధికారులు తెలిపారు.
సమాచారాన్ని కోరే వ్యక్తి పది రూపాయల ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అంతేకాదు ఈ ఫీజును చెల్లించడానికి క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులను కూడా ఉపయోగించుకోవచ్చని వారు తెలిపారు. ప్రస్తుతం సమాచారానికి సంబంధించిన దరఖాస్తులు, అపీళ్లను ఆన్‌లైన్‌ద్వారా తమ శాఖకు దాఖలు చేయవచ్చని, అయితే వారు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని ఆర్‌టిఐ ఫీజును కూడా చెల్లించవచ్చని ఈ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఈ వెబ్‌సైట్‌ను ఈ వారం ప్రారంభంలో ప్రారంభించారు. దీనిద్వారా భారత దేశ పౌరులు మాత్రమే న్యూఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ఆర్‌టిఐ దరఖాస్తులు, లేదా తొలి అపీళ్లను దాఖలు చేయవచ్చు. ఈ నెలాఖరుకల్లా దేశ రాజధానిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలకు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని విస్తరింపజేస్తుందని ఆ అధికారి చెప్పారు.
....
సిద్దూకు బుజ్జగింపు
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పార్టీ నాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆవేదనతో లోక్‌సభ సభ్వత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూను బుజ్జగించటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆయన శుక్రవారం ఫోన్‌లో సిద్దూతో ఈ విషయమై మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలియచేశాయి. తొందరపడి ఎట్టి నిర్ణయం తీసుకోవద్దని రాజ్‌నాథ్ సలహా ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో సముచితమైన ప్రాతినిధ్యం కల్పించటం జరుగుతుందని రాజ్‌నాథ్ హామీ ఇవ్వటంతో పాటు వీలు చూసుకుని ఢిల్లీకి వచ్చి తనను కలవవలసిందిగా సిద్దూను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు
english title:
rti
Date:
Saturday, April 13, 2013