జీడిమెట్ల, ఏప్రిల్ 12: వికలాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీరాంనగర్‌లో క్రాంతి వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వికాలంగులకు 8ట్రై సైకిళ్లు, 2 వీల్ ఛైర్‌లను శ్రీశైలంగౌడ్ చేతులమీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. వికలాంగులు తాము అంగవికలురమని అధైర్యపడకుండా మనోధైర్యంతో ముందుకు నడవాలని సూచించారు. ఇంకా ఎవరైనా వికాలంగులకు ట్రైకిళ్లు, వీల్‌చైర్‌లు కావాలనుకుంటే తన దృష్టికి తీసుకువస్తే తాను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు జగన్, రావుల శేషగిరి, సీనియర్ నాయకులు అంజన్‌గౌడ్, ఎత్తరి మారయ్య, తిరుపతిరెడ్డి, సంతోష్‌కుమార్, నందుగౌడ్, సాయిప్రతాప్, క్రాంతి వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షులు బాలస్వామి, రాజేశ్, పరమేశ్వర్, సయ్యద్ ముస్త్ఫా, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
గిరినగర్‌లో హైమాస్ట్ లైట్లు ప్రారంభం
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని గిరినగర్‌లో హైమాస్ట్ లైట్లను స్థానిక శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రివేళల్లో ఈ వీధిలైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
వికలాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కుత్బుల్లాపూర్
english title:
mla kuna srisailam
Date:
Saturday, April 13, 2013