Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

భవానీ ఐలాండ్ లీజు రద్దు చేయాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు విజయవాడలోని భవానీ ఐల్యాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవి బినామీ అయిన మంత్రి గంటా శ్రీనివాస్‌కు నజరానాగా ఇచ్చిందని టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపించారు. సోమవారం టిడిఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. చట్ట ప్రకారం భవానీ ఐ ల్యాండ్‌ను లీజుకు ఇవ్వడానికి వీలు లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చిరంజీవి కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించారు. అల్లు అరవింద్ అక్కడ స్టూడియో నిర్మించడానికి చూస్తున్నారని తెలిపారు. లోకాయుక్తకు సైతం ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే ఈ లీజును రద్దు చేసి భవానీ ఐ ల్యాండ్‌ను పేద మధ్య తరగతి ప్రజల కోసం ఉపయోగిస్తామని టిడిపి ఎమ్మెల్యేలు తెలిపారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు విజయవాడలోని భవానీ ఐల్యాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం
english title: 
bhavani island lease

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>