విశ్రాంతి శరీరం పొందింది కానీ మనసు కాదన్నట్లుగా అతని ముఖం అలజడితో వంకర్లు తిరిగి ఉంది. మంచం పక్కనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు... అతని తమ్ముడు రఘువర్. చాలా సేపటినుంచీ అన్నయ్యవైపే చూస్తూ ఆందోళన పడుతున్నాడు.
కళ్ళుతెరిచి తనవైపుచూసిన అన్నయ్యను చూసి అతనికి పరమానందం వేసింది. అన్నయ్య వైపు... ఆలంబనగా చూసి... పక్కన కూర్చుని అరచేయి తట్టాడు... ఆత్మస్థయిర్యంగా ఉండమని.
‘‘వారసులులేని మన భవంతి నాతోపాటుగా మూతపడుతుందేమో కదూ రాఘవా? అన్నారాయన గాద్గదికంగా..
‘‘అన్నయ్య... అదే దిగులుతో మీరు మంచమెక్కారు. అదే దిగులుతో మీరు మరణానికి దగ్గరవుతున్నారు. మీరు జీవించాలంటే.. ఆ దిగులును జయించాలి’’ అన్నాడు అనునయంగా.
‘‘బిడ్డలుకలుగలేదని మీ వదినగారు.. నా అసమర్థతను నిరసిస్తూ.. నాకు దూరంగా జీవిస్తుంది. గొడ్రాలి బ్రతుకు తనకు శాసించబడిందని కుమిలిపోతూంది. నావల్లే సంతానం కలగలేదనే ఆలోచన నన్ను నిర్వీర్యం చేసి క్షంతవ్యునిగా శిక్షిస్తుంది. మీ వదినగారికేకాదు... మన వంశానికే నేను కొనసాగింపు లేకుండా.... భవిష్యత్తు లేకుండా చేశానన్న భావన నా శక్తినీ.. మేధస్సునూ కరిగించి వేస్తూంది’’ ఆయన గొంతు దుఃఖంతో పూరుకుపోయి మాటరానీయడంలేదు.
‘‘అన్నయ్యా.. మీరిలా... అధైర్యపడితే... నేనేమీ చెయ్యలేను... మీరు ధైర్యంగా ఉండాలి’’
‘‘ఎక్కడి ధైర్యంరా రఘువర్? నువ్వు ప్రేమించిన అమ్మాయి మరణించిందని వివాహానే్న కాదన్నావు. నేనిలా సంతానంలేక బాధపడుతున్నాను. ఇక మన వంశం... నామరూపాలు లేకుండా పోతుందనే వేదన... నన్ను పిచ్చివాణ్ణి చేస్తుందిరా!’’ అంటూ లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు.
ఫోన్ రావడంతో రఘువర్ ఫోన్ అందుకుని.. అటువైపు వ్యక్తికి పరిస్థితి వివరించాడు. అది వింటున్న అన్నయ్య ఇంద్రదత్... చెయ్యి సాచాడు రిసీవర్ కోసం... అటువైపునుంచీ తన ఫ్రెండ్ గొంతు విని ఆనందంతో ముఖం విప్పారింది.
‘‘ఇండియాకు ఎప్పుడు వస్తున్నావురా!’’ అనడిగాడు.
‘‘నేను రావడం సరే! నువ్వేంటి పిల్లలూ... పిల్లలూ... వంశం వారసత్వం గట్రా.. అంటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావట.. ఇంకా ఏ సెంచరీలో ఉన్నావ్‌రా నువ్వు! పిల్లలు లేకపోతే ఏమవుతుంది! ఎవర్నయినా దత్తత తీసుకో, అదీ కాకపోతే ఆస్తంతా అనాధ శరణాలయాలకు దానం చేసి.. ఎంతోమంది పిల్లలకు తండ్రిగా నిలిచిపో... వంశం... వారసత్వం అంతా మనం సృష్టించుకున్న భ్రమలురా! ముందు అందులో నుంచి బయటకురా.. అప్పుడు నీ ఆరోగ్యం బాగుపడుతుంది!’’ గట్టిగా గరిచాడతను.
‘‘్భరతీయుల సెంటిమెంట్స్ అంత తొందరగా మారవురా! నన్ను నేను ఎంత సమర్థించుకున్నా.. మనసు దానంతటదే.. దిగులులో కూరుకుపోతుందిరా’’ అని బలవంతంగా నవ్వాడు.
‘‘అవునూ ఓ సంవత్సరం క్రితం స్పెర్మ్ ఇన్‌సెమినేషన్ జరిగింది కదా, దాని రిపోర్టు ఏమయిందీ’’ అడిగాడతను.
‘‘ఫెయిలయిందిరా! అదీ నా దురదృష్టానే్న నిరూపించింది’’ అన్నాడు.
‘‘ఓ.. ఐసీ.. కాని అది ఫెయిలవ్వడానికి వీలు లేదే. ఎలా జరిగింది? మేం చేస్తున్న ఏ కేసు ఇంతవరకూ ఫెయిలవ్వలేదు. ఇండియాలో కూడా ఇంచుమించుగా అన్ని కేసులూ సక్సెస్ అవుతున్నాయి. మరీ ఈ కేసు ఫెయిలవ్వడానికి కారణం ఏమిటో నేను... కేస్ డీల్ చేసి డాక్టర్స్‌ను కనుక్కుని.. మళ్లీ ఫోన్ చేస్తానాగు. ఏదైనా అవకాశం ఉంటే ఇంకొకసారి ట్రై చెయ్యొచ్చు’’ అంటూ ఫోన్ పెట్టేశాడు.
వెంటనే నాలుగైదు ఫోన్లు చేసి రెండు గంటలు పైగా డిస్కస్ చేశాడు. చివరి ఫోన్ ముగిసేసరికి అతని ముఖంలో నమ్మలేని ఓ నిజం తెలుసుకున్న ఆనందం.. పొరపాటును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వైద్య రంగం చేస్తున్న మోసం పట్ల కోపం ఒక్కసారిగా కలిగాయి.
ఆ రెండింనీ కలగలుపుతూ.. తన స్నేహితుడి ప్రాణం నిలిపేందుకు... అతనికో ఫోన్ చేశాడు.
ఆ ఫోన్ మాట్లాడాక అప్పటివరకూ ఉన్న నీరసాన్ని సింహం జూలు విదిల్చినట్లు వదిలించుకుని.. ఉవ్వెత్తున లేచి నిలబడ్డాడు.
***
అవినాష్ జీవన ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు.
కాట్స్ మీద ప్లేట్‌లో అన్నం కలిపి అవినాష్‌కు తినిపిస్తోంది. ముద్ద అందుకుంటూ ఏదో చదువుకుంటున్నాడు. పక్కనే కూర్చుని బొమ్మతో ఆడుకుంటున్న ప్రకృతి అవినాష్‌కు పెట్టబోయే చెయ్యి పట్టుకుని లాగి నోరు తెరిచి తనకు పెట్టమని..
‘‘ఆ..ఆ...’’ అంటూంది.
‘‘చూడు.. అవీ.. తన కోసం పప్పేసి, నెయ్యేసి, ఇల్లంతా తిప్పి ఆడిస్తూ పెడితేగానీ ఐదుముద్దలు తినడం కష్టం. నీకు తినిపిస్తూంటే చూడు ఎంత కుళ్ళో లాక్కుని మరీ పెట్టమంటుంది’’ అంది కంప్లయింట్ చేస్తూ...
‘‘పోనీ పెట్టు’’ అన్నాడు తల తిప్పకుండా...
‘‘పెట్టు! తనకు పెట్టేపుడు ఎంత విసిగిస్తుందో నీకేం తెలుసు!’’ అంది జీవన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూసి పెట్టద్దని అర్థం చేసుకుందేమో...
‘‘నా...న్నా..న్నా’’ అంటూ అవినాష్‌కు, తనూ జీవనమీదేదో కంప్లయింట్ చేస్తున్నట్లుగా జీవన వైపుచెయ్యి చూపిస్తూ పెదవులు వంపేసి ఏడుపు మొహం పెట్టేసింది ప్రకృతి.
‘‘అమ్మ పెట్టనంటూంది కదా! గయ్యాళి అమ్మ. నేను పెడతానేం నీకు. ఆ.. ఆ..’’ అంటూ తను తినిపించసాగాడు. ఒక్కో ముద్దా జీవన అవినాష్‌కు పెడుతూంటే అవినాష్ ప్రకృతికి పెడుతూ... ఆడుతూ.. అల్లరిగా ఆనందంగా...
ఆ ఆనందం వాళ్ళకు పాప దక్కినప్పటినుంచి దక్కింది. అవినాష్ జీవనను వివాహం చేసుకున్నప్పటినుంచీ దక్కింది.
వారి జంటతో కాపురం పెట్టింది.. వసంత మనసు మజ్జిగకుండలా చల్లబడింది.
ఒకరికోసం ఒకరు అన్నట్లుండే ఆ ముగ్గుర్నీ చూస్తూంటే ఆ కాలనీలో అందరికీ ఆనందదాయకంగానే ఉంది.
ఇప్పటికీ జీవనను పాప గురించి.. మరో ప్రశ్న వేయలేదు అవినాష్.
‘‘పాప జీవనది. పాపతో కలిసిన జీవన నాది!’’ అనుకున్నాడు.
అనాధ జీవితం గడిపిన తనకు అద్భుతమైన అనుబంధాలు దొరికాయని ఆనందపడ్డాడు.
జీవన కూడా ఎంతో సంతృప్తిగా జీవనం సాగిస్తూంది.
తనకు గర్భం ఎలా వచ్చిందనేది... తనకే సాక్ష్యం దొరకలేదు ఇంకా..
వసంత జీవనలో తన గర్భాన్ని గురించిన అనుమానాలనూ ఆలోచ
అనవసరం ప్రస్తావనగా.. జీవితంలో.. ఆ ఆలోచనకు చోటు లేకుండా చేసింది.నలనూ జీవనలో రేగనివ్వడంలేదు.
-ఇంకాఉంది
విశ్రాంతి శరీరం పొందింది కానీ మనసు కాదన్నట్లుగా అతని ముఖం
english title:
amma serial
Date:
Wednesday, April 17, 2013