రాజమండ్రి, ఫిబ్రవరి 13: మద్యం సిండికేట్ల నుండి నెల వారీ దందాలకు పాల్పడుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, అనధికారుల చిట్టా రెండు మూడు రోజుల్లో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రిలోని ఒక సిండికేట్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించటం, ఆ సమయంలో దొరికిన జమా ఖర్చుల పుస్తకాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు సదరు సిండికేట్ నిర్వాహకుడిపై కేసు నమోదుచేశారు. తొలి దశలో రాష్టవ్య్రాప్తంగా సిండికేట్ కార్యాలయాలపై ఎసిబి అధికారులు జరిపిన దాడుల్లో దొరికిన జమా ఖర్చుల పుస్తకాలను విశే్లషించిన అనంతరం, మలి దశలో కేసుల నమోదు, అరెస్టుల పర్వం మొదలైంది. అయితే శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాల్లో ముందుగానే ఈ కార్యక్రమం మొదలవటంతో రాజమండ్రికి చెందిన సిండికేట్ నిర్వాహకులు ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో రాజమండ్రి సిండికేట్ గుమాస్తాను అరెస్ట్‌చేయటం ద్వారా, మామూళ్ల వ్యవహారంలోని కొంత కీలక సమాచారాన్ని ఎసిబి అధికారులు రాబట్టారు. అయితే అసలు సూత్రధారి ఇప్పటి వరకు ఎసిబి అధికారులకు దొరక్కపోవటంతో, పూర్తిస్థాయి సమాచారం బయటకు రాలేదు. దాంతో గత పది రోజులుగా సిండికేట్ నిర్వహణలో కీలకపాత్రను పోషిస్తున్న నిర్వాహకుడ్ని అరెస్టుచేసేందుకు ఎఏసిబి అధికారులు అన్ని వైపుల నుండి ఒత్తిడి చేసారు. చివరకు సోమవారం మధ్యాహ్నానికి ఎసిబి అధికారులకు సిండికేట్ నిర్వాహకుడు దొరికినట్టు తెలుస్తోంది. అయితే ఎసిబి అధికారులు మాత్రం దీనిని ధ్రువీకరించటంలేదు. సిండికేట్ నిర్వాహకుడ్ని అరెస్టు చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల కారణంగా రెండు మూడు రోజుల్లో పట్టుకోగలమని భావిస్తున్నట్టు ఎసిబి డిఎస్పీ డివి నాగేశ్వరరావు చెప్పారు. విశ్వశనీయవర్గాల సమాచారం ప్రకారం సిండికేట్ నిర్వాహకుడు కె బాలు ఎసిబి అధికారులు అదుపులో ఉన్నారని, జిల్లాలోని మద్యం సిండికేట్ల లావాదేవీలు, మామూళ్ల పంపకాలు తదితర వ్యవహారాలపై ఎసిబి అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే రాజమండ్రి ఎసిబి కార్యాలయంలోనే సిండికేట్ నిర్వాహకుడు బాలు ఉన్నాడో? లేక మరెక్కడైనా అజ్ఞాత ప్రాంతంలో సిండికేట్ నిర్వాహకుడు బాలును ఏసిబి అధికారులు ప్రశ్నిస్తున్నారో? అంతుబట్టకుండా ఉంది. పరిస్థితి చూస్తుంటే ఒకటి రెండు రోజుల పాటు సిండికేట్ నిర్వాహకుడు బాలును ఎసిబి ప్రత్యేక అధికారుల బృందం విచారించిన అనంతరం అరెస్ట్‌చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిండికేట్ కార్యాలయంలో ఎసిబి అధికారులకు లభించిన జమా ఖర్చుల పుస్తకంలోని వివరాలను బట్టి ఇప్పటికే ఏ శాఖకు చెందిన అధికారులు, ఎంతెంత నెల వారీ వసూలు చేస్తున్నారో అర్ధమయింది. అయితే సిండికేట్ నిర్వాహకుడు బాలును విచారించిన అనంతరం, ఇంకెంత మంది వసూల్ రాజాలు బయటపడతారో అన్నదే ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఎసిబి అదుపులో సిండికేట్ నిర్వాహకులు? *వసూల్ రాజాలకు ముచ్చెమటలు
english title:
excise list
Date:
Tuesday, February 14, 2012