న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ డోపింగ్ పరీక్షల్లో నిర్దోషిగా తేలినట్టు కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. హెరాయన్‌తో పాటు నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు విజేందర్, మరో నలుగురు బాక్సర్లపై ఆరోపణలు రావడంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఇటీవల వారికి పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాక్సర్ల రక్తం, మూత్రం నమూనాలు సేకరించి ‘నాడా’ ఈ పరీక్షలు నిర్వహించింది. అయితే వీరు ఇటీవలి కాలంలో హెరాయన్ లేదా ఎటువంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు ఈ పరీక్షల్లో రుజువు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ డోపింగ్
english title:
n
Date:
Wednesday, April 17, 2013