ఎండాకాలంలో ముఖభాగం కాంతి విహీనమవుతోందని బాధపడే వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. బ్యూటీ పార్లర్లను ఆశ్రయించి భా రీగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పాలను కాచి చల్లార్చాక, దానిపై ఏర్పడే మీగడను చర్మ సంరక్షణ కోసం వాడవచ్చు. కాసేపు ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి మీగడను ముందుగా పేస్టులా తయారు చేసుకోవాలి. ముఖానికి దీన్ని ‘మాస్కు’లా వేసుకుని బాగా ఆరనివ్వాలి. అరగంట తరువాత ముఖాన్ని పరిశుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖభాగం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. నిమ్మరసాన్ని ముఖంపై మృదువుగా రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకున్నా ఉల్లాసంగా ఉంటుంది.
ఎండాకాలంలో ముఖభాగం కాంతి విహీనమవుతోందని బాధపడే వారు ఇంట్లోనే
english title:
idia
Date:
Saturday, April 20, 2013