బిడ్డ ప్రాణరక్షణలో- అమృతం లాగా పనిచేస్తాయ ‘చనుబాలు’. పుట్టంగానే అమ్మను కోల్పోయిన దురదృష్టవంతులైన పసిపాపలకు- ఆవుపాలు అందుబాటులో వుంటే కొంత నయమేగానీ- అమ్మ పాలే దొరికితే - అంతకన్నా ఇంకేం కావాలి? రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో చనుబాల బ్యాంకు ఒకటి ప్రారంభించారు. దీన్ని మన్నాదాయి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పరిచారు. దీనికి యిటీవల రాజస్తాన్ ఆరోగ్య శాఖామంత్రిగారు ప్రారంభోత్సవం చేసి- నామకరణం కూడా చేశారు. దీని పేరు ‘దివ్యా మదర్స్ మిల్క్ బ్యాంక్’. బిడ్డను ప్రసవించగానే మృత్యువాత పడ్డ తల్లులుంటారు, మృత శిశువులకు జన్మనిచ్చిన అమ్మలూ వుంటారు, పసికందులుగానే మాతృమూర్తిని పోగొట్టుకున్న పాపలెందరో వుం టారు. అటువంటి వారికి రుూ బ్యాంకు- ‘చనుబాలు’ సరఫరా చేస్తుంది.
ఈ బ్యాంకు స్థాపనకు- ‘మా భగవతీ సంస్థాన్’ అనే ఎన్.జి.ఓ సంస్థ సహాయపడ్డది. తల్లిపాలకు నోచని పాపలకు- దాదమ్మలు, వితరణగల పెంపుడు తల్లులు అరుదుగా దొరుకుతున్న రోజులివి. ఈ పాల బ్యాంకుకి ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించి- బిడ్డను కోల్పోయిన తల్లులు- తమ దగ్గర వున్న చనుబాలను యివ్వవచ్చును. అలాగే, తన బిడ్డ తాగగా మిగిలిపోయి, అధికంగా వున్న పాలను దయాళువులైన తల్లులు యివ్వవచ్చును.
ఈ పాలను ఆధునికమైన పద్ధతులలో శుద్ధి చేసి- నిల్వచేస్తారు. ఆస్పత్రులలో- ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్న పాపలకు, భూమీద తల్లిలేని అనాథ పాపలకు, రోగగ్రస్తులయి- వేరే రకం పాలు పడని పాపలకు- యిలా కావాల్సినవారికి- రుూ బ్యాంకు ‘అమ్మపాలు’ అందిస్తుంది. కాకపోతే, చనుబాలను యిక్కడ బ్యాంకులో యిచ్చే అమ్మలకు బ్యాంకు పరిహారం, పారితోషికం లాంటి ప్రోత్సాహాలు ఎంతమాత్రం యివ్వదు. మానవతా దృక్పథంతో- తల్లులు ముందుకు రావాల్సిందే... ఎందుకు రాకూడదూ?
బిడ్డ ప్రాణరక్షణలో- అమృతం లాగా పనిచేస్తాయ ‘చనుబాలు’.
english title:
veeraji
Date:
Saturday, April 20, 2013