Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

నారాయణస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

సియస్‌పురం, ఫిబ్రవరి 14: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో వారం రోజులపాటు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ కార్యనిర్వాహణ అధికారి వేమూరి గోపి, వేద పండితులు వి.సీతారామాంజనేయఅవధాని, అర్చకులు ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో మంగళవారం గణపతిపూజ, పుణ్యహవచనం, మండపారాధన, కలశస్థాపన, హోమములు, విశేషపూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు వి.సీతారామాంజనేయఅవధాని ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈకార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో
english title: 
narayana swamy aalayam

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles