సంగారెడ్డి, ఫిబ్రవరి 14: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో విచారణకు తీసుకువచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం 4గంటలకు చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని దర్గి గ్రామానికి చెందిన కట్టుకోయిల బ్రహ్మం (40) కొంతకాలంగా బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల రామంచంద్రాపురంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలు దొంగతనాల కేసులతో సంబంధం ఉన్న బ్రహ్మంపై అనుమానంతో రామచంద్రాపురం పోలీసులు నిఘా పెట్టి విచారణ చేపట్టారు. వారం రోజుల క్రితం బ్రహ్మంను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం 4గంటలకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వేధింపులు, దెబ్బల కారణంగానే బ్రహ్మం మృతిచెందాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పిజె విక్టర్ రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. బ్రహ్మం తన లుంగీతో ఉరి వేసుకొని చనిపోయినట్లు తెలిపారు. బ్రహ్మం మృత దేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి తహశీల్దార్ కిషన్ పంచానామా నిర్వహించారు. జిల్లా అస్టిటెంట్ కలెక్టర్ గంధ చంద్రుడు, సంగారెడ్డి డిఎస్పీ వెంకటేశ్ కూడా శవ పంచనామాలో పాల్గొన్నారు.
మద్యం వ్యాపారి రమణకు
రెండురోజుల ఎసిబి కస్టడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 14: మద్యం వ్యాపారి నున్న రమణను అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కస్టడీకి అనుమతిస్తూ ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలిచ్చింది. అరెస్టు అయిన వెంటనే ఒకసారి కస్టడీకి తీసుకున్న ఎసిబి అధికారులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి అనుమతించాలని ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు రెండు రోజులు కస్టడీకి ఆదేశించింది. కనీసం ఐదురోజులైనా కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు కూడా 10 లక్షల రూపాయలు ముడుపులు చెల్లించినట్లు రమణ ఆరోపణలు చేశాడు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఎసిబి అధికారులు బుధ, గురువారాలు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు.
రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో విచారణకు తీసుకువచ్చిన rc
english title:
rc
Date:
Wednesday, February 15, 2012