హైదరాబాద్, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 20న సుమారు 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌టిసి ఎండి బి ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్థ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, కోటప్పకొండ, ఏడుపాయలు (మెదక్‌జిల్లా), వేములవాడ, కీసర తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో 160 బస్సులు శ్రీశైలానికి, 70 కోటప్పకొండకు నడుపుతున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రం వెలుపల నుంచి కూడా కొన్ని బస్సులను నడుపుతున్నట్లు మంగళవారం నాడిక్కడ మీడియాకు వివరించారు. ప్రయాణీకులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే బాధ్యతతో ఆర్‌టిసి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 5 నుంచి 11 వరకు వరంగల్ జిల్లా మేడారంలో జరిగిన సమ్మక్క, సారమ్మల జాతరకు గతంలో కంటే అధికంగా ఈ సారి 3,200 బస్సులను నడిపినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ ప్రత్యేక బస్సులను నడపడం వల్ల సుమారు ఒక కోటి రూపాయలు మేర ఆర్‌టిసికి లాభం రాగా, మొత్తం రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని ఎండి వెల్లడించారు. ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, కార్పోరేషన్ సెక్రటరీ రవీంధ్రలూ ఆయనతో ఉన్నారు.
ఆర్‌టిసి ఎండి బి ప్రసాదరావు వెల్లడి
english title:
m
Date:
Wednesday, February 15, 2012