చెన్నై, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా వచ్చేనెల చెన్నైలో జరగాల్సిన క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ల నిర్వహణపై నిర్ణయాన్ని పాలక మండలి వాయిదా వేసింది. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఆరోపిస్తూ తమిళనాడులో నిరసనలు జోరందుకున్న విషయం తెలిసిందే. పరిస్థితిని గమనించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో మ్యాచ్లకు లంక ఆటగాళ్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ల నిర్వహణ సందిగ్ధంలో పడింది. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించి, తుది తీసుకోవాలని తీర్మానించింది. మే 21న క్వాలిఫయర్, 22న ఎలిమినేటర్ మ్యాచ్లు జరగాల్సి ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో
english title:
chennai matches
Date:
Tuesday, April 23, 2013