న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: తనపై వచ్చిన అభియోగాలను విచారిస్తున్న క్రమశిక్షణ కమిటీ నుంచి అరుణ్ జైట్లీని తప్పించాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ డిమాండ్ చేశాడు. ఐపిఎల్‌ను అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్‌గా తీర్చిదిద్దిన మోడీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో బిసిసిఐ అతనిని తొలగించిన విషయం తెలిందే. భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనికి మోడీ బాధ్యుడని వచ్చిన ఆరోపణలపై ఐపిఎల్ క్రమశిక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది. కాగా, కొచ్చి ఫ్రాంచైజీ విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసిన జైటీ క్రమశిక్షణ కమిటీలో సభ్యుడిగా కొనసాగడంలో అర్థం లేదని మోడీ ధ్వజమెత్తాడు. ఫిర్యాదుదారుడు, క్రమశిక్షణలో సభ్యుడు ఒకరే అయితే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించాడు. ఇటీవలే కమిటీకి మోడీ 229 పేజీల భారీ వివరణ పంపాడు. మే రెండో వారం తర్వాత, వీడియో లింక్ ద్వారా తాను విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. అదే విధంగా ఇప్పటి వరకూ బిసి సిఐ విచారించిన వారి నుంచి సేకరించిన సమా చారాన్ని తమకు అందించాలని కోరాడు. తనపై వచ్చిన ఫిర్యాదులు ఏమిటో పూర్తిగా తెలిస్తేగానీ, సమాధానాలు ఇవ్వడం కష్టమని స్పష్టం చేశాడు. ఇలావుంటే, బిసిసిఐ సాక్షులను క్రాస్ ఎగ్జామ్ చే యడానికి తమకు సహకరించాల్సిందిగా మోడీ తరఫు లాయర్లు ఎంతోకాలంగా కోరుతున్నారు. అయతే, దీనికి బిసిసిఐ అంగీకరించడం లేదు. సాక్షులను ప్రశ్నించే అధికారం మోడీకి లేదని బిసిసిఐ వాదిస్తోంది.
తనపై వచ్చిన అభియోగాలను విచారిస్తున్న
english title:
mody
Date:
Tuesday, April 23, 2013