మహిళలపై అకృత్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉండటం సిగ్గుచేటు. దేశంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరసనగా బిజెపి మహిళా మోర్చ ఆధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం కూడా నిర్వహించాం. ఢిల్లీలో గత వారం జరిగిన అమానుష, జుగుప్సాకరమైన సంఘటన పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిర్భయ సంఘటన మరచిపోకముందే ఢిల్లీలో మరో గుడియా సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. భారత ప్రభుత్వం మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు నిరోధించడానికి పార్లమెంటులో ఏకగ్రీవంగా నిర్భయ చట్టాన్ని ఆమోదించినా, అత్యాచారాలను ఆపలేకపోతోంది. చట్టాన్ని అమలుచేసే అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవ్వడమే ఇటువంటి దుస్థితికి కారణమైంది. ఢిల్లీలో కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రతి రోజు అనేక అత్యాచారాల సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ నగరం అత్యాచారాల రాజధానిగా మారిందంటే అతిశయోక్తి కాదు, పోలీసుల నిష్క్రియాతత్వం, రాజకీయ నాయకుల ప్రమేయం కారణంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అకృత్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉండటం చాలా సిగ్గుచేటు. మన రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నా, మహిళా హోం మంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. భర్త ఎదుటే భార్యపై, తల్లి ఎదుటనే కూతురుపై అఘాయిత్యాలకు పాల్పతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. మహిళలపై అత్యాచారాలను పోలీసులు తీవ్రంగా పరిగణించకపోవడం, అరికట్టాలనే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, నిందితులకు శిక్షపడే విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిందితులకు సత్వరంగా శిక్షలు పడకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. మహిళలపై అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ ప్రభుత్వాలకు గోరీ కట్టాల్సిందే
మహిళలపై అకృత్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉండటం సిగ్గుచేటు.
english title:
a
Date:
Thursday, April 25, 2013