మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మాయిలపై యాసిడ్ పోసిన యువకులను పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటన వరంగల్‌లో జరిగినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వరంగల్‌లో విద్యార్థినులు పోలీస్ సూపరింటెండెంట్‌ను కలిసి పోలీసు చర్యలను అభినందించారు. కఠిన నిర్ణయాలతో ముందస్తు ప్రమాదాలను అరికట్టవచ్చు. అప్పటి సంఘటనలను రాష్ట్రంలో నేటికీ చర్చించుకుంటున్నారు. దీంతో మహిళలు, చిన్నారులపైన అఘాయిత్యానికి ఎవరూ సాహసించలేకపోయారు. సంఘటనకు బాధ్యలైన వ్యక్తులను తక్షణం గుర్తించి, వెంటనే శిక్షలు అమలు చేయాలి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే మహిళలు గడప దాటాలంటే భయపడాల్సి వస్తోంది. మహిళలు భయంతో బతకాల్సి వస్తున్నది. ఇటీవల మళ్ళీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. ప్రతి రోజు రాష్ట్రంలో అక్కడక్కడ అత్యాచారాల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సంఘటనలు జరిగినప్పుడు సానుభూతులు, దిగ్భ్రాంతులు, పరామర్శలు, మనోవేదనలు వెలిబుచ్చడమే కాదు, అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. జరుగుతున్న సంఘటనలకు సత్వర పరిష్కారాలకు కఠిన శిక్షలు అమలు చేయడం తప్ప మరో మార్గం లేదు. ఢిల్లీలో జరుగుతున్న సంఘటనలకు జనం జంకుతున్నారు. ‘నిర్భయ’ చట్టాలను తక్షణం అమలు చేయడానికి ఎక్కువ రోజులు అక్కరలేదు. కనీసం నెల రోజుల్లో రేపిస్టులకు మరణశిక్షలు విధించాలి. ఢిల్లీ సంఘటన పట్ల ప్రధాని ఆవేదన వ్యక్తం చేస్తే సరిపోతుందా? చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తులు ఉన్నత స్థానాల్లో కూర్చుని నిర్ణయాలు తేల్చి చెప్పాలి. అత్యాచారం చేసిన వ్యక్తులకు నామమాత్రపు శిక్ష, జరిమానాలు వేస్తే సరిపోదు, వారికి ఉరి, యావజ్జీవం వంటి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అత్యాచార సంఘటనల పట్ల మహిళలు ఉద్యమాలకు నడుం బిగిస్తున్నారు. పరిస్థితులు చేజారిపోక ముందే ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. శాంతి భద్రతల అంశంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. క్రూరంగా వ్యవహరిస్తున్న మృగాలను నడిరోడ్డుపై ఉరితీయాల్సిందే. ఢిల్లీలో నిర్భయ సంఘటన తర్వాత దేశంలో అత్యాచార సంఘటనలు ఇంకా కొనసాగడం బాధాకరం. ఉదయం నిద్దురు లేవగానే అత్యాచార సంఘటనల వార్తలు చూడాల్సి వస్తుంది. వార్తా పత్రికల్లో అత్యాచార సంఘటన వార్తలు లేని రోజు లేదని చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపడానికి భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడో కాదు పొరుగున ఉన్న వ్యక్తులను కూడా నమ్మే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో అత్యాచార సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలి.
మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని కాల్చి చంపడమే సరైన శిక్ష
english title:
k
Date:
Thursday, April 25, 2013