ప్రకటింపంగ మదీయ చిత్తమది దాబం చేంఅదియోద్వృత్తమై
ప్రకట ప్రాప్తిని సోలుగాని మఱి నీ పాదాబ్జ సంసేవనం
బొక వేళన్ భజియండ నొల్లదు నిజం బూహింప నెట్టన్న నీ
గకు దుర్గంధము గాక సహ్యమగునే కస్తూరి సర్వేశ్వరా!
సర్వేశ్వరా నా చిత్తం పంచేంద్రియాల ప్రభావంతో ప్రారబ్దాన్ని అనుభవించుతుందే తప్ప నీ పద కమలాలను ఒక్కసారైనా సేవించడానికి అంగీకరించదు. ఇది నిజం ఈగకు దుర్గంధం సహ్యమవుతుంది కాని కస్తూరి సుగంధం అవుతుందా?
ఇంద్రియాల వల్ల కలిగే అనుభవాల మీది రక్తి అంతా దుర్గంధంతోనూ శివపాద సేవనం వల్ల కలిగే ఆనందం అంతా కస్తూరీ సుగంధంగానూ కవి పోలుస్తున్నాడు. అట్లాగే ఇంద్రియభోగానురక్తుడు ఈగతో పోల్చబడుతున్నాడు. ఉపమానం నీచం కావడం వల్ల కూటసంసారి చేస్తున్న పని కూడా నీచమైనదే నని కవి సూచిస్తున్నాడు. ఇంద్రియాల వల్ల కలిగే సుఖం అశాశ్వితమూగాను, శివానుగ్రహం తో శివభక్తివల్ల ఏర్పడే సుఖం శాశ్వతం గాను ఉంటుంది అనేది ఈ పద్యంలోని మూలభావం.
సర్వేశ్వర శతకములోని పద్యమిది నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్