వాళ్ళంతా ఆ కథల గురించి ఏవేవో మాట్లాడుతూ వుంటే, వినడానికెంతో బావుండేది రవళికి.
ఏ వారమైనా చైతన్య అందుబాటులో లేకపోతే, రాజేశ్వరి రవళితో చదివించుకొనేది. రవళి ఏదైనా తప్పుగా పలికితే, ఆమె నవ్వుతూనే సవరించేది. ఆవిడ చూడకుండా అంత కరెక్ట్‌గా చెప్పగల్గుతూంటే, తను చూసి కరెక్ట్‌గా చదవకపోవడం ఏంటన్న పంతం కొద్దీ కూడబలుక్కోని అలాంటి పదాల్ని మొదట మనసులో చదివి, సరిచేసుకొని పైకి కరెక్టుగా చదివేది. అలా తెలుగు భాష మీద పట్టు సాధించింది. అలా మాగజైన్స్ నుండి నవలలు చదివేవరకూ కోరిక పెరిగింది. ఎప్పుడు చూసినా ఏదో ఒక బుక్ చదువుతూ వుండే ఆమెకు ఫ్రెండ్సంతా ‘పుస్తకాల పురుగని’ నిక్‌నేం పెట్టేసారు కూడా. తండ్రి ప్రతి నెల ఇచ్చే పాకెట్ మనీలో అధిక భాగాన్ని పుస్తకాలకే వెచ్చించేది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ వుండేది కాబట్టి ఆమెని ఎవరూ మందలించాల్సిన పరిస్థితి రాలేదు.
ఒక్కో రాక్ దగ్గరికి వెడుతూ, ఒక్కో పుస్తకాన్ని ఆప్యాయంగా స్పర్శిస్తూ నడుస్తున్న రవళి.
‘‘ఏమండీ- ‘అమృతం కురిసిన రాత్రి’ అనే నవల ఉందాండి! అని సేల్స్ గర్ల్‌ని ప్రశ్నిస్తోన్నతన్ని గొంతు వింటూ తల తిప్పి చూసింది.
‘‘అది నవల కాదండీ, కవితలుండే పుస్తకం’’ చెప్పింది సేల్స్‌గర్.
‘‘ఓ అలాగా-ఇంతకీ దాన్ని ‘తిలక్’ అన్న వ్యక్తే రాశాడు కదూ’ కన్‌ఫం చేసుకునేందుకు అతడడుగుతూంటే నవ్వొచ్చింది రవళికి.
‘‘అవునండీ, కానీ ఆ పుస్తకం లేదు- ఒకే ఒక బుక్ వుంటే ఇప్పుడే ఆ ఆకుపచ్చ చుడీదార్ వేసుకొంది చూడండి, ఆమె కొనేసింది’’ అంది సేల్స్ గర్ల్.
‘‘అరెరె. ఇంకెక్కడైనా ఓ బుక్ వుందేమో చూడండి, నాకర్జంటుగా కావాలి’’ ఆ మాటలు వింటూ, రవళి వెనుదిరిగి చూసింది. సుమారు ఇరవై రెండేళ్ళున్న ఓ యువకుడు బ్రౌన్ చెక్స్ ఉన్న షర్ట్‌లో చాలా స్మార్ట్‌గా కన్పించాడు, ఆరడుగుల ఎత్తున్నందుకేమో కాస్త వంగి నడుస్తున్నా, అదో స్టైల్‌గా కన్పిస్తోంది.
చామనఛాయ కలర్‌లో ఉన్నా కళగా ఉన్నాడు అనుకొంటూ, అంతలోనే అతడెలా వుంటే ఏంటని వివేకం మొట్టేసరికి, మళ్ళీ తన పుస్తకాల వేటలో పడింది.
‘‘ఎక్స్‌క్యూజ్‌మీ, మీరు కొన్న ‘అమృతం కురిసినరాత్రి’ బుక్‌ని నాకు ఇవ్వగలరా- ప్లీజ్’’ అంటూ ఆ యువకుడు తన దగ్గరికి వచ్చి అడిగేసరికి ఇదేంటిలా అడుగుతున్నాడనుకొంటూ ఆశ్చర్యపోయింది. ఆ కళ్ళలోని భావాన్ని గ్రహించినట్లు ‘‘సారీ, మీరా బుక్ ముందుగానే కొనేసారట. ఇంకో పుస్తకం లేదట. ముక్కూ మొహం తెలీనివాడిలా అడిగేస్తున్నాడేంటని అనుకోకండి. నా ఫ్రెండ్ పొద్దుటే దీని కోసం ఇక్కడికి వస్తానన్నాడు, కానీ నేనే వాడిని వేరే పనిమీద పంపిస్తూ ఆ బుక్ నేనెలాగైనా తెచ్చిస్తాలేనని ప్రామిస్ చేసాను’’ అన్నాడు.
‘‘ఏదో పాత ఫ్రెండ్‌కి చెప్పినట్లు ఏంటిలా అన్నీ చెప్పేస్తున్నాడు’’ అని రవళి అనుకొంటూండగానే-
‘‘ఏదో ఫ్రెండ్‌నడిగినట్లు అడుగుతున్నాడేంటి అనుకోండి. నా ఫ్రెండ్‌కిచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తాపత్రయం కొద్దీ అడిగాను’’
‘‘ఏంటి, తనకి మనసులో ఏమనుకొన్నా తెలిసే విద్య వుందా- మరి ఈ బుక్ నాకూ ఇష్టమయ్యే కొనుక్కొన్నానని గ్రహించలేడా?’’ అనుకొంది కాస్త ఇబ్బందిగా.
‘‘మీరూ ఎంతో ఇష్టపడే ఆ బుక్ కొనుక్కొని వుండొచ్చు. ఇలా అడగడం సభ్యత కాదు గానీ- నా ఫ్రెండ్...’’ అంటూ నాన్చాడు.
‘‘్ఫర్వాలేదులెండి. ఆలెడ్రీ నా దగ్గరీ బుక్ వుంది. నా ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా ఇద్దామని కొన్నానిది, మీరు తీసుకోండి’’ అంటూ బుక్ అందించింది.
‘‘్థంక్సండి, ఎట్‌ది సేమ్ టైమ్ సారీకూడానండి, మీరు కొన్నదాన్నిలా తీసేసుకొంటున్నందుకు’’ అంటూ బుక్‌మీది రేట్ చూసి డబ్బిచ్చాడు చిరంజీవి.
‘‘మరి మీరు మీ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌గా.. ఏం కొంటారో చెబితే, మిమ్మల్నక్కడ డ్రాప్ చేస్తాను’’ అన్నాడు మళ్ళీ తనే.
‘‘అక్కడ ‘కృష్ణపక్షం’ కూడా వుంది- అదిస్తాలెండి’’ అంది రవళి.
‘‘ఓ... అలాగా... పుస్తకాలు తప్ప గిఫ్ట్‌లుగా మరేం ఇవ్వర్లేవుందే’’ సరదాగా అన్నాడతను.
ఆ మాటలకు నవ్వేస్తూ ‘‘అదేం కాదు- మేం పావురాలని, కుందేళ్ళని, మంచి మంచి పెయింట్స్‌ని, బొమ్మల్ని కూడా ఇచ్చిపుచ్చుకొంటుంటాం’’ అంది రవళి.
‘‘ఓ- ఇలాంటివి కూడా గిఫ్ట్‌లుగా ఇవొచ్చన్నమాట. బైదిబై నా పేరు చిరంజీవి. డిగ్రీ వరకే చదువు- నాన్నగారు అకస్మాత్తుగా పోవడంవల్ల రైస్ మిల్‌ని ప్రొవిజనల్ స్టోర్స్‌ని చూసుకొంటూ వుంటాను- మరి మీరు?’’ అడిగాడు ఆసక్తిగా.
‘‘అబ్బో, ఏంటి యమ స్పీడ్‌గా వున్నాడీ కుర్రాడు!’’ అనుకొంది రవళి, అలాగే చూస్తూ.
‘‘వీడేంటి, ఇలా అన్ని వివరాలూ మొదటి పరిచయంలోనే అడిగేస్తున్నాడని అనుకొంటున్నారా? అదేంటో కొందర్ని చూస్తే చిరపరిచితుల్లా అన్పిస్తారు. ఏ చిన్ననాటి ఫ్రెండ్‌నో అకస్మాత్తుగా కలుసుకొన్నట్లు వుంది’’ అన్నాడతను.
‘‘బాబోయ్- మనసులో ఏమనుకొంటే అదిట్టే చెప్పేస్తున్నాడు- చాలా జాగ్రత్తగా వుండాలి’’ అనుకొంటూ.... ‘‘ఆ.. మీపేరేంటన్నారు’’ అంది తడబడుతూ.
‘‘చెప్పాగదండి మెగాస్టార్ పేరేనని. మా అమ్మకి నేనొక్కడినే. అందుకే తన పంచప్రాణాలూ నామీదే- చిరకాలం వుండాలంటూ ‘చిరంజీవి’ అని పెట్టుకొంది. కాస్త ఆలస్యంగా ఇంటికి వెడితే చాలు, గేట్ దగ్గరే నిలబడి ఎదురుచూస్తూ వుంటుంది’’ అన్నాడు నవ్వుతూ.
నవ్వితే మరింత కళగా అన్పించాడు.
‘‘నా పేరు మృదురవళి. బి.కాం చదువుతున్నాను. నాకో అన్నయ్య పేరు చైతన్య. నాన్నగారూ, వదినా ఇద్దరూ బ్యాంక్ ఎంప్లాయిలు. అమ్మ హౌస్ వైఫ్. అన్నయ్యా వాళ్ళ బాబు పేరు తేజ- మేమంతా బాబీ అంటుంటాం- ఆ మాకో పెట్ గూడా ఉంది, దాని పేరు స్నూపీ.
- ఇంకాఉంది
వాళ్ళంతా ఆ కథల గురించి ఏవేవో మాట్లాడుతూ వుంటే,
english title:
j
Date:
Thursday, April 25, 2013