Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బాద్‌షా ‘సెహభాష్’

$
0
0

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్

అగర్వాల్‌లు నటించిన

బ్లాక్‌బస్టర్ సినిమా ‘బాద్‌షా’

సెహభాష్ అనేలా వుంది.

మొదటి సగం సీరియస్‌నెస్,

ద్వితీయార్థం కామెడీ.

మొత్తంమీద అదిరింది. ఎన్టీఆర్

నటన సీనియర్ ఎన్టీఆర్‌ని

మరపించింది. గజదొంగ,

యుగపురుషుడుని గుర్తుకు

తెస్తుంది. పాటలు, మాటలు,

సంగీతం, ఫైట్లు సూపర్. కాజల్

అంద చందాలతో

మైమరిపింపజేసింది. ఇక

బ్రహ్మానందం, ఏవియస్ తదితర

నటుల హాస్య నటనతో

సెకండాఫ్ కడుపుబ్బ

నవ్వించింది. ఫొటోగ్రఫీ హైలెట్.

లొకేషన్లు, సెట్టింగులు

బాగున్నాయి.
- ఎ.మోహనరావు,

గంపలగూడెం
బ్రహ్మానందం లేకపోతే జనాలు

కరువయ్యేవారు
శ్రీనువైట్ల సినిమా అనగానే

చాలావరకు సక్సెస్‌గానే

ఉంటాయి. స్వతహాగా

ఆలోచించకుండా, ఏదో

ఆలోచనతో ‘బాద్‌షా’ తీసినట్లు

ఉంది. అంతగా ప్రేక్షక

అభిమానం పొందలేదని

చెప్పాలి. ఎప్పుడు కూల్‌గా

హాయిగా ఎంజాయ్‌గా సినిమా

చూద్దామా అంటే ఒక్కటి కూడా

పెద్ద సినిమాలు లేవు.

బ్రహ్మానందం లేకపోతే సినిమాకి

జనాలు కరువయ్యేవారు.

కొద్దోగొప్పో ఆనందం పంచింది

బ్రహ్మానందమే అని చెప్పాలి.

కుటుంబంతో సహా చూసే

సినిమాలు రావేమో అని

భయంగా కూడా ఉంది.

తమిళంలో ఏదో ఒక మెసేజ్

ఉంటుంది. మన తెలుగులో

మెసేజ్ ఉండదు గాని నేర్పినట్లు

ఉంటున్నాయి. హాస్య రసంతో

శ్రీనువైట్ల మంచి కథతో

ఈసారైనా రావాలి. తెలుగుతనం

ఉట్టిపడేలా తియ్యడానికి

ప్రయత్నించండి. పాత

సినిమాలు అయినా ఆ కథతో

ముందుకు వస్తే బాగుంటుంది.
- అందవరపు నాగేశ్వరరావు,

పలాస
సంగీతాభిమానులకు

శరాఘాతమే
70 ఏళ్ల సంగీత ప్రస్థానంలో

36 భాషల్లో వేలకొద్దీ పాటలు

పాడిన గానకోకిల గొంతు

మూగపోయింది. అవును.

లతామంగేష్కర్ గురించే

చెప్తున్నా. ‘‘ఈమధ్య

రెండుమూడు పాటలు పాడాను

కాని ఆస్వాదించలేకపోయాను.

కొత్త వాతావరణంలో

ఇమడలేకపోతున్నా. అందుకే

పాటలకు స్వస్తి’’అని

చెప్పారామె. నిజమే. సంగీతం

పేరుతో హోరు, సాహిత్యం

పేరుతో జుగుప్స విజృంభిస్తున్న

ఈ కాలంలో మరింత

శబ్దకాలుష్యం ఇష్టంలేక

సంగీతమే ప్రాణంగా జీవించిన

గానకోకిల మూగపోవడం

సహజ పరిణామమే. ఇది

సుస్వరాల సంగీతాభిమానులకు

శరాఘాతమే.
- చంద్ర, కాకినాడ
కొత్తవారికి అవకాశమిస్తే

బాగుంటుంది
ప్రజల మెప్పుతో హిట్ అయిన

సినిమాలు కథాబలంవల్లగాని,

హాస్య నటుల వల్లగాని లేక

హీరోయిన్‌వల్లగాని మెప్పుపొంది

ఉండవచ్చు. కాని అది హీరోవల్ల

మాత్రమే హిట్ అయినట్లుగా

ప్రజలు, అభిమాన సంఘాలు

భావించటం సిగ్గుచేటు. హీరోలు

కూడా అది తమవల్లనే అని

భావించటం సరికాదు. సమిష్టి

కృషివల్లే సినిమాలు

విజయవంతవౌతాయి. సినీ

పరిశ్రమలో వారసత్వ హీరోల

ప్రాబల్యం తగ్గించి కొత్తవారికి

అవకాశమిస్తే బాగుంటుంది.
- డి.రామకృష్ణంరాజు,

పొలమూరు
గత స్మృతులను గుర్తుచేస్తున్న

ఫ్లాష్‌బ్యాక్‌లు
ఏప్రిల్ 5న ఎదురీత, 12న

కానిస్టేబుల్ కూతురు

ఫ్లాష్‌బ్యాక్‌లు మరల గతంలో

చూసి ఆనందించిన చిత్రాలలోని

సన్నివేశాలు, పాటలు,

నటనలు గుర్తుకువచ్చాయి. ఈ

రెండు సినిమాలలోను

కాంతారావు, కృష్ణకుమారిలు

హీరో, హీరోయిన్లుగా నటించి

మెప్పించారు. ఎదురీతలో

తనకుమాలిన

ధర్మంచేయటంవల్ల ఎన్ని

అనర్థాలు సంభవించాయో

చూపగా (కాంతారావు

నిజజీవితంలో ఈ చిత్రం నీతిని

ఆకళింపుచేసుకోలేక చివరి

దశలో ఆర్థికంగా

నలిగిపోయారు) కానిస్టేబుల్

కూతురులో ప్రేమ ఫలించక

విషాదాన్ని మిగిల్చింది.

ఇలాంటి ఆపాత మధురమైన

చిత్రాల ఫ్లాష్‌బ్యాక్‌లు

అందిస్తున్న రచయితకు,

ప్రచురిస్తున్న వెనె్నలకు

వెలకట్టలేనన్ని అభినందనలు,

కృతజ్ఞతలు.
- ఎన్.రామలక్ష్మి,

సికిందరాబాదు
వాస్తవాలను తెలియజేశారు
వెనె్నల అనుబంధంలో

‘హీరోల జోరు’ ప్రత్యేక వ్యాసం

తెలుగు సినిమా పరిశ్రమలో

నెలకొన్న దురదృష్టకర

పరిస్థితులను నిజాయితీగా,

నిష్పక్షపాతంగా విశే్లషించింది.

హీరోల డేట్లకోసం వెంపర్లాడే

నిర్మాతలు హీరోచుట్టు కథలు

అల్లడం సహజ పరిణామం.

హీరోకు నచ్చే నటీనటులు,

టెక్నీషియన్లు, లొకేషన్లు ఇలా

సినిమా ప్రారంభం కాకముందే

హీరోల అభిరుచులకు

అనుగుణంగా సినిమా ప్లానింగ్

జరుగుతోంది. కథకు

ప్రాముఖ్యత లేకపోవడంవలన

అధిక శాతం సినిమాలు ఫట్

మంటున్నాయి. ఇక ఆ

నలుగురు రాష్ట్రంలోని

థియేటర్లను గుప్పెట్లోపెట్టుకొని

నిర్మాతలను ఆడించే

విధానంకూడా చదివి చాలా

బాధపడ్డాము. సినిమా

పరిశ్రమలో రాజకీయాలు,

విబేధాలు, గుత్త్ధాపత్యాలు తగ్గి

అర్హులకు అవకాశం

లభించనంత వరకు పరిశ్రమ

పరిస్థితి ఇలాగే వుంటుంది.

వాస్తవాలను మాకు

తెలియజేసిన ఆంధ్రభూమికి,

రచయితకు కృతజ్ఞతలు.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
అందరూ బాధ్యులే
తెలుగు చిత్ర నాయికల

వస్తధ్రారణ అనుచితం,

అసందర్భం. ఏ చిత్రంలో

చూసినా ఆ చిత్రంలో నాయికల

వస్తధ్రారణ చాలా ఘోరంగా

ఉంటోంది. దానివల్ల సమాజం

చాలా భ్రష్టుపడుతోంది. దీనికి

కారణం ఎవరు అన్న ప్రశ్న

అనవసరం. అందరూ బాధ్యులే.

ముఖ్యంగా సెన్సారు బోర్డు

సభ్యులు. సందర్భోచిత

వస్తధ్రారణ కనుమరుగు

అయింది. దీనివల్ల పరిపక్వత

లేని బాల బాలికలు విచక్షణా

జ్ఞానం కోల్పోతున్నారు. ఈ

వస్తధ్రారణకు నిర్మాత,

దర్శకులు కారణభూతులు. ఏ

ఒక్కరు తమ కుటుంబ

సభ్యులతో సినిమా

చూడలేకపోతున్నారు. దీని

నివారణా చికిత్సకు

పూనుకోవాలి. పిల్లి మెడలో

ఎవరు గంటకట్టాలి అని

ఆలోచించకుండా అందరూ

దీనికి సహకరించాలి. లేనిచో

సమాజం అష్టకష్టాల

పాలవుతుంది. ఇప్పటికే చాలా

మంది నష్టపోయాం. ఇంకా

నష్టపోతాం.
- ఓలేటి నారాయణశాస్ర్తీ,

కాకరపర్రు
బీభత్సమైన హాస్యం
‘విశ్వరూపం’ విడుదలకు

వచ్చిన అడ్డంకులవల్ల కాదురా

కమల్‌హాసన్ కుమిలిపోయేది నీ

డేన్స్ చూసి అంటుంది ప్రగతి

నాజర్ డాన్స్ చూసి. అంటే

అంత ఇబ్బందికరంగా వుంది

‘సాగర సంగమం’లోని

కమల్‌హాసన్ డాన్స్‌ని ఇమిటేట్

చేసిన నాజర్ డాన్స్. అటువంటి

స్థితిలో వినోదంగా

భావించాల్సొచ్చింది ఈ

సినిమాని చూస్తూ. సుధ,

సురేఖావాణి, ప్రగతి తమ

అందంతో డాన్స్‌లతో

ఇరగదీశారు. బ్రహ్మానందం

పాల్గొన్న ఐటంసాంగ్‌కి ఆయన

ఎమోషనల్ డైలాగ్స్‌కి మంచి

రెస్పాన్స్‌వస్తోంది. డైరక్టర్

రివెంజ్ నాగేశ్వర్రావుగా

ఎమ్మెస్‌నారాయణ, పోలీస్

కమీషనర్‌గా నాజర్ హాస్యం

పేరిట అరుస్తూంటారు.

గుంపుగుంపులుగా మాఫియా

డాన్‌లు, కుటుంబ సభ్యులు

తిరుగుతుంటారు.

పేరాగ్రాఫ్‌లకొద్దీ డైలాగులు

చెప్తుంటారు. ఇదంతా

బీభత్సమైన హాస్యం అనవచ్చు.

ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం,

డైలాగ్ అతిగానే వున్నాయి.

ఇదంతా విశ్రాంతి తర్వాత

భాగం. ఫస్ట్ఫాలో అంతా డాన్‌ల

గోల. పోనీ కాజల్‌ను చూసి

ఎంజాయ్ చేద్దామనుకుంటే తన

బంతి గోలతో కాస్త

విసుగన్పించింది. కాని మిగతా

సినిమాకన్నా కాజలే బెటర్.

సినిమాకు తగ్గట్లే థమన్ అద్దిరి

పోయే రీరికార్డింగ్ గోలగోల

చేసాడు. బీభత్స వినోదంతో

కూడిన ఈ సినిమాలో ఎన్టీఆర్,

కాజల్, నవదీప్, వెనె

్నలకిశోర్, సురేఖావాణి

బావున్నారు. ప్రతి

సందర్భంలోనూ ఎన్టీఆర్

పేరును ప్రస్తావించి అనుసరించి,

అతి చేసి ఎక్కడ అభాసుపాలు

ఔతారో, జనాల్ని ఇంకా

ఎన్నాళ్లు ఇబ్బందిపెడ్తారో

అన్పిస్తుంది. ‘జస్టిస్‌చౌదరి’

ఇమిటేట్ సీన్స్‌ని చూసి...

(మున్ముందు

‘దానవీరశూరకర్ణ)లాంటి

పాత్రలు వేస్తానంటే

జడుపువస్తోంది. అతి

విశ్వాసంతో అభిసుపాలు

కావద్దు.
- జి.బాలకృష్ణమూర్తి, చింతల్
గుత్త్ధాపత్య సమస్య ఈనాటిది

కాదు
‘‘హీరోలజోరు’’ వ్యాసంలో

ప్రస్తావించిన థియేటర్ల

గుత్త్ధాపత్య సమస్య ఈనాటిది

కాదు. దానిపై ఎందరో

మాట్లాడారు. మరెందరో

రాశారు. కాని పరిష్కారం దిశగా

అడుగులు పడలేదు. ఇప్పుడైనా

చిన్న చిత్రాల నిర్మాతలు

సంఘం ఏర్పాటుచేయాలి. ప్రతి

పట్టణంలోనూ సి క్లాసు

థియేటర్లు కొన్ని ఉంటాయి.

పెద్ద హీరోలు వాటి జోలికి పోరు.

చిన్న చిత్రాల నిర్మాతల సంఘం

అలాంటి థియేటర్లని లీజుకి

తీసుకొని మెరుగులుదిద్ది తమ

సంఘసభ్యుల చిత్రాలు ప్రదర్శిస్తే

బాగుంటుంది. ఇదొక ఐడియా

మాత్రమే. ఆలోచిస్తే మరెన్నో

మార్గాలు దొరుకుతాయి.

ఏదోఒక ప్రయత్నం అంటూ

చేయకపోతే పరిష్కారం ఎలా

లభిస్తుంది?
- శాండీ, కాకినాడ
అపోహలు మాత్రమే
ఈమధ్య తెలుగు చలనచిత్రాల

మీద విపరీతమైన విమర్శలు

వస్తూ ఉన్నాయి. ఉదాహరణకు

తెలుగుచిత్రాల పయనం

ఎటోవెళ్లిపోయినట్లు, ఇకనైనా

మేలుకోకుంటే ఏదో

అయిపోతుందని మరియు మన

తెలుగు వాళ్ళు మాత్రమే

అరువుకథలకోసం

అర్రులుచాస్తున్నట్లు.. ఇవి

అన్నీ అపోహలు మాత్రమే.

వాస్తవానికి తెలుగు చిత్ర రంగం

దక్షిణాదిలోనే అగ్రగామి.

బాలీవుడ్‌లో కూడా త్వరలో

సముచిత స్థానం మనవాళ్ళు

పొందబోతున్నారు. 80వ

దశకంలో మనవాళ్ళు

‘బాలీవుడ్’లో ఒక

వెలుగువెలిగారు. కృష్ణ అంటే

ఎవరో తెలియకపోయినా కృష్ణ

ప్రజెంట్స్ పద్మాలయా ఫిలింస్

అనే టైటిల్ పడగానే

నార్త్థియేటర్లలో చప్పట్లు

మారుమ్రోగేవి.

‘హిమ్మత్‌వాలా’, ‘మవాలి’

‘స్వయంవర్’ ‘జ్యోతిబనే

జ్వాల’, ‘సర్‌గమ్’, ‘జుదాయి’,

‘జస్టిస్ చౌదరి’, ‘నిషానా’లాంటి

ఎన్నో బ్లాక్‌బస్టర్ హిందీ

చిత్రాలను మన

రాఘవేంద్రరావు, దాసరి,

తాతినేని, బాపయ్య,

విశ్వనాథ్‌లాంటి వాళ్ళు

సృష్టించినవే. ‘సర్‌గమ్’లోని

‘డఫిలివాలే’ పాటకు నార్త్‌లో

డబ్బులు వెదజల్లారు.

‘జయప్రద’ ఆ డాన్స్‌ని

అద్భుతంగా ఔరా అనిపించింది.

మెగాస్టార్ ‘ప్రతిబంధ్’ చిత్రానికి

అద్భుతమైన రివ్యూలు

నార్త్‌నుండి వచ్చాయి. ‘ఆజ్‌కా

గూండారాజ్’ మంచి వసూళ్ళను

రాట్టింది. బాలీవుడ్‌ని షేక్

చెయ్యటానికి, ‘రామ్‌చరణ్’,

‘ప్రభాస్’, ‘రానా’

సిద్ధంగాఉన్నారు. పూరి కూడా

రఫ్ ఆడించబోతున్నాడు.

అలాగే ‘రాజవౌళి’ తప్పనిసరిగా

హంగామా చేస్తాడు. గిన్నీస్

రికార్డులు ఎక్కువగా

తెలుగువాళ్ళవే. అలాంటి

పరిశ్రమకు ఏదో అయింది లేక

పోతుంది అనుకోవటం తగదు.

అయితే మార్పులు సహజం.
- పంచకర్ల పూర్ణచంద్రరావు,

మండవల్లి
ప్రేక్షకులు వెర్రివాళ్లా?
ఏప్రిల్ 5 ఆంధ్రభూమి వెనె

్నలలో ‘ఇకనైనా

మేలుకుంటేసరి’ వ్యాసం చాలా

బాగుంది. 30, 40కోట్లు

పెట్టామంటూ హైప్‌తెచ్చి ఎక్కువ

ప్రింట్లతో టిక్కెట్టు రేట్లుపెంచి

జేబులునింపుకోవాలనే

నిర్మాతలకు ప్రేక్షకుల

నిరాదరణతో ఎదురుదెబ్బ

వస్తున్నాయి. పైరసీ రూపంతో

ముందుచూపుతో సంస్కృతీ,

సంప్రదాయాలకు

తెలుగుతనాన్ని భావపరిపూర్ణ

నవరసాలు వెల్లివిరిసేలా

చిత్రాలు తీసి థియేటర్‌కు

ప్రేక్షకులను రప్పించాలి. ఆకుల

రాఘవగారి వ్యాసం

చదివించింది. ధన్యవాదాలు.
- మంగం ఆనందరావు,

వేగివారిపాలెం
అసభ్యకర డైలాగులు ఆపరా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో

ఈమధ్య వస్తున్న చాలా చిత్రాల్లో

డైలాగులు బూతునే

అందిస్తున్నాయి. నిర్మాతలు

టీనేజ్ కుర్రాళ్ళను థియేటర్‌కు

రప్పించడానికి బూతు

డైలాగుల్ని ఎరగా

వాడుతున్నారు అనటం

అతిశయోక్తికాదు. 3జీలవ్

చిత్రంలో చివరికి మూత్ర విసర్జన

సన్నివేశాలకు కూడా చెత్త

బూతు డైలాగులతో తెలుగు

సినీ పరిశ్రమను భ్రష్టు

పట్టించడం శోచనీయం.

ఈమధ్య వస్తున్న సినిమాలన్నీ

తెలిపోతున్నాయ్. రచయితలు

కాస్త ముందూవెనుక ఆలోచించి

డైలాగుల్ని వ్రాయాలని మనవి.

నిర్మాత చెప్పినట్లు లేదా

దర్శకుడు కోరినట్లు కాకుండా

ప్రేక్షకులు ఇళ్ళకెళ్ళి

ఆలోచించినట్లు అలాగే

కథారచయితలు కూడా

సందేశాత్మక కథలను

వ్రాయాలని అశ్లీలతకు దూరంగా

వుండాలని కోరుతున్నాను.
- ఈ.వేమన, శ్రీకాకుళం
వినోదాత్మక చిత్రం
అమ్మాయిలు ఎలాంటి

అబ్బాయిలను కోరుకుంటారు?

అబ్బాయిలకి ఎలాంటి

అమ్మాయి నచ్చుతుంది? అనే

లైన్‌తో మూడు ప్రేమ జంటలతో

ఆద్యంతం హాస్యంతో అలరించిన

పూర్తి వినోదాత్మక చిత్రం ‘మిస్టర్

మన్మథ’. ఈ చిత్రంలో సానియా

చాలా చక్కగా నటించింది.

నవనీత్‌చారి సంగీతంలో పాటు

వినసొంపుగా ఉన్నాయి.

దర్శకుడు సత్యం బెల్లంకొండ

ఘన విజయం సాధించారు.

దాంపత్య వింత అనుభవాలతో

‘మిస్టర్ మన్మథ’ను చక్కగా

నడిపించారు.
- కాళహస్తి వెంకట

శేషగిరిరావు, నెల్లూరు
1963 సం. ఆణిముత్యం
నా ఇరవై సంవత్సరాల

ప్రాయంలో 1963 సం.మేలో

విడుదలైన అలనాటి

ఆణిముత్యం ‘పరువుప్రతిష్ట’

గురించి వెనె్నలలో చదివి

ఆనంద పరవశుడనయ్యాను.

పరువు-ప్రతిష్ట ఇరవై

సంవత్సరాల వయస్సులో

చూడటంతో గుర్తుంది. ఇంత

కళాఖండాన్ని ఆనాడు

చూడగలిగాను. నెనెంతో

అదృష్టవంతుడిననే అనుభూతి

కూడా కలిగింది. రామారావు

అంజలితోబాటు నటించిన ఆ

నటీనటులంతా అంకితభావంతో

పాత్రలో లీనమై నటించినవారే.

మళ్లీ ఆ చిత్రరాజాన్ని వెనె

్నలద్వారా శ్రీ

సి.వి.ఆర్.మాణిక్యేశ్వరిగారు

విశే్లషించడంలో

అభినందనీయులు.
- మంగం ఆనందరావు,

వేగివారిపాలెం
హృదయాల్ని పిండేసే

బాధామయ గాథలెన్నో
హఠాత్తుగా మాయమై

సంచలనం సృష్టించిన వర్ధమాన

నటి అంజలి పిన్ని బాబాయిల

బారినుంచి తప్పించుకోడానికే

వెళ్లిపోయానని చెప్పింది. కీర్తి

ప్రతిష్టలతోబాటు బోలెడు డబ్బు

సంపాదించే నటీమణులు,

గాయనీమణుల సంరక్షకుల

అవతారం ఎత్తి వారి కష్టార్జితం

దోచుకు తినడమేకాక వారిని

కట్టుబానిసలుగా మార్చి తొక్కేసే

బంధుగణాలను చూస్తూనే

ఉన్నాం. గాయని లీల, నటి

కాంచన లాంటి ఎందరో

కాంప్రమైజ్ అయి అష్టకష్టాలు

పడితే ఆత్మహత్యలు చేసుకున్న

వారి సంఖ్య తక్కువేమీ కాదు.

పేరుప్రఖ్యాతులు, డబ్బు వెనక

హృదయాల్ని పిండేసే చీకటి

కోణాల బాధామయ గాథలెన్నో.
- శుభ, కాకినాడ

‘మీ వ్యూస్’కు
మీ అభిప్రాయాలను

పంపవలసిన
మా చిరునామా : ఎడిటర్,

వెన్నెల,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ ,

సికిందరాబాద్- 500003

మీ వ్యూస్
english title: 
your views

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>