తెలుగుసినిమా అంటే మంచి పాటకు చిరునామా. పాటలు లేకుండా సినిమా చూడ లేకపోవడం అన్న అభిరుచి ఇప్పటికీ అలాగే నిలిచివున్నా, సాహిత్యపు విలువలు మాత్రం నానాటికీ తీసికట్టవుతున్నాయ. కొత్త పాటలు బాగులేవని గొంతు చించుకోవడం కన్నా, పాత పాటల్లోని మాధుర్యాన్ని ఓసారి గుర్తు చేసుకోవడమే ఈ శీర్షిక ఉద్దేశం. పాఠకులు కూడా తమకు గుర్తున్న మంచి పాటలను కార్డుపై రాసి పంపించవచ్చు. బాగా పాపులర్ అయన పాత పాటల కన్నా, మరిచిపోతున్న మంచిపాటలను గుర్తుచేయడం ముఖ్యం.
ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
సామీ.. ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడీ చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
సామీ.. ఎక్కడో దూరాన కూర్చున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
సామీ.. ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
సామీ.. ఎక్కడో దూరాన కూర్చున్నావు
పెరుగుతుంది వయసని అనుకుంటాము
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
పెరుగుతుంది వయసని అనుకుంటాము
కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా
మా కళ్ళముందు మాయ తెరలు కప్పేస్తావు
సామీ.. ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఎక్కడో దూరాన కూర్చున్నావు
సామీ.. ఎక్కడో దూరాన కూర్చున్నావు
===========
ఈ పాట మీకు తెలుసా?
ఏ సినిమాలోది?
గీత రచయిత ఎవరు?
సంగీత దర్శకుడు ఎవరు?
మాకు తెలియచేయనక్కరలేదు..
మీరు గుర్తు చేసుకుంటే చాలు..
తెలియకుంటే, వివరాలు వచ్చేవారం ఇక్కడే.
==============
గతవారం పాట
సినిమా: సుమంగళి
సంగీతం: కె.వి.మహదేవన్
రచయిత: ఆత్రేయ