ఏప్రిల్ 30 ఫాల్కే జన్మదినం సందర్భంగా
==============
మనుషులు రెండు రకాలుగా ఉంటారు. సమాజంతోపాటుగా నడిచేవారు.. సమాజాన్ని తనతో నడిపించేవారు. రెండవ కోవకు చెందిన వ్యక్తులు చరిత్రను సృష్టిస్తారు. చరిత్రలో మిగులుతారు. తరానికొక్కరో ఇద్దరో చరిత్ర పురుషులుంటారు. వారు శతవత్సరాలు జీవిస్తారు.. శత శత వర్షాలు స్మరణీయులుగా కీర్తించబడతారు.
భారతీయ సినిమాను తలుచుకొన్నవారికి... చరిత్రను అవలోకించిన వారికి గుర్తుకువచ్చే పేరు.. భారతీయ సినిమాలో సమాంతరంగా భావితరాలు గుర్తుచేసుకొనేవారు...దాదాసాహెబ్ ఫాల్కే.
ఎవరీ ‘్ఫల్కే’...?
మహారాష్టల్రోని ఉత్తరప్రాంతంలో ‘నాసిక్’ ఉంది. దీనిని గురించి బహుశ తెలియనివారంటూ మన దేశంలో ఉండకపోరంటే అతిశయోక్తికాదు. ఈ పట్టణానికి దగ్గర్లో ‘త్రయంబకేశ్వర్’ ఉంది. ఇది గోదావరి ఆగమ స్థానం. జ్యోతిర్లింగ స్థానం. పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకానొక సంస్కృత పండిత ఇంట్లో దాదాపు 143 సం.రాల క్రితం... అనగా ఏప్రిల్ 30 1870న జన్మించాడు. ‘్ధండిరాజ్’. బొమ్మలను బ్రహ్మాండంగా గీసేవాడు.. చిన్నతనంలోనే చిత్రకారునిగా పేరుప్రఖ్యాతులను గడించాడు. మంచి పేరుప్రతిష్టలున్న ‘జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’ ముంబయి చేరాడు. 1890లో బరోడాలోని ‘కళాభవన్’ చేరుకొని శిల్పకళ, ఇంజనీరింగ్, పెయింటింగ్, ఫొటోగ్రఫీలో తర్ఫీదు పొందాడు.
వివాహం జరిగింది.. ఒక కొడుకు పుట్టాడు.. కాని.. విధి బలీయం కదా!.. ‘ప్లేగ్’వ్యాధితో భార్య, కుమారుడు మరణించారు. కనరాని కటిక చీకట్ల అగాధపుపొరల్లో ఇరుక్కుపోయిన విధంగా ‘్ధండిరాజ్’ వేదనను అనుభవించాడు. అదీ కొద్దికాలమే..
అదృష్టం కొందరిని వెదుకుతుంది..
అదృష్టాన్ని కొందరు వెదుకుతూ.. ఉంటారు.
మొదటి కోవకు చెందిన అదృష్టశాలి ‘్ధండిరాజ్’.
ఒకరోజు..
మూవీ కెమెరా సృష్టికర్త ‘లుమియరే సోదరుల’తో పనిచేసే ‘కార్ల్‌హెర్ట్‌జ్’ తారసపడ్డాడు. ధుండిరాజ్ తన మకాంను ముంబాయికి మార్చాడు. ‘ఆర్కియాలజీకల్ సర్వే’కు అక్కడనుంచి ‘లిథోగ్రఫి’, ‘ఒలియోగ్రాఫ్’లో తర్ఫీదుపొంది ‘రాజారవివర్మ’లాంటి దిగ్గజాల చెంత చేరాడు. ‘ప్రింటింగ్ ప్రెస్’ను ఏర్పాటుచేసుకొన్నాడు... ఆ రంగంలో మెళకువలను నేర్చుకోవటంకోసం జర్మనీ వెళ్ళాడు. భాగస్వాములతో విభేదాలు వచ్చాయి.
ఏం చేయాలి.. ఆలోచనలు.. అదృష్టం ‘్ధండిరాజ్’ను వరించింది..
‘ది లైఫ్ ఆఫ్ జీసస్‌క్రైస్ట్’అనే సినిమా అతనిని ఆకర్షించింది. అతని దశ దిశలు నిర్ణయమైపోయాయి.
విజేతలు అవకాశాలను వెదకరు.. అవకాశాలను సృష్టిస్తారు.
‘‘తెరమీద దేవుడు కదలటమా..’ బుర్ర గోక్కున్నాడు. రాత్రంతా ఆలోచనలమధ్య గడిపాడు.. తెల్లవారి ఆచరణలోకి దిగాడు. భారతీయులకు 33కోట్ల మంది దేవతలున్నారు.. పురాణాలు.. ఐతిహాసాలు.. పుంఖాను పుంఖాలుగా కథలు..సరదాగా..వాళ్ళను తెరమీదకు తెస్తే..
అలా పట్టుదలతో.. సీరియస్‌గా.. ధుండిరాజ్ తెరకెక్కించిన, నిర్మించిన తొలి చిత్రం. భారతీయ తొలి మూకీ ‘రాజాహరిశ్చంద్ర’ మే 3, 1913నాడు ముంబాయి ‘కొరోనేషన్ సినిమాగృహం’లో ప్రదర్శించబడింది.
తెరమీద కదిలే దేవతలను చూసి.. జనం ‘అమ్మో’అనుకున్నారు.. ‘వారు శపిస్తారని’ భయపడ్డారు. భలే ‘చిత్రమ’ని ఆశ్చర్యపోయారు.. మెల్లగా అలవాటుపడ్డారు..
‘్ధండిరాజ్’ చరిత్ర సృష్టించాడు.
కాని.. అంతకుమునుపే.. రామచంద్ర తొర్లీ (దాదాసాహెబ్ తోర్లే) ఒక సంవత్సరం క్రితమే (1912) ‘పుండరీక్’అనే నాటకాన్ని రికార్డుచేసి తెరమీద చూపించారు. అయితే..దాని నిర్మాణంలో బ్రిటిష్ సినిమాటోగ్రాఫర్ల కృషి ఉండటం చేత- సంపూర్ణ ‘్భరతీయతతో’ తయారైన చిత్రంగా ‘రాజాహరిశ్చంద్ర’ను గుర్తించిన కారణంగా భారతీయ సినీ పరిశ్రమకు ఆధ్యుడుగా ‘్ధండిరాజ్’కు కీర్తిలభించింది.
‘్ధండిరాజ్... ‘దాదాసాహెబ్’ మహారాష్టల్రో అసలు పేరుకు బదులుగా ‘బాబాసాహెబ్’, ‘నానాసాహెబ్’, ‘తాత్సాసాహెబ్’ అని గౌరవనీయమైన, ముద్దుపేర్ల సంభోదన రివాజు. గొప్ప గొప్ప వారిని ఇలా గౌరవప్రదమైన పేర్లతో పిలవటం ఆ రాష్ట్ర ఆచారం (ఆ పేరుగల వారంతా నిజంగా గొప్పవారేనా అనే శషభిషలు మనకనవసరం). ఆ విధంగానే చరిత్ర సృష్టించిన ‘్ధండిరాజ్’ను ‘దాదాసాహెబ్’గా గౌరవించారు.
నిజంగా... ‘్ధండిరాజ్’ గొప్ప సృజనశీలి.. కళాస్వాప్నికుడు. కలలను కన్నాడు.. వాటిని‘కళ’గా రూపాంతరంకావించిన గొప్ప ‘మాంత్రికుడాయన’. కనుకనే ఆయనను ‘దాదాసాహెబ్ ఫాల్కే’గా సినీ జగత్తు, ప్రపంచం కీర్తించింది.
దాదాసాహెబ్ ఫాల్కే.. 19 సంవత్సరాల కాలంలో 95 సినిమాలు.. 26 లఘుచిత్రాలను నిర్మించారు. వాటిలో ముఖ్యమైనవి. మోహినీ భస్మాసుర (1913), సత్యవాన్ సావిత్రి (1914), లంకాదహన్ (1917), శ్రీకృష్ణజన్మ (1918), కాలియామర్ధన్ (1919). ఆఖరు సినిమా గంగావతరణ్ (1937).. ఆసరికి ‘టాకీ’లు ‘మూకీ’లను ఇబ్బందుల పాలు చేసాయి. ఫాల్కే సాబ్.. క్రొత్త సాంకేతికతను అందుకోలేక అస్త్ర సన్యాసం చేసారు. 16 ఫిబ్రవరి 1944న ఆఖరు శ్వాస తీసుకున్నారు.
సింహం జీవించి ఉన్నా.. మరణించినా.. విలువ తగ్గదు.. భారతీయ సినిమాకు ఆద్యుడుగా ఆయనందించిన ‘ఆక్సిజన్’ నేటి సినిమాకు ‘ప్రాణ వాయువు’ కనుక ‘దాదాసాహెబ్’ చిరస్మరణీయుడు.
‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం
‘్భరతీయ సినిమా పితామహుడు’ అయిన ‘దాదాసాహెబ్ ధుండిరాజ్ గోవిందఫాల్కే’ పేరున ప్రతీయేటా ఆయన జన్మ శతాబ్ది సందర్భంగా 1963 నుండి ‘్ఫల్కే’ పురస్కారంను... భారతీయ సినిమాకోసం గణనీయంగా సేవలు చేస్తున్నవారికి అందిస్తున్నారు. ప్రారంభంలో పురస్కారంగా 11,000 రూ. నగదు, బంగారు పతకం, శాలువలను అందించేవారు. ప్రస్తుతం.. స్వర్ణకమలం, శాలువతోపాటు 10,00,000 నగదును అందిస్తున్నారు.
ఇంతవరకు పురస్కారం అందుకొన్నవారు..
దేవికారాణి, సులోచనా, కానన్‌దేవి, పృథ్వీరాజ్‌కపూర్, రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్, దేవానంద్, అశోక్‌కుమార్, శివాజీగణేశన్, నౌషాద్, భూపేన్ హజారికా, లతా-ఆశాలకు, సత్యజిత్‌రే, వి.శాంతారాం, బాలాజీ, బి.ఆర్.చోప్రా, యాష్‌చోప్రా, హృషికేష్, మృణాల్‌సేన్, ఆదూరి గోపాలకృష్ణన్, బాలచందర్. ప్రస్తుతం హిందీ నటుడు ప్రాణ్.
తెలుగువారు: పైడిజయ్‌రాజు (1970), బి.ఎన్.రెడ్డి (1974), ఎల్.వి.ప్రసాద్ (1982), బి.నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), డి.రామానాయుడు (2009).
బాపు, ఘంటసాల, సుశీల, జిక్కి వంటి వారికి ఎందుకు లభించలేదో...!?
‘‘ఒక వ్యక్తి ఆశలు.. ఆశయాలు.. గొప్పవయితే..అతను అత్యున్నతమైన ప్రమాణాలతో క్రియలను సాధ్యంచేసి ఉంటే... అటువంటివారి చరిత్ర భావితరాలకు ఎన్నో పాఠాలను నేర్పుతుందనే’ మహాత్ముని మాట దాదాసాహెబ్‌కు అక్షరాల వర్తించే సత్యం...
ఏప్రిల్ 30 ఫాల్కే జన్మదినం సందర్భంగా
english title:
phalke
Date:
Friday, April 26, 2013