అతడికి స్థిరత్వం లేదు. కెరీర్‌లో దూసుకెళ్లే తత్వం ఉండదు - అంటోంది తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌దీప్ హూండా గురించి. రెండేళ్ల పాటు వల్లె వేసిన ప్రేమ పాఠాలన్నీ -గతం గతః- అన్నట్టు నిర్మొహమాటంగా హాట్‌హాట్ న్యూస్ చెప్పేస్తోంది ‘గోదావరి’ సినిమాలో బావపై మనసున్నా - స్థిరత్వం లేదని మనసున్న వాణ్ణి వదిలేసుకున్న నీతూ చంద్ర. సినిమాలో తనకి జాంగ్రీ కావాలో.. బాదుషా కావాలో తేల్చుకోలేని అమ్మడు రియల్ లైఫ్‌లోనూ రెండేళ్లు తర్జన భర్జన అనంతరం రణ్‌దీప్ తన సరిజోడు కాదని తేల్చేసింది. మొన్నటిదాకా ‘కళ్లల్లో కళ్లు కలిపి చూడు - గుండెల్లో గుండెవై చూడు’ అంటూ ఐటెం సాంగ్‌లేసుకొని - మీడియాకి అడ్డంగా బుక్కై పోయిన నీతూ - రణ్‌దీప్ ‘ఎవరికి వారే ఈ లోకం - రారు ఎవ్వరూ నీ కోసం’ అంటున్నారు. కొన్నాళ్లు సుస్మితా సేన్‌తో డేటింగ్ వ్యవహారం నడిపిన రణ్‌దీప్ ఆ ముచ్చటా ముగియటంతో.. నీతూ చంద్ర వెంట పడ్డాడు. ఏ ముహూర్తాన నీతూ దరి చేరాడో? అప్పట్నుంచీ అవకాశాలు దూరం జరిగిపోయాయి. డైరీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. దీంతో సంపాదించలేని ప్రియుడు ఎందుకూ కొరగాడని - నీతూ చంద్ర సైతం వదిలేసింది. గ్రహస్థితి మారింది. ఇక అవకాశాలే అవకాశాలట రణ్‌దీప్‌కి. దీన్నిబట్టి అర్థమైంది ఏమిటంటే - నీతూ గ్రహాలే బాలేదని. ఏది ఏమైతేనేం - ప్రస్తుతానికి ఇద్దరూ హేపీస్.
ముంబై టాక్
english title:
mumbai talk
Date:
Thursday, April 25, 2013