** ‘గుండె జారి గల్లంతయ్యిందే’ (ఫర్వాలేదు)
తారాగణం: నితిన్, నిత్యమీనన్, ఇషా తల్వార్, అలీ, తాగుబోతు రమేష్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: నిఖితారెడ్డి
దర్శకత్వం: కొండ విజయకుమార్
‘ఇష్క్’తో హిట్ కొట్టేసిన నితిన్ మరో క్యూట్ లవ్‌స్టోరీ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ చిత్రంలోని గుండెజారి గల్లంతయిందే...అనే పాటలోని చరణాన్ని తీసుకుని ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టారు. కేవలం టైటిల్‌కే పరిమితం కాకుండా సందర్భానుచితంగా పవన్ చిత్రాలు, దృశ్యాలు, పాటల రిథమ్,సంగీతం వాడుకోవడం ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. డబుల్ ధమాకా అన్నట్టు ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి గుత్తాజ్వాల స్పెషల్ ఐటమ్ సాంగ్ ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా గుర్తింపునకు దోహదం చేసింది. నటించకున్నా, హావభావాలు పలికించకున్నా, గుత్తా ఒంపుసొంపులతో అందరి చూపులు ఆకట్టుకుంది. నితిన్-నిత్య మీనన్‌ల కెమిస్ట్రీ సెంటిమెంట్ ఈ సినిమాకు మరింత వర్కవుట్ అయిందనిపిస్తోంది. ఇష్క్ కంటే ఎక్కువ ఫన్ ఎలిమెంట్‌తో పాటు నితిన్-నిత్య మీనన్‌లు ఇద్దరికీ ఎక్కువ షేడ్స్ ఉన్న చిత్రం ఇది. ఈ సీజన్‌లో ఏ సినిమా చూడని వారికి ఈ సినిమా సూపర్ కింద లెక్క. ఏదైనా సినిమా చూసిన వారికి సూపర్‌డూపర్ కింద లెక్క.
లవ్ ఎట్ ఫస్టు సైట్ అనుకునే అబ్బాయి, తనేంటో, తన స్టేటస్ -బ్యూటీ ఏమిటో తెలియకుండా ఉండే పెరఫెక్ట్ అబ్బాయి దొరకాలని, తానంటే పడిచచ్చిపోవాలనుకునే అమ్మాయి, ప్రాక్టికల్‌గా ఆలోచించే మరో కూల్ అమ్మాయి మధ్య నడిచే స్వీట్ మ్యాజిక్ కన్ఫ్యూజన్ లవ్ డ్రామా గుండెజారి గల్లంతయ్యిందే...పాత కథకే కొత్తగా ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో సినిమా చూసిన వారి గుండె థ్లిల్లింతకావడం ఖాయం. మండువేసవిలో చల్లని విహారయాత్రకు వెళ్లిన ఫీల్ కలిగేలా సింపుల్ కథతో దర్శకుడు సరదాగా నడిపించిన తీరు అందర్నీ హత్తుకుంటుంది. ‘ లవర్ నుండి తనకిచ్చే ఫ్లవర్ దాకా ఎవడి సినిమా వాడే తీసుకోవాలి..’, ‘్ఫన్‌లో గంటలు గంటలు సోది, సినిమాలు, పార్కులు మహా చిరాకు, ఐ లవ్యూ అని కూడా చెప్పలేను, కాని ప్రేమిస్తా...’ ‘ అమ్మాయిలు లవ్‌ను కట్ చేయరు....టైమ్ వచ్చినపుడు లవర్‌ని కట్ చేస్తారు..’ ‘ఆడప్లిలల మనసును అర్ధం చేసుకోవడానికి ట్రై చేయండి- అంత కన్నా బుద్ధి తక్కువ పని మరొకటి లేదు...’ ‘అయినా మగదేవర్ల సంగతి తెలీదా..అమ్మాయి షేక్ హాండ్ ఇస్తే ముద్దుపెట్టుకుందంటారు...హాండ్ ఇస్తే అన్నీ అయిపోయాయి అంటారు..’ వంటి డైలాగ్‌లు సినిమాలో బోలెడు...ఈ తరం యువతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఫ్రేమ్‌లో తీసుకున్న శ్రద్ధ నిత్యామీనన్ నటనలో మెచ్యూరిటీని, ప్రతిభను ఎలివేట్ చేసిందనే చెప్పుకోవాలి.
కార్తీక్ (నితిన్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తల్లిదండ్రులు అమెరికాలో ఉండటంతో ఇక్కడ సింగిల్‌గానే ఉంటాడు. తన రూమీట్ పండు(అలీ) పెళ్లిలో శృతి (ఇషాతల్వార్)ని చూసి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కాని ఆమె ఎవరో, ఎక్కడ ఉంటుందో తెలియక, ఆమె ఫోన్ నెంబర్ చెప్పమని అలీని కోరతాడు. నెంబర్ తీసుకుని తన ఫ్రెండ్ నితిన్‌కు చెప్పే క్రమంలో మందు మైకంలో అసలు నెంబర్ చెప్పకుండా రాంగ్ నెంబర్ ఇస్తాడు అలీ. ఆ రాంగ్ నెంబర్ ఉన్నత హోదా వివిఐపి కుమార్తె శ్రావణి(నిత్యామీనన్)ది. తను చూసిన అమ్మాయే అనుకుని ఆమెకు తరచూ ఫోన్ చేస్తుంటాడు. తన స్టేటస్, వివరాలు తెలియని అబ్బాయితో ప్రేమలో పడాలని ఆశించిన నిత్యామీనన్‌కు ఆ ఫోన్ వెళ్తుంది. చివరికి తాను మనసు పారేసుకుంటున్న అమ్మాయి, తను ప్రేమించిన అమ్మాయి కాదని తెలుసుకుంటాడు. దాంతో తాను శృతి (ఇషా తల్వార్) అనే అమ్మాయిని ప్రేమించానని, ఆమె నెంబర్ అనుకుని ఫోన్ చేశానని నిజం చెప్పేస్తాడు. వీలైతే ఆమెను కలిసేందుకు సహాయం చేయమని కోరతాడు. దాంతో నితిన్ ప్రేమించడం లేదని తెలుసుకుని మదనపడిన నిత్యామీనన్ ఆయనపై రివేంజ్‌కు సిద్ధమవుతుంది. నితిన్ పనిచేసే కంపెనీకే బాస్‌గా ఉద్యోగంలో చేరుతుంది. కంపెనీ బాస్ హోదాలో నితిన్‌ను తనవైపు తిప్పుకుంటుంది. తనను బాస్ ప్రేమిస్తోందని ఉవ్విళ్లూరుతున్న నితిన్‌కు బుద్ధిచెప్పాలని నిత్య భావిస్తుంది. మరో పక్క ఇంకో స్నేహితుడు తన గర్ల్ ఫ్రెండ్‌ను లైన్‌లో పెట్టడం ఎలాగో ఎప్పటికపుడు చెబుతూ నితిన్‌కు సహకరిస్తాడు. కాని చివరికి తాను ప్రేమించిన అమ్మాయి తనేనని తెలుసుకుని కుమిలిపోతాడు. ఈ రెండు జంటలతో పాటు అలీ, తాగుబోతు రమేష్, మధ్యలో ఒక గే (రవి) చేసే గోల అన్నీ కలిపి సినిమాను పతాకస్థాయికి తీసుకువెళ్తాయి. చివరికి వీరిద్దరి వ్యవహారం ఏమైంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా. సరదాగా, ఆసక్తిగా దర్శకుడు సినిమాను పరుగులెత్తిస్తాడు. శుభం కార్డు పడేవరకూ ప్రేక్షకుడిలో ఉత్సుకత పోకుండా వినోదభరితంగా, అనేక మలుపులతో సెంటిమెంట్ మేళవించి, ఆసక్తికరంగా తీయడంలో దర్శకుడు కొండ విజయకుమార్ జాగ్రత్త పడ్డాడు. కన్నీళ్లు, ప్రేమికులు విడిపోవడాలు, ఆత్మహత్యలు లేకుండా చూడటం కూడా ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్ . హర్షవర్ధన్ ముద్దుముద్దు మాటలు చిత్రానికి ఆయువుపట్టు. దీనికి తోడు ఐ ఆండ్రు కెమరా పనితనం ప్లస్ అయింది.
నితిన్ చాలా ఎనర్జిటిక్‌గా, కూల్‌గా, గట్టి నమ్మకంతో సినిమాకు పనిచేశాడు. దానికి తన అక్కే నిఖితరెడ్డి నిర్మాత కావడం ఉపయోగపడింది. ప్రేమ సన్నివేశాల్లో లవర్‌బాయ్‌గా , మరో పక్క ఫైట్ సన్నివేశాల్లోనూ అదుర్స్ అనిపించాడు. సినిమా అంతా తన భుజాలపై వేసుకుని నడిపించిందా అన్నంతగా నిత్యామీనన్ నటన తారాస్థాయిలో ఉంది. ప్రేమలో పడిన అమ్మాయిగా, ఆఫీసులో బాస్‌గా నిత్యా అభినయం చాలా బాగుంది. సుదీర్ఘమైన డైలాగ్‌లతో అరుంధతిలో అనుష్క చేసిన పాత్ర కాకపోయినా, ఏమిటి? ఎక్కడ ? ఎందుకు? నేనానా? నువ్వు? ఇలా చిన్న చిన్న పొడిపొడి మాటలు చెప్పించడం ఆ క్యారెక్టర్‌కు రిచ్‌నెస్ తెచ్చాడు.
సినిమాలోని ఐదు పాటలు...‘గుండె జారి గల్లంతయ్యిందే...ఓ తూ హై..రే..పాట, డింగ్ డింగ్ డింగ్, నీవే నీవే నీవే ,అనూప్ మిక్స్ పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. ఒక పాటలో తాగుబోతు రమేష్‌తో, మరో పాటలో నితిన్‌తో, ఇంకోపాటలో నిత్యమీనన్‌తో పాటించిన ప్రయోగం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.