ఈనీడ్ (వర్జిల్ రచన)
తెలుగులోకి అనువాదం:
లంకా శివరామప్రసాద్
ప్రతులకు:
విశాలాంధ్ర వారి
అన్ని శాఖలు
పేజీలు: 250+
వెల: రూ. 250/-
మన దేశంలో ప్రాచీన చరిత్రను చెప్పే పురాణ ఇతిహాసాలున్నాయి. మనలాగే ప్రాచీన నాగరికులయిన గ్రీసు వారికి ఇలియడ్, రోమనులకు ‘ఈనియిడ్’ అనే రచనలున్నాయి. వాటిలో కూడా మన పురాణ ఇతిహాసాలలో వలెనే అప్పటి రాజుల కథలు కవితా రూపంలో ఉన్నాయి. ఈనియిడ్ లేదా ఈనీడ్ అనేది ఈనియస్ అనే రాకుమారుని ప్రయాణ వృత్తాంతం. ఈ కథలను ఇంగ్లీషులో వచన రూపంలో చాలాకాలంగా చదువుతూనే ఉన్నారు. తెలుగులో ఈ రచనలు లేవన్న లేమిని పూర్తి చేస్తూ శివరామప్రసాద్ తనదైన శైలిలో ఈ పుస్తకాన్ని పాఠకులకు అందిస్తున్నారు.
‘వ్యాసుడు, హోమర్, వర్జిల్’ అనే శీర్షికతో పుస్తకం మొదట్లో రాసిన ప్రస్తావన చదవరులకు విషయం గురించి పరిచయంగా ఉంది. ఈ కథలోనూ, ఇలియడ్, ఒడెస్సీలోను మన ఇతిహాసాలలోలాగే దేవతలు, వారికి మానవులతో సంబంధాలు, పై లోకాలు, పాతాళాలు, నరకాలు లాంటి హంగులన్నీ ఉన్నాయి. గ్రీకు, రోము నాగరికతల వారికి మన దేశంతో మంచి సంబంధాలు ఉండేవట. అయినా ఈ కథలలోని పోలికల గురించి మరింత తరచి చెప్పవలసిన బాధ్యత పండితుల మీద ఉంది. ప్రస్తుత ప్రచురణలో కూడా కథను కథగా గాక, కవితా రూపానికి, వచన పద్ధతిలో అనువాదంగా రాసినట్లు అర్థమమవుతుంది. కథా గమనంలో వెనక ముందులు (్ఫ్లష్‌బ్యాక్), వాక్య నిర్మాణం అందుకు సూచనలు.
ట్రాయ్ నగరం ధ్వంసమయింది. రాకుమారుడు ఈనియస్ భార్య పోయింది. అతను తండ్రిని ఎత్తుకుని, కొడుకుని నడిపిస్తూ కొంత పటాలంతో ఇటలీకి బయలుదేరాడు. అక్కడతను ఒక కొత్త నగరాన్ని, రాజ్యాన్ని స్థాపించవలసి ఉంది. రోమనులు కావలసి ఉంది. జూనో అనే దేవతకు పాత కక్షల కారణంగా ఇది నచ్చదు. అందుకే ఈనియస్ ప్రయాణానికి అడ్డంకులు కలిగిస్తుంది. కానీ ఈనియస్ తల్లి వీనస్, సంబంధాల దేవత కొడుకును కార్తేజ్‌కు చేరుస్తుంది. మన మన్మధుడు లాంటి ఆమర్, అక్కడి (్భర్తలేని) రాణితో అతనికి ప్రణయబంధం కలుపుతాడు. కాలం గడుపుతున్న కొడుకుకు వీనస్ దూత ద్వారా కర్తవ్యబోధ చేస్తుంది. అతను డీడో రాణిని వదిలి పడవలతో బయలుదేరుతాడు. డీడో ఆత్మహత్య చేసుకుంటుంది. కథతోబాటు ముందుకు సాగుతూ ‘హీరో’ అధోలోకాలను, అక్కడ తండ్రిని, ప్రియురాలిని చూడగలుగుతాడు.
కథ ఈ రకంగా రసవత్తరంగా నడుస్తుంది. లాటియం రాజు తన బిడ్డను ఈనియస్‌కు భార్యగా ఇవ్వబూనడం, అక్కడ కూడా విలన్లు, కథ మరింత రసవత్తరమవుతుంది. ఈనియస్‌కు నదీ దేవుడు కలలో వచ్చి కొత్తవారితో పరిచయాలు, సాయం ఏర్పాటు చేస్తాడు. ట్రాయ్‌లో దాడులు, యుద్ధం, అందులో విరామం, దానికి భంగం..ఎన్ని కావాలో అన్ని మలుపులు. టర్నస్ అనే ప్రతినాయకుడు, ఈనియస్ బావమరిది పల్లాస్ మరణం, ద్వంద్వ యుద్ధం ప్రతిపాదన.. తరువాతి కథ సవివరంగా పుస్తకంలో చదవాల్సిందే!
మన వారికి చాలా మందికి భారత రామాయణ కథలే తెలియవు. సినిమాల్లో చూచిన కథతో అందరూ సంతృప్తి పడుతుంటారు. అలాంటిది రోమను ఇతిహాసం (అనువాదకుడు దీన్ని మహాకావ్యం అన్నాడు) చదివేంత ఓపిక పుడితే మంచిదే. చదవగలిగితే మాత్రం చాలా సరదాగా ఉంటుంది. ఈ అనువాద రచనను మరీ కవితా ధోరణిలో రాశారు. వాక్య నిర్మాణం అక్కడక్కడ తికమక పెడుతుందేమో? ‘అతని నావిక మిత్రులంతా శవంగా మారి తీరానికి చేరిన మిత్రుని చుట్టూ చేరి’ ఎవరు శవంగా మారింది? కేవలం కథగా చెప్పడానికి ప్రయత్నిస్తే మరింత బాగుండేదేమో?
పుస్తకం నిండా, అడుగడుగునా కొత్త పాత్రలు, వారి పేర్లు, వాటిని పలికే తీరు విషయంలో ఇంకొంచెం పరిశోధన అవసరమనిపిస్తుంది. బ్రాకెట్లలో ఇంగ్లీషు అక్షరాల్లో పేర్లున్నాయి. అయినా అలనాటి గ్రీకు రోమను పేర్లను పలకడం కష్టమే. (నిజానికీ బ్రాకెట్ పేర్లు చదువుతుంటే అడ్డు తగులుతున్న భావం కలిగింది. పేరేదయితేనేమి అనుకున్న వారిని కూడా కాసేపు ఆపుతున్నాయి. ట్రైటన్-ట్రిటాన్, ఎకిలిస్-ఎఖిల్లిస్, క్రీట్-క్రెట్ లాంటి పేర్లలోనే తేడాలు కనిపించాయి.
‘స్ర్తిల ఆలోచనలు గాలి లాంటివి’ లాంటి మాటలు మానవులు ప్రపంచమంతటా ఒకేరకంగా ఆలోచించారనడానికి ఉదాహరణలు. స్వేచ్ఛానువాదం మరింత స్వేచ్ఛగా జరిగితే మరింత బాగుండును. అయినా ఓపికగా చదివిన వారికి, ఈ రచన తప్పక ఆసక్తికరంగా ఉంటుంది. ఈ అనువాదకుడు మరో ఆరు రచనలు వెలువరించినట్లు వివరం పుస్తకంలో ఉంది. ఈ రకం పుస్తకాలు తెలుగులో రావడం ఆనందించవలసిన విషయం.
-కె.బి.గోపాలంన దేశంలో ప్రాచీన చరిత్రను చెప్పే పురాణ ఇతిహాసాలున్నాయి. మనలాగే ప్రాచీన నాగరికులయిన గ్రీసు వారికి ఇలియడ్, రోమనులకు ‘ఈనియిడ్’ అనే రచనలున్నాయి. వాటిలో కూడా మన పురాణ ఇతిహాసాలలో వలెనే అప్పటి రాజుల కథలు కవితా రూపంలో ఉన్నాయి. ఈనియిడ్ లేదా ఈనీడ్ అనేది ఈనియస్ అనే రాకుమారుని ప్రయాణ వృత్తాంతం. ఈ కథలను ఇంగ్లీషులో వచన రూపంలో చాలాకాలంగా చదువుతూనే ఉన్నారు. తెలుగులో ఈ రచనలు లేవన్న లేమిని పూర్తి చేస్తూ శివరామప్రసాద్ తనదైన శైలిలో ఈ పుస్తకాన్ని పాఠకులకు అందిస్తున్నారు.